Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
చాలా మంది సంసారం అంటే భోగము అనుకుని, అందులోనే చిక్కుకుని వీలైనంత పాపం చేసుకుంటూ, సంఘం లో తన పనులు తన పిల్లల ద్వారా పాపం పెంపు చేస్తూ, చివరలో తమను తాము రక్షితం చేసుకోలేని పరిస్థితులు తామే కల్పించుకొని, ఏమి చెయ్యాలో తెలీని పరిస్థితి లో, విలవిల లాడుతూ కాల గర్భం లో కలసిపోతున్నారు.
గీతలో భగవంతుడు వివరంగా చెప్పారు. సంసారం లేదా బ్రహ్మచర్యం లేదా ఆశ్రమ జీవితం లు యోగాలు అని. ప్రతి దానికి ఒక కారణం, ఒక యోగమూ ఉంది. అవి యోగం గా బాధ్యత గా ఆచరిస్తే కష్ట సమయంలో కూడా, అవి మనిషి ని తరింప చేస్తాయి.
అదే భోగం గా చేస్తే, తమను తమ వంశము ను, నాశనము చేస్తాయి. ఉదాహరణకు రావణుడు, ధుర్యోధనులు. అవి పురాణ కధలు కాదు, మన మనసులో ని వికారాలకు, అందమైన వివరణ.
సంసారం యోగం అంటే, డబ్బు అందం ఐశ్వర్యం మోహం అవసరాలు కారణం కాకుండా, కేవలం యోగ్యం మంచి చెడు చూసి, ఏమీ ఆశించకుండా వంశ మరియు సమాజ శ్రేయస్సు కోసం, వివాహం చేసుకోవడం. నూటికి పది మంది కూడా ఉండరు, ఈరోజుల్లో అలా.
కేవలం మంచి సంతానం కోసమే, పెద్దలు చెప్పిన సాంప్రదాయ పద్దతిలో సంయోగం చెంది, ఉత్తమ బిడ్డలు కు జన్మకు కారణం అవడం. ఇది కూడా ఈరోజుల్లో అసాధ్యం. పెళ్ళి కి ముందే అన్ని జరుగుతున్నవి. సాంప్రదాయం పద్దతి కి అసలు చోటులేదు.
ఆ సంతానం ను వ్రృద్ది చేయడం, కత్తిమీద సాము లాంటిది. ప్రతి క్షణం కనిపెట్టి, వారికి మంచి బుద్దులు నేర్పి, సమాజ దైవ సేవకులు గా, కనీసం సమాజంకు చెడు చేయని వారిగా వారిని తయారు చేయాలి. నేడు, సమాజం సంగతి దేవుడెరుగు, సొంత తల్లి దండ్రులు కే కీడు చేస్తున్నారు.
భార్యను తప్ప పర స్త్రీలు ను తల్లి గా భావించి గౌరవించాలి, కన్నెత్తి చూడకూడదు. అలాగే ఇల్లాళ్ళు. ఇరువురు కూడా, ఆ నీతి కి కట్టుబడి ఉండటం లేదు.
మోహం లో ఉండి తప్పుడు సంపాదనతో, తన వంశాన్ని పెంచకూడదు. అదే చేస్తున్నాము. బంధాలలో మునగకుండా, తామరాకు మీద నీటి బొట్టు లాగ ఉండాలి. అది చేయలేక, మనకు నిండా ఉచ్చు బిగించుకుంటున్నాము.
కనీసం 60 ల లో బంధాలను వదిలి ఆశ్రమ జీవితం లేదా ఒంటరి విశ్రాంతి జీవితము గడుపుతూ, కనీసం మంచి పనులు చేస్తూ, బంధాలను వీడాలి. వయస్సు 90 వచ్చినా లేదా రోగాన పడ్డా మోహం భోగం వీడడం లేదు.
ఫలితం, చివరలో వందమంది ఉండి వంద కోట్లు సంపాదించిన వారు కూడా, మనశ్శాంతి లేకుండా చేతిలో చిల్లిగవ్వ లేకుండా అనాధలు గా, మరుజన్మకు పోతున్నారు.
సంసారం ఒక యోగం, భోగం కాదు. జాగ్రత్త సుమా పెనవేసి పడవేసే బంధాలతో.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,493,576; 104 తత్వాలు (Tatvaalu) and views 267,408
Dt : 13-Nov-2019, Upd Dt : 13-Nov-2019, Category : General
Views : 2750
( + More Social Media views ), Id : 42
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
responsible family life
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.