1.
గ్రామాల్లో వాలంటీర్లు.. అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు.. పవన్ కళ్యాణ్ నిర్ణయం.. - 2025-11-09T22:18:44+05:30
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అడవి జంతువుల సంరక్షణ కోసం ఏపీ అటవీ శాఖ హనుమాన్ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామాల్లోనూ సర్ప మిత్ర వాలంటీర్లను నియమించుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గ్రామాల్లోకి ప్రవేశించే పాములను ప్రజలకు ఇబ్బందులు లేకుండా బంధించి. సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు ఈ సర్ప మిత్ర వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో వాలంటీర్లను ఎంపిక చేయాలని.. వారికి అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఇంకా
2.
‘సీఎం రేసులో ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు’.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. - 2025-11-09T20:18:27+05:30
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పాలన కంటే ఎవరైనా బాగా చేస్తారని ఎద్దేవా చేస్తూ.. అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేసులో భట్టి విక్రమార్క మాత్రమే కాకుండా.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా పోటీలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాల హామీలు అబద్ధమని.. పీజేఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ అణగదొక్కిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
ఇంకా
3.
18 ఏళ్లు నిండి.. 10వ తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. నెలకు రూ.14 వేలు.. - 2025-11-09T22:08:44+05:30
ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు నవంబర్ 11న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వరంగల్, ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. భారత్ బయోటెక్, డిమార్ట్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని.. సేల్స్ మెన్, ఆపరేటర్స్, అకౌంటెంట్స్ వంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18-32 ఏళ్ల అభ్యర్థులు తమ పత్రాలతో హాజరుకావాలని అధికారులు కోరారు.
ఇంకా
5.
భర్త మహాశయులకు రవితేజ విజ్ఞప్తి.. ‘RT 76’ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్.. - 2025-11-09T21:43:11+05:30
Ravi Teja's RT 76 Movie: మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' ఫ్లాప్ తో నిరాశపరిచినా, వెంటనే తన తదుపరి చిత్రం 'RT 76' పై దృష్టి సారించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ప్రమోషన్స్ లో భాగంగా టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఇంకా
6.
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. నేటి నుంచి వైన్స్ బంద్.. ఎప్పటివరకంటే.. - 2025-11-09T21:40:28+05:30
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్, లెక్కింపు తేదీల సందర్భంగా అధికారులు మద్యం దుకాణాలను మూసివేశారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం.. పోలీగ్ రోజున అంటే నవంబర్ 11న సాయంత్రం 6 గంటల వరకు.. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజున వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతిభద్రతల కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ (నవీన్ యాదవ్), బీఆర్ఎస్ (మాగంటి సునీత), బీజేపీ (లంకల దీపక్ రెడ్డి) హోరాహోరీగా పోటీపడుతున్నారు.
ఇంకా
7.
రూ. 40కే లీటర్ వంట నూనె.. తీరా చూస్తే.! - 2025-11-09T21:36:44+05:30
మామూలుగా లీటర్ వంట నూనె ధర 140 రూపాయలు పైనే ఉంటుంది. కానీ అక్క డ మాత్రం 40 రూపాయల నుంచి 60 రూపాయలకే. ఒకసారి వాడేసిన వంట నూనెను ఇలా తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది వ్యాపారులు. ధనార్జనే ధ్యేయంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పల్నాడు జిల్లాలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో ఇలాంటి కేసులు వెలుగుచూస్తున్నా.. వ్యాపారుల పద్ధతిలో మార్పులు రావటం లేదని జనం ఆందోళన చెందుతున్నారు.
ఇంకా
8.
6 6 6 6 6 6 6 6.. రంజీ ట్రోఫీలో వరుసగా 8 సిక్స్‌లు.. రికార్డ్ క్రియేట్ చేసిన మేఘాలయ బ్యాటర్ - 2025-11-09T20:25:33+05:30
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. మేఘాలయ బ్యాటర్ ఆకాశ్ కుమార్ చౌదరి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్ సాధించాడు. కేవలం 11 బంతుల్లోనే 50 పరుగుల మార్కును చేరుకున్నాడు. వరుసగా 8 సిక్సర్లు బాది.. ఔరా అనిపించాడు. దీంతో ఆకాశ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు
ఇంకా
9.
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య కొత్త రూల్.. ! - 2025-11-09T20:44:06+05:30
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త విధానాలు రైల్వే శాఖ అమలు చేస్తోంది. ముఖ్యంగా, ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్‌కు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి. దీనివల్ల దళారుల అక్రమాలు తగ్గి, నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు లభించే అవకాశం ఉంది. ఆధార్ లింక్ చేసుకున్న తర్వాతే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం తాత్కాల్ సమయంలో ఇదే విధానం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇంకా
10.
పాక్ ఐఎస్ఐ సీక్రెట్ యూనిట్ 'S1’.. పాతికేళ్లుగా ఇక్కడే భారత్‌లో ఉగ్రదాడులకు శిక్షణ..! - 2025-11-09T20:06:13+05:30
భారత్‌లో జరిగే వరుస ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. ఆ దేశ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి చెందిన 'ఎస్1' యూనిట్ ఈ దాడుల్లో కీలక పాత్ర పోషిస్తోందని విశ్వసనీయ వర్గాలు తాజాగా తెలిపాయి. ఈ యూనిట్ సీమాంతర ఉగ్రవాద శక్తులకు అతిపెద్ద చోదక శక్తిగా వ్యవహరిస్తూ, గత రెండు దశాబ్దాల నుంచి వేలాది మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. ఈ యూనిట్ కార్యకలాపాలను భారత భద్రతా దళాలు ఇటీవల డీకోడ్ చేశాయి.
ఇంకా