త్రిమూర్తులు, 3 గుణాలకు మూలం. సత్వ, రాజస, తామస గుణాలు - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 47 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1192 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఈ రోజు, మంచి మాటలు గా, మనలోని గుణాల గురించి చెప్పుకుందాము, మిత్రులైనా అధికారులు నాయకులు మనుషులు ఎవరికైనా ఇవి ఒకటే. కుల మతాలకు సంబంధము లేదు.

త్రిమూర్తులు, 3 గుణాలకు మూలం. సత్వ, రాజస, తామస గుణాలు. ఇవి కొంత మంది కి స్థిరముగా ఉంటాయి, కొంత మంది, ఊసర వెల్లిగా అటూ ఇటూ మార్చుకుంటూ ఉంటారు. పిల్లలు పెద్దలు ఎవరైనా, ఈ గుణాలను గుర్తు పట్టవచ్చు.

* తామస గుణం ఉన్న వారు - ఎవరినీ గౌరవించరు, లెక్క చేయరు, ఎవరి మాట వినరు. ఎవరి గురించి పట్టించుకోరు. స్వార్ధం, నిర్లక్ష్యం, నీరసం, నిద్ర, మత్తులో, గమ్ము గా ఉంటారు. ఏదీ చేయరు, చేయనివ్వరు, చేసినా ముందు చూపు ఉండదు. పని చేయకుండా ఉండటానికి 100 అడ్డు కారణాలు చెపుతారు. వీరు దేవుని నమ్మరు, నమ్మినా చేరడానికి ఆచరణలో పెట్టరు, ఎన్నో జన్మలు ఎత్తాలి. చెప్పినదే చెప్పించుకుంటారు, ఎన్ని తిట్టినా కొట్టినా తీరు మార్చుకోరు. అరిషడ్ వర్గాలకు బందీలు.

* రాజస గుణం ఉన్న వారు - మాట వింటారు అర్ధము చేసుకుంటారు ప్రయత్నము చేస్తారు, కొన్ని మంచి పనులు ఉంటాయి ధైర్యముతో, అన్నిటికీ మున్దుకు వస్తారు, కానీ మంచి చేయడానికి అలాగే పూర్తిగా మంచి గా ఉండడానికి వాదిస్తారు, అవసరాలకు పక్క దోవలు పడుతారు. తమ అవసరానికి, ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు ఆశించి మాత్రమే. చెడు పనులు కూడా ఉంటాయి. సగం స్వార్ధం మోహం ఉంటాయి. సగం పైగా అరిషడ్ వర్గాలను జయిస్తారు. దుర్యోధనుడు, రావణుడు, కర్ణుడు లాంటి వారు. వీరూ దేవుని చూడాలంటే, ఎన్నో జన్మలు ఎత్తాలి, కాని తామస గుణం వారి కన్నా తక్కువ జన్మలు సుమా.

తామస రాజస గుణం కలవారు, చాలా ఇబ్బందులను కష్టం తో ఎదుర్కొంటారు, జీవితములో మూర్ఖత్వముతో, కానీ వాటికి బాధ్యులు గా ఇతరులను మరియు దేవుని నిందిస్తారు.

* సాత్విక గుణం కల వారు - మంచి దోవలోనే ఉంటారు, క్రుతజ్ఞత విశ్వసనీయత ఉంటాయి. దాపరికం ఉండదు, కుట్ర కుతంత్రం ఉండదు. ఆశించి ఏదీ చేయరు. ఎవరికైనా సహాయం చేస్తారు. మనసును అరిషడ్ వర్గాలను జయించి అదుపులో పెడతారు. పై నుంచి కింద పడినా, అన్ని కోల్పోయినా, విలువలు మంచి మర్యాద తప్పరు. తమ తప్పులు ఉంటే, క్షమాపణలు చెప్పి సరి చేసుకుంటారు. పది మంది మంచి ఆలోచన చేస్తారు, మార్గం చూపుతారు, తాము ఆచరిస్తూ. రాముడు క్రిష్ణుడు బుద్దుడు.

వీరికి జీవిత సమస్యలు వస్తాయి, కానీ నవ్వుతూ వాటిని ఎదుర్కుంటూ, కేవలము తమను తాము లేదా తమ పద్దతిని నిందించుకుంటూ, దేవుని గుణ పాఠం తర్వాత, తమ పద్దతులు మంచి వైపు మార్చుకుంటారు. వీరు కూడా మరలా జన్మలు ఎత్తలి, కాని తక్కువ పై వారి కన్నా.

ఎందుకంటే, వీరు ఎప్పుడూ మంచి మార్గములోనే వెళతారు. తప్పులు చేసినా, క్షమాపణలు చెప్పి, మరలా ఆ తప్పు చేయరు.

కాని మనము దేవుడుని చూడాలి అంటే, ఈ 3 గుణాలు దాటాలి, కనీసం సత్వ గుణం చేరాలి. అప్పుడు ఆత్మ పరమాత్మ తో కలుస్తుంది. మరు జన్మలు ఉండవు. రజో తామస గుణాల వారే, దేవుని చూపించు అంటారు మూర్ఖముగా. ఓ పల్లెటూరు ఆయన, దమ్ముంటే అమెరికా ఉంటే చూపించు నాకు అని. దానికి అర్హత వీసా పద్దతి ఉందని పట్టించుకోరు.

తెల్ల వస్త్రము (సత్వ), దుమ్ము ధూళి పట్టిన మచ్చల వస్త్రము (రజో), మడ్డి మసి పట్టిన కంతల వస్త్రము (తామస), ఉతకడములో తేడా మీకు తెలుసు కదా? ఏది దగ్గర్ ఉంచుకోవడం, బాగు చేయడం తేలిక? మీకే తెలుసు కదూ.

ఇప్పుడు మీరే నిర్ణయం చేసుకోండి. మీరు ఎక్కడ ఉన్నారు? ఎలా మారుదాం అనుకుంటున్నారు? ఎన్ని ఏళ్ళలో ఎన్ని జన్మలలో మంచి ని ఆచరణలో పెట్టి, మోక్షమును పొందుతారో మీ ఇష్టం. నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆ చక్రములో పడి కొట్టు కునేది, కష్ట సుఖాలు అనుభవించేది మీరే గదా?

అందుకే, మంచి వారు, ఈ క్షణము నుంచే సాత్విక లక్షణాల పెంపుకు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే, రేపు మనకు తెలీదు.

మొదట అమ్మ నాన్న పాద దాసుడు, తర్వాతనే హరి హర దాసుడు, శ్రీనివాసుడు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1192 General Articles, 47 Tatvaalu
Dt : 13-Apr-2021, Upd Dt : 13-Apr-2021, Category : Devotional
Views : 136 ( + More Social Media views ), Id : 47 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trinity , trimurtulu , 3 , attributes , sattva , rajasa , tamasa , human , qualities , characters
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు