APLatestNews.com top Banner
ఆకారం వికారం అయితే తప్పులేదు కానీ మనసు, బుద్ధి, మాట వికారం అయితే? - శ్రీ స్వామి తత్వాలు
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
జన్మతః ఆకారం వికారం అయితే తప్పు లేదు, నష్టము కూడా లేదు. అది దైవ సంకల్పం, మనము మార్చలేము. తప్పక ఏదో ప్రయోజనం ఉంటుంది, ఆ ఆకార వికారం వలన. క్రిష్ణయ్య నల్లగా ఉన్నా, మనకు పరమాత్ముడయ్యారు. కౌరవులు గేళి చేసారు కూడా, కులము రంగు పేరుతో.

భారీ కాయ కుంభకర్ణుడు కూడా, అన్నకు బుద్ది చెప్పాడు, సీతమ్మను విడిచిపెట్టు యుద్దము వద్దు అని. రాక్షసులు కూడా అందరూ చెడ్డవారు కాదు. విభీషణుడు నీతి చెప్పాడు. ఆఖరుకు రావణుడు కూడా, ఒక్క సీతమ్మ విషయములో తప్ప, మిగతా విషయాలలో రావణ బ్రహ్మ అంతటి గొప్పవాడు.

కానీ మన వికారపు పనులు లేదా అలవాటు ల వలన ఆకారం వికారం అయితే, ఆ ఇబ్బంది ని జీవితాంతం మనమే మోయాలి, మన ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పడాలి. ఎందుకంటే, దానికి కర్మ కర్త క్రియ మనమే. ఇదైనా కొంత పరవాలేదు. ఎందుకంటే, వారి మనసు సాత్వికముగా స్వచ్చముగా ఉంటే.

వామనుడు ని పొట్టివాడు అనుకుంటే, ప్రపంచాన్నే కొలిచేంతగా ఎదిగారు ఆకాశం భూగోళం ఆక్రమించారు. మన బుజ్జి గణపతి, మనకు ఆరాధ్య దైవము.

కానీ మన మనసు, బుద్ధి, మాట వికారం అయితే, దానిని ఎవరూ భరించలేరు, చివరకు వారికి వారే లేదా వారి ఇంట్లో వారే భరించలేరు. రావణుడి మరియు దుర్యోధనుని మనసులోని వికారము, జాతినే నాశనము చేసింది.

అలాంటి వారు, మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. జాగ్రత్తలు అవసరము. అలాంటి వారు మనలను కూడా వారి పాపములో కలుపుకొని తమ వెంట శిక్షకు తీసుకువెళతారు. దుర్యోధనుడు, కర్ణుడు స్నేహమే దీనికి ఉదాహరణ.

అవకాశం లేదా అవసరం ఉన్న వారు, కొంత మంది కొంతకాలం, భరించినట్టు నటించవచ్చు. అవకాశం తీరాక లేదా తీరదని తెలిసాక, వారూ కూడా చీదరించుకొని దూరంగా వెళతారు.

కాబట్టి, ఎప్పుడూ మనసు, బుద్ధి, మాటలను వికారం చేసుకోవద్దు, అంటే తప్పు దోవలో నడపవద్దు చెడు మోహాలకు లొంగవద్దు. ఆ వికారం, మొదట ఆకర్షణీయమైనది లేదా గొప్పగా కనపడినా, చివరకు సర్వ నాశనం చేస్తుంది తనను, తనను నమ్మిన వారిని కూడా. జాగ్రత్తలు సుమా.
 

Dt : 04-Nov-2019, Upd Dt : 04-Nov-2019 , Category : General
Views : 109 ( + More Social Media views ) ( id : 41 )
Tags : inner beauty , outer beauty , good mind good word

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు