అలా వచ్చి ఇలా వెళుతున్న బలరాం, సొంత నియోజకవర్గాని కే అతిధి - 4 రోజులైనా ప్లీజ్, సొంత గణం మరియు జనం - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,557; 104 తత్వాలు (Tatvaalu) and views 225,078.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కరణం బలరాం కృష్ణ మూర్తి గారు, జననం 31 అక్టోబర్ 1946, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం నుంచి అందరికీ తెలిసిన మరియు అద్దంకి ప్రాంతము లో, ఒక వెలుగు వెలిగిన సుదీర్ఘ అనుభవము ఉన్న రాజకీయ నాయకుడు. చక్కటి నవ్వు, మెత్తటి మాటలు, అందరూ పెద్దయనగా బాబాయి గా ముద్దుగా పిలుచుకుంటారు.

ఆయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. ఇందిరా గాంధీ, ఆయనను 1978 ఎన్నికల్లో అద్దంకి నుండి, కాంగ్రెస్ నామినీగా నిలబెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో 17,912 ఓట్ల మెజారిటీతో, చీరాల నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్యేగా గెలిచారు, బలమైన స్థానిక అభ్యర్ధి ఆమంచి క్రిష్ణమోహన్ గారిపై.

1978-83, 1986-94 & 2004 - 09, 2019 - ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు; 1999 - 13 వ లోక్‌సభ ; 1999-2000 - సభ్యుడు, కమ్యూనికేషన్స్ కమిటీ, లోక్‌సభ ; 2017 - అధికార - సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి

ఎలెక్షన్ ముందు, ప్రజల మధ్యలో ఓట్లు కోసము తిరుగుతూ, నేనున్నా మీకు తోడుగా అంటూ, చీరాలలో ఇప్పటి వరకు జరుగుతున్న అరాచకాన్ని అంతమొందిస్తా, కొండంత ధైర్యముగా తోడు నీడగా ఉంటానని ప్రజలు కు చెప్పారు. చంద్రన్న కు ఉన్న వ్యతిరేక పవనాలలో కూడా, అస్సెంబ్లీ స్థానములో విజయము సాధించి పట్టు నిలబెట్టుకుని, అందరిని ఆశ్చర్యపరిచారు.

ప్రకాశము జిల్లాలో, గతములో టైగర్ అన్న బిరుదు పొందిన, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరామ క్రిష్ణమూర్తి గారు, ఒకనాడు, చీరాల నా ఇల్లు నేను మీ వాడినే మీతోనే ఉంటాను, ఇక్కడే అందుబాటులో ఉంటాను అన్నారు. కానీ గెలిచిన తర్వాత, చీరాలలో మరి ఎక్కడ ఇల్లు తీసుకుని ఉన్నారో, మరి జనాలకు అందుబాటులో లేరు అని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు అభిమానులు, 2 పార్టీలలోనూ ఉన్నారు.

ఎందుకంటే, మొన్నీ మధ్యలో చీరాల అతిధి గ్రుహములో దిగి (చిత్రము 2), పలువురు నాయకులను అధికారులను కలిసారు, పట్టణ పరిస్థితిని సమీక్షించారు. సాధారణముగా బయట ఊరు నుంచి వచ్చే, మంత్రులు మరియు జిల్లా అధికారులు, ప్రభుత్వ అతిధి గ్రుహములో బస చేస్తారు. ఎక్కువగా ఒంగోలు లో కనపడుతూ (చిత్రము 3), అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

గతములో తెలుగు దేశము తరపున గెలిచి, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ తో, కలసి మెలసి ఉంటున్నారు, వారి కండువా కప్పు కోకుండానే. సాంకేతికంగా అస్సెంబ్లీలో ఎమ్మెల్యే పదవికి, ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే, ఇదే అందరూ చేస్తున్న పని కూడా, ఇబ్బంది ఏమీ లేదు, చంద్రబాబు గారూ కూడా అదే పని చేసారు గతములో.

వారి కుమారుడు శ్రీ వెంకటేష్ గారు మాత్రము, పార్టీలో చేరి, కండువా వేసుకుని, చీరాలలో కొన్ని సేవా కార్యక్రమాలలో (చిత్రము 4) పాల్గొంటున్నారు. కానీ ఆ పని అయిన తర్వాత, తాను కూడా నియోజక వర్గము లో ఉండటము లేదు అనుకుంటున్నారు. వెంకటేష్ గారి సేవలు, తండ్రికి తోడుగా, అదనపు సేవల కిందకు వస్తుంది, భవిష్యత్ లో నాయకుడు గా ప్రొజెక్ట్ అవవచ్చు, జనానికీ తెలుస్తారు.

