దైవ ప్రార్దన - బుద్ది/ఆత్మ సంకల్పం- శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు - కరుణా మూర్తియగు దేవా - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2222 General Articles and views 2,493,634; 104 తత్వాలు (Tatvaalu) and views 267,414.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి (శివైక్యం 1998) ఒక సాధారణ గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆయన శ్రీకాళహస్తి లోని శ్రీ శుకబ్రహ్మాశ్రమం స్థాపకుడు, బహుభాషా కోవిదుడు. తలవంచి, సధ్గురువులకు ప్రణామములు.

10 వ తరగతిలో ఉన్నప్పుడు, మానసబోధ పాటలు విన్నాము. అందులో పదాలు, చాలా ఆకట్టు కున్నాయి. ఎవరు వారు అని ఆరా తీసాము, గీతామకరందం అన్న పుస్తకం దొరికింది. చాల భాగము చదివాము, వామ్మో ఇంత జ్ఞానమును ఆయన ఎంత తేలిక పదాలలో సామాన్యుడికి అర్ధమయేలా రాసారు అనుకున్నాము.

చాలా మందికి దైవ ప్రార్ధన అంటే తెలియదు, గొంతెమ్మ కొరికలు కోరతారు. దైవాన్ని/ గురువును ప్రాపంచిక మోహ కోరికలు ఎప్పుడూ కోరుకోకూడదు. కర్మ ఫలాలను బట్టి అవే వస్తాయి, అదీ గాక మన తల్లి తండ్రికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలీదా? అందుకే మానసిక నియంత్రణ ముఖ్యం, ఇదే 100 కి 80 మందికి తెలీదు, చేతకాదు, మాట రాత నడత వారికి కలవవు. మరి గురువు గారు ఉపదేశించిన, ప్రార్ధనను చదివి నేర్చుకుందామా?

ప్రతి రోజు ఉదయం, అందరూ దీనిని అర్దము చేసుకోని, దేవుని ప్రార్ధిస్తే(వారి వారి మాత్రు భాషలలో వారి వారి దేవుని), ఎటువంటి తప్పులు చేయము. బాధలను ఆనందముతో ఎదుర్కొంటాము. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దేవుని క్రుప ఉంటుంది. పక్క వారితో(పని లో, ఇంట్లో, ఊరిలో,రాష్ట్రం లో, దేశం లో, ప్రపంచం లో) సమస్యలు ఉండవు. అందరమూ, ఆనందము గా దేవుని బిడ్డలైన అన్నదమ్ములవలే కలసి మెలసి ఉంటాము.

కొన్ని మార్పులతో ప్రార్ధన నేర్చుకుందామా, బుద్ది/ ఆత్మ సంకల్పం, మీరు శ్రద్దగా వినండి, అనండి, దయచేసి నేర్చుకోండి, నేర్పండి.

* * *

కరుణా మూర్తియగు దేవా! మా చిత్తము/మనస్సు సర్వకాల సర్వావస్థలయందును, మీ పాదార విందముల యందు లగ్నమై, అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము.

పరమదయానిధీ, ప్రాతః కాలమున నిద్రలేచినది మొదలు, మరల పరుండువరకు, మనోవాక్కాయములచే మా వలన, ఎవరికినీ అపకారము కలుగకుండునట్లును, ఇతర ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను, సద్బుద్దిని దయచేయుము.

దేవుని బిడ్డలైన ఇతరులకు, నిస్వార్ధముగా సేవ, త్యాగము చేయుటకై, మాకు తగిన బుద్దిని శక్తిని ప్రసాదించుము. స్వంత లాభము కొంత మానుకునే, సద్బుద్దిని కలిగించుము. గుణవంతుల బంధముచే కలిగిన సంతానానికి, సంస్కారం బాధ్యత క్రుతజ్ఞత విశ్వసనీయత నేర్పే శక్తిని ప్రసాదించుము.

మాకు మా పిల్లలకు గుణమే ముఖ్యము, ధనం కన్నా ప్రాపంచిక వాసనల కన్నా, అన్న లక్ష్యాన్ని స్తిరం చేయుము. చిత్తశుద్ది ఆత్మశుద్ది మాత్రమే, దేవునికి, గురువుకి, దగ్గర చేయునన్న విశ్వాసం మాలో పెంపు చేయుము.

మాకు జన్మ నిచ్చిన తల్లి దండ్రులను, మాకున్న అన్ని సౌకర్యాలు మాతోపాటే కల్పించి, సేవ చేసుకునే బుద్దిని స్తిరము చేయుము.

గతం మరువకుండా, మాత్రు మూర్తిని, మాత్రు భాషను, మాత్రు దేశాన్ని సేవించుకునే క్రుతజ్ఞత బుద్దిని పెంపొందించుము. ఒకే మాట, ఒకే బాట గా ఉంటూ, అబద్దాలు 2 నాల్కల ధోరణి లేకుండా, తప్పును ఒప్పును స్పష్టముగా చెప్పే, ఒప్పుకునే ధైర్యాన్ని ఇవ్వు తండ్రి.

సచ్చిదానందమూర్తి! నిర్మలాత్మా! మా యంతఃకరణములందు, ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము గాని, విషయవాసనలు గాని అజ్ఞానవ్రుత్తి గాని, అరిషడ్వర్గాలు గానీ, అష్టవ్యసనాలు గాని, జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపు.

వేదంతవేద్యా! అభయస్వరూపా! మా యందు భక్తి, జ్ఞాన వైరాగ్య బీజము లంకురించి, శీఘ్రముగ వ్రుద్దిచెందు నట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మము నందే కడతేరి, మీ సాన్నిధ్యమున కేతెంచుటకు, కావలసిన శక్తి సామర్ద్యములను, కరుణతో నొసంగుము.

దేవా! మీరు భక్తవత్సలురు! దీనుల పాలిటి కల్పవ్రుక్ష స్వరూపులు! మీరు తప్ప మాకు ఇంకెవరు దిక్కు! మిమ్ము ఆశ్రయించితిని. అసత్తు నుండి, సత్తునకు గొనిపొండు! తమస్సు నుండి జ్యోతి లోనికి తీసుకొని పొండు, మ్రుత్యువు నుండి అమ్రుతత్వమును పొందింపజేయుడు!

ఇదే మా వినతి. అనుగ్రహింపుడు, మీ దరి జెర్చుకొనుము, పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి! - ఓం తత్ సత్  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,493,634; 104 తత్వాలు (Tatvaalu) and views 267,414
Dt : 07-Nov-2017, Upd Dt : 09-Aug-2019, Category : Devotional
Views : 4871 ( + More Social Media views ), Id : 23 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Vidya Prakashanandagiri , Shukra Brahma ashramam , Srikalahasti , God Prayer , karunamurti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు