Bondage of Debt ఋణాను బంధం - యోగి జ్ఞానం వలన చెప్పిన ఉపదేశం - తస్మాత్ జాగ్రత జాగ్రత - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,823; 104 తత్వాలు (Tatvaalu) and views 225,103.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

BE ALERT! BE ALERT! भज गोविंदं भज गोविंदम मूढमते तस्मत सावधानी सावधानी భజ గోవిందం, భజగోవిందం మూఢమతే Bhaja Govindam, Bhaja Govindam Mudhamate Advice from Yogi Wisdom Adi Sankaracharya

ఋణాను బంధం గురించి ఒక కధ తెలుసుకుందాం. ఒక యోగి ఒకనాడు, ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి, మోక్షానికి వెళ్లవలసినవాడు, ఈ ఋణం ఉండిపోవటంతో, అతని ఇంట పుత్రుడై, జన్మిస్తాడు.

ఋణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు. జాతకం చూసిన వారు తలిదండ్రులకు, ఒక హెచ్చరిక చేస్తారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ ఋణపడి ఉన్నాడు.

వాని చేతి నుంచి, పైసా కూడా తీసుకోకండి. వానికి అన్నీ ఇస్తూండండి, అని చెప్తాడు.

నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి, ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున అతడు, వారి ఋణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.

పెద్దయ్యాక తండ్రి ఇతనిని, రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు. రాజు గారు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు.

అపుడు ప్రతి జాముకీ ఒకసారి, ఆ యువకుడు పోయిన జన్మలో యోగి కారణముగా, అప్పటి జ్ఞానం వలన, కింద చెప్పిన ఉపదేశాన్ని, నిద్రలో ఉన్న వారికి జాగ్రత్త అహో....అనే అర్ధంలో చెపుతారు.

దొంగలంటే ధనం ఎత్తుకుపోయే వారేకాదు. ఇవన్నీ కూడా దుఃఖ భాజనాలే సుమా.. అని చెపుతుంటాడు. ప్రతి జాముకీ ఇలాంటి హితవు ఒకటి చెబుతుండేవాడు..

రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ, ఇవన్నీ విని, ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.

మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి, రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని, అతడికి అందిస్తాడు.

అతడు వెంటనే, ఆ ధనరాశిని తల్లికి ఇవ్వగా, ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి, ఆ పళ్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి, ముక్తి పొందుతాడు.

తలిదండ్రులు దుఃఖిస్తే, రాజు ఆ యోగి కావలి సమయంలో, చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు.

అవి.. తస్మాత్ జాగ్రత జాగ్రత

1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||

Mata nasti pita nasti nasti bandhu na sahodhara
ardham Nasti gruham nasti tasmat jagrata jagrata.

తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

This verse means, not mother, not father, not relatives, not siblings, not wealth, not house nothing lasts forever. Nothing follows you after death, these are bondages of present birth. All these relationships, wealth and property are merely worldly attachments, hence be careful.

2. జన్మ దుఃఖం, జరా దుఃఖం,జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||

ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

Janma dukham jara dukham jaya dukham punah punaha samsara sagaram dukham tasmat jagratha jagratha.

This verse means that our birth into this world is one filled with pain suffering. Old age is torture. This entire life is an ocean of struggles. Hence be careful.

3. కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||

కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్న దొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

Kama krodascha lobhascha dehe thishtanthi taskarah
Jnana ratnopaharaya tasmat jagrata jagrata.

This means desire, anger and greed that reside inside the body are thieves that steal one’s precious knowledge. So, be careful.

4. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||

ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న, జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

Aasaaya badhyatee lookaha, karmanaa bahu chimtayaha
Ayuh kshanam jaanati, Tasmaat jaagruta jaagruta!

Greed binds people to action and concerns. Remaining years of life pass away every moment. Hence Be alert! Be alert!

5.సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||

మన సంపదలన్నియు ఒక కల వంటివి, యౌవనము ఒక పూవు వలె మన జీవితములో, స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

Sampadaha Svapna samkaasaha, Yauvanam kusumoopamam
Vidyut camcalam Aayushyam, Tasmaat Jaagruta Jaagruta!

Riches are like dreams. Youth is like a flower (withers in a day). Longevity is like a lightning (vanishes in a moment). Hence: Be alert! Be alert!

6. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||

ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు, ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

Kshanam vittam Kshanam cittam, Kshanam Jiivitameeva ca
Yamasya karun`aa naasti, Tasmaat Jaagruta Jaagruta!

Money is momentary. Mind is fickle. Life is ehemeral. The God of Death has no compassion. Hence Be alert! Be alert!

7. యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత, వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? కావున ఓ మానవుడా, సావధానుడవై ఉండుము.

8. ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర గృహ లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు? కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

Runanubhanda Rupena Pashu Patni Suta Aalaya ,
Runakshaye Kshyayaanthi Tatra Parivedana.

It means that cattle, wife, children and home (such attachments) are bondages that result from one’s previous birth. The relationship with these attachments ends once the debt is cleared. It can be settled in the form of service to these attachments. Enjoyment of these attachments ends the pain and suffering.

9. పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

చెట్ల యొక్క పండిన ఆకులు, ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా, ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

10. ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు? కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

11. ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

ప్రవహించుచున్ననదిలో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు, ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు? కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

ఆ యోగి చెప్పినట్లు ప్రతి మానవుడు, ప్రతి విషయంలో ప్రతి క్షణమూ సావధానుడై ఉంటే, ఆ పరమాత్మ పాదాల చెంత చేరే వరకు, ప్రతిక్షణము ఆనందమే, మరుజన్మ ఉండదు.

సేకరణ మరియు సవరణ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,823; 104 తత్వాలు (Tatvaalu) and views 225,103
Dt : 17-Dec-2019, Upd Dt : 17-Dec-2019, Category : Devotional
Views : 4744 ( + More Social Media views ), Id : 43 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Bhaja , Govindam , Mudhamate , Yogi , Wisdom , Debt , Runanubandham , Mata , pita , nasti , sankaracharya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు