Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. కరోనా ఆసుపత్రుల గురించి గతములో రాశాము, మన రాష్ట్ర మంత్రులకు, పెద్దలకు, అన్ని పార్టీల వారికి పంపాము. లింకు లో చూడండి.
Link.
ఇప్పుడు ఏపీ దేవదాయ శాఖ మంత్రి, వెల్లంపల్లి శ్రీనివాస్, మెరుగైన వైద్యం కోసం, హైదరాబాద్ ఆస్పత్రిలో చేరారు, అని వార్త విన్నాము. ముందు సారి, విజయవాడలోని ప్రైవేటు ఆస్పతిల్రో, వారం రోజులకు పైగా చికిత్స తీసుకున్నారు.
ఆంధ్రా ప్రభుత్వ మరియు ప్రవేటు ఆసుపత్రులు, నేటికీ అంతే అని నిరూపించారు. ఇంకొంత మంది, చెన్నై, బెంగుళూర్ లో చూపించుకుంటున్నారు తమ శక్తి కొలది. ఇతర రాష్ట్రాల వైద్యం కోసం వెళ్ళే, మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులకు, ఆంధ్రా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించాలి అనుకుంటా.
జనాలలో కలసి మెలసి ఎప్పుడూ ఉండే తిరిగే, తిరుపతి ఎమ్మెల్యే భూమన గారికి, సీఎం వైఎస్ జగన్ ఫోన్ లో పరామర్శ చేసారు, గత శని వారం. రెండవ సారి కరోనా సోకి, చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అన్న విషయము మీకు తెలుసు. తర్వాత వారి ఫేస్బుక్ లో సమాచారం లేదు.
కరోనా తో ఆంధ్రా జనం ఎలా పోయినా పర్లేదు, తాము ఇంతకాలం అధికారములో ఉండి అభివ్రుద్ది చేసిన రాష్ట్రము లో ఉండలేక, తమ అభివ్రుద్ది మీద నమ్మకము లేక, కరోనా భయముతో చంద్రన్న లోకన్న మాత్రం, హైదరాబాద్ లో నే ఉంటూ, అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు, మనల్ని పలకరించడానికి.
ఈ సారి చంద్రన్న వచ్చి కూడా, ఆన్లైన్లోనే ఉన్నారు, ప్రజలను కలవక. కనీసము ఆఫీస్లో 6 అడుగులు దూరం పెట్టి, ప్లాస్టిక్ కాగితాలు అడ్డు పెట్టి అయినా, స్థానిక నాయకులను, నమస్కారము తో కలిసి, ధైర్యం చెప్పవచ్చు.
బీజేపీ వారి మీటింగ్స్ చూసి నేర్చుకోవచ్చు, కరోనా జాగ్రత్తలతో మీటింగ్ ఎలా పెట్టాలి నాయకులను ఎలా కలవాలి అని. లేదా చిన్నగా ఇదే సమయమని, మన లోకేష్ బాబు ని, పార్టీ నాయకుల మీద, రుద్దే ప్రయత్నాలు కావచ్చు, చిన్నగా చంద్రన్న పక్కకు తప్పుకుంటూ.
జగనన్న కూడా, బయట ప్రజలను కలుస్తూ, తిరుగుతూ ఫోటోలు కూడా లేవు. ఆఫీసు లోనే పెద్దలను కలుస్తున్నారు, పంచుడు కార్యక్రమాలతో బిజీగా ఉంటూ, మధ్యలో ఢిల్లీ వెళ్లి వస్తున్నారు.
బీజేపీ వాళ్ళు చెప్పే మంగళగిరి ఎయింస్ కూడా, మన ఎమ్మెల్యేలు మంత్రులు నమ్మడము లేదా? లేక ఇంకా అక్కడ సేవలు మొదలు కాలేదా? తెలీదు.
ఇప్పుడు చెప్పండి, ఒక్క సరైన మంచి ఆసుపత్రి ఉందా, ఈ 20 ఏళ్ళలో, మన గౌరవ మంత్రులు ఎమ్మెల్యేలకు ఆంధ్రాలో? జనం సంగతి దేవుడు ఎరుగు. మన చంద్రన్న ఇన్నేళ్ళ పాలనలో, మన జగనన్న సంవత్సర పై పాలనలో, వైద్య అభివృద్ధి ఇదేనా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2116 General Articles and views 1,876,818; 104 తత్వాలు (Tatvaalu) and views 225,864 Dt : 15-Oct-2020, Upd Dt : 15-Oct-2020, Category : Politics
Views : 775
( + More Social Media views ), Id : 757 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
andhra medicine ,
no support ,
ap ,
ministers ,
mla ,
babu ,
running ,
hyderabad Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments