భక్త తుకారాం - శ్యామ సుందరా - హ్రుదయాన్ని కదిలించే కమనీయ ఆధ్యాత్మిక రస గీతాలు జీవిత సత్యాలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,470; 104 తత్వాలు (Tatvaalu) and views 225,153.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Bhakta Tukaram - Heart touching lovely spiritual songs life truths - ANR, Anjali, Sivaji Ganesan
భక్త తుకారాం - శ్యామ సుందరా - హ్రుదయాన్ని కదిలించే కమనీయ ఆధ్యాత్మిక రస గీతాలు జీవిత సత్యాలు - ANR, అంజలి, శివాజీ గణేశన్

ఆ గొప్ప భక్తుని పాటను మనమూ ప్రయత్నము చేద్దాము. ఆ పదాల అల్లిక చూడండి. మన అరిషడ్వర్గాల సాధన మొత్తము తెలిక సామాన్య పదాలలో ఎంత బాగా చెప్పారో.

* మన జీవితం క్షణ భంగురము అని తెలిసి, దేవం పై మోహం ఎందుకు రా అన్నారు. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా, మరి ఇప్పుడైనా చేద్దామా?

* ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేరవచ్చురా, చేద్దామా?

* అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు, దొడ్డమానులను కూల్చు తుఫాను, గడ్డి పరకను కదల్చగలదా, కదల్చగలదా, చిన్న చీమలకు చక్కెర దొరుకును, గొప్ప మనిషికి ఉప్పే కరువు - నిజాలు కావా?

* పడవెళ్ళొపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారేదిరా, ఈ జీవితము కెరటాల పాలాయెరా. నీ భారమతడే మోసేనురా ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా - వ్యామోహ బంధాల లో నశించి వ్రుధా కావలసిందేనా?

* బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు, ఇది శాశ్వతమని తలచేవురా, నీవెందుకని మురిసేవురా, నువు దరిచేరే దారి వెతకరా ఓ మానవుడా.. హరినామం మరువవొద్దురా..

ఇంక నేను చెప్పేది ఏముంది, మోక్ష రహస్యము మొత్తము అరటికాయ వొలిచి పెట్టినంత తెలికగా చెప్పారు మరి, నిర్ణయం మీదే, రేపు మనది కాదు, సమయం లేదు మిత్రమా.

పల్లవి: శ్యామ సుందరా ప్రేమ మందిరా
నీ నామమే వీనుల విందురా 2 శ్యామసుందరా ...

చరణం 1: అణువణువు నీ ఆలయమేరా.. నీవే లేని చోటు లేదురా 2
నీవని నేనని లేనే లేదూ... నీకు నాకు బేధమే లేదు
శ్యామ సుందరా... ప్రేమ మందిరా

సుఖ దుఖాలకు నిలయం దేహం, ఈ దేహము పై ఎందుకు మోహం
అహము విడిచితే ఆనందమురా, అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం బోధలు వింటే, తొలిగిపోవును శోకమురా
శ్యామ సుందరా... ప్రేమ మందిరా

చరణం 2:సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా 2
అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా..
హాయిగ తాగుట సాధ్యమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

కాల సర్పమును మెడలో దాల్చి, పూల మాలగా తలచ వచ్చురా...పూల మాలగా తలచ వచ్చురా
ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేరవచ్చురా..లోకేశ్వరునే చేరవచ్చురా...
దాస తుకారాం తత్వ బోధతో, తరించి ముక్తిని పొందుమురా..తరించి ముక్తిని పొందుమురా...
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

చరణం 3: అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు.. హొహోయ్ 2
దొడ్డమానులను కూల్చు తుఫాను, గడ్డి పరకను కదల్చగలదా.. కదల్చగలదా
చిన్న చీమలకు చక్కెర దొరుకును.., గొప్ప మనిషికి ఉప్పే కరువు.. ఉప్పే కరువు
అణకువ కోరే తుకారాము నీ మనసే దేవుని మందిరము.. మనసే దేవుని మందిరము
హోయ్... అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు.. హొహోయ్
అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు...

హైలెస్సా హైలెస్సా హైలెస్సా 2

పడవెళ్ళిపోతోందిరా...ఆ ఆ ఆ ఆ ఓ ఓ ...
పడవెళ్ళొపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారేదిరా
ఈ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్ళిపోతోందిరా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..2

తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే 2
ఆ పాండురంగడున్నాడురా ఆ ఆ ... నీ మనసు గోడు వింటాడురా
నీ భారమతడే మోసేనురా ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా..
పడవెళ్ళిపోతోందిరా.....

బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు 2
ఇది శాశ్వతమని తలచేవురా ఆ ఆ...
నీవెందుకని మురిసేవురా..
నువు దరిచేరే దారి వెతకరా ఓ మానవుడా.. హరినామం మరువవొద్దురా..
పడవెళ్ళిపోతుందిరా ఆ ఆ......

హైలెస్సా హైలెస్సా హైలెస్సా 3

చిత్రం : భక్త తుకారాం (1973) అక్కినేని అంజలి శివాజి గణేసన్, సంగీతం : ఆదినారాయణరావు, గీతరచయిత : దాశరథి, నేపధ్య గానం : రామకృష్ణ

Bhakta Tukaram - Heart touching lovely spiritual rasa songs Life truths  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,470; 104 తత్వాలు (Tatvaalu) and views 225,153
Dt : 23-Apr-2022, Upd Dt : 23-Apr-2022, Category : Songs
Views : 1029 ( + More Social Media views ), Id : 1365 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhakta , tukaram , spiritual , songs , movie , life , truths , akkineni , anjali , shivaji , ganesan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content