కానీ ఇంకా ఎక్కువగా పాల్గొనాలి, బలమైన ప్రత్యర్ధి ప్రతి రోజూ, ఫేస్బుక్ లో తమ లేదా తమ అనుచరుల కరోనా సేవల ఫోటోలు నింపేస్తుంటే, కరణము గారు లేదా వెంకటేష్ గారి ది వారానికో ఎప్పుడో ఓ 4 పెడుతున్నారు.

ఈ రోజుల్లో, ప్రతిరోజూ సోషల్ మీడియా ఫోటో లేదు, అంటే మనిషి ఉన్నారా? ఏమీ చేయడము లేదా? పోనీ పరాయి ఊరు వెళ్ళినా, ఫోటో పెట్టవచ్చు కదా అంటున్నారు. రాజకీయ నాయకులకు అధికారులకు, ఇప్పుడు ఇది తప్పని సరి అవుతున్నది ప్రజా క్షేత్రములో.

కానీ, వెంకటేష్ బాబు సేవలను, ఎమ్మెల్యే కు బదులు అని మాత్రము అనలేము కదా. ఊళ్ళో ప్రజలకు కనపడాల్సింది, తోడుగా ఉండాల్సింది, ధైర్యము చెప్పల్సింది, ఈ కరోనా కష్టసమయములో, గెలిచిన నియోజకవర్గ ఎమ్మెల్యే నే కదా? అని అనుచరుల గుస గుసలు. ఇలాగే అతిధిలాగా వచ్చి పోతూ ఉంటే, పట్టణము మీద పట్టు సాధించేది ఎప్పుడు? గత అరాచకాలను తవ్వేది ఎప్పుడు? అని అభిమానులు అందోళన చెందుతున్నారు.

రేపు, పంచాయితీ ఎన్నికలు వస్తే, అప్పుడు మరలా కనపడి, ఓటు అడగటము బాగోదేమో, తమ అనుచరుల కోసము అని ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి కైనా, ముందు చూపుతో, కనీసము 4 రోజులైనా చీరాలలో ఉన్నాను అనిపించుకుంటే, ఫేస్బుక్ లో రోజు 4 ఫోటోలు పెడితే కరణం గారు, ప్రత్యర్ధికి పోటీగా ఉన్నట్లు జనము విశ్వసిస్తారు కదా అని అభిమానులు అనుకుంటున్నారు. మిగతా 3 రోజులు వెంకటేష్, తిరుగుతూ ఉంటే బాగుంటుంది.

కరోనా దెబ్బకి పెద్ద వయసు కాబట్టి, లోన ఉన్నారు అనడానికి, టైగర్ మరియు బలమైన ప్రత్యర్ధి ఉన్నవారు అలా అనకూడదు, కనీసము చీరాలలో అయినా, ఇంట్లో ఉంటే సరిపోతుంది అని మంచి కోరే వారి భావన.

ఒంగోలులో అధికారులను కలుస్తున్నప్పుడు, అదే పని, సొంత నియోజక వర్గములో చేస్తే మంచిది కదా, స్థానికముగా బలము పెంచుకుని, తటస్థ ఓటరులను కలుపుకోవాలి, తరచూ కలుసుకోవాలి. అది వారి వెంకటేష్ భవిష్యత్ కి అయినా ఉపయోగపడుతుంది, వచ్చే ఎలెక్షన్ లో కదా అని అభిమానులు ఆశిస్తున్నారు.

ఊరికే మైకు తో మీడియా ముందు అరిచే ఇంట్లో ఉండే నాయకులు కాదు కావాల్సింది, జనము దగ్గరకు పోయి కరణం గారి, మంచిని పనులను చెప్పే చేసే, కార్యకర్తలను పెంపొందించుకోవాలి, ఊళ్ళో ఉండి అని అభిమానుల ఆశ.

ప్రత్యర్ధుల వాదన - కరణము గారు, కేవలము కోవర్ట్ గా అవసరానికి వచ్చి జగన్ వైపు ఉంటున్నారు, అంతే గాని, పూర్తి గా మనతో కలవడము లేదు, స్థానికము గా ఉండరు, చీరాల మీద ప్రేమ లేదు. రేపు అవకాశము వస్తే, మరలా వెనక్కి వెళతారు అని ఆరోపిస్తున్నారు. కరోనా సమయములో, చంద్రన్న రాష్ట్రము బయట ఉంటే, ఈయన ఊరు బయట ఉంటారు. కేవలము ఉనికి కోసము, ఒంగోలు లో నాలుగు మీటింగ్ ల లో కనపడుతున్నారే గాని, కరోనా సమయములో, ప్రజలను దగ్గర ఉండి, అసలు పట్టించుకోవడము లేదని వీరి వాదన.

కరణము గారి అనుచరుల కన్నా, తామే రోజూ ఏదో ఒక విధమైన సేవా కార్యక్రమము తో, పందిళ్ళ పల్లి నుంచి చీరాల వచ్చి ప్రజలను కలుస్తూ, మా సోషల్ మీడియా పేజ్ లో ఫోటొల సాక్ష్యం తో సహా పెడుతున్నాము. ప్రజలే మా పనులు, కరణము గారి పనులు, రోజు వారి ఫేస్బుక్ లో చూసి నిర్ణయము చేసుకుని, సరైన అభ్యర్ధులను, రాబోయే ఎన్నికలలో గెలిపించాలని కోరుతున్నారు. అస్సెంబ్లీ ఎలెక్షన్ కు, జరిగిన పొరపాటు మరలా జరగ కూడదు, అని ప్రజలను కోరుతున్నారు.

త్వరలో మరి కరణము గారి సమాధానము కూడా మీకు తెలియజేస్తాము, అందుబాటులో కి వస్తే.

update :

నిజమైన విలేఖరి కి, ఆమంచి అన్న, కరణం బాబాయి ఇద్దరూ ఒకటే, ఏ రాజకీయ నాయకుడు అయినా అంతే. పొగడాలి, సుతిమెత్తగా తెగడాలి, జనం మాట చెప్పాలి, మంచి మార్గాలు చూపాలి. వాళ్ళు అలాగే స్పోర్టివ్ గా తీసుకోవాలి, ఒకవేళ గౌరవం గా ఖండిస్తే, మనమూ దానిని రాయాలి. విలువ లు మర్యాద, తగ్గకుండా ఉండాలి.

రాజన్న అసలు ఎవరినీ ఏమీ అనరు, ఎంత వ్యతిరేకంగా రాసినా, ఓ ముసిముసి నవ్వు నవ్వుతారు.

నిన్న, జగనన్న ఏమన్నారో విన్నారా, నాకు ఓటు వేయకపోయినా పర్లేదు, అందరికీ పట్టాలు ఇవ్వండి, ఊళ్లో పట్టా లేని వారు ఎవరూ అని అడిగితే, ఆ ఊరు లో ఒక్క చేయీ లెగవకూడదు అని.

సరే, మన లోకల్ రాజకీయాలు వేరు, పెద్ద వారు చేద్దాం అన్నా, చిన్న వారు అడ్డుకుంటారు, మన వారు కాదని. సరే ఎవరికి ఎన్ని గ్రూపులు ఉన్నా, అందరి లక్ష్యం జగనన్న పధకాలను జనం కు చేర్చడం కావాలి.

మా ఊరు, జిల్లా, రాష్ట్రం వేరు, వీరి విషయం మాకెందుకు అనుకోవద్దు? మీ ఊరు, మీ నాయకులు పేర్లు ఇందులో పెట్టుకుని, మీ జనాన్ని ఉత్తేజ పరచే, కృతజ్ఞతలు ఉన్న భారతీయుడివి. వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేల్ తలపెట్టవోయ్ అనే నానుడి గుర్తు చేసుకో.

మనకు చేతకాని పక్షంలో, ఇతరులకు లేదా తగ్గవారికి పంపితే, వారు ఆ పదాలను అల్లు కుని అందుకుని, తమ ఊరు బాగు కోసం పాటుపడాలని.  
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,557; 104 తత్వాలు (Tatvaalu) and views 225,078
Dt : 09-May-2020, Upd Dt : 09-May-2020, Category : Request
Views : 1004 ( + More Social Media views ), Id : 539 , City/ Town/ Village : Chirala , State : AP , Country : India
Tags : karanam balaram , visiting guest mla , chirala assembly , at least 4 days please , TDP YSRCP supporters , public , amanchi krishna mohan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content