Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites

గుడి లో దేవుళ్ళ ను వేద సహితం గా పూజిస్తారు. పురుష దేవుళ్ళు, అంటే రాముడు కృష్ణుడు శివుడు ను, పురుషసూక్తం(ఓం తచ్చం యోరావృణీమహే . . .) తో అర్చన చేస్తారు. అలాగే స్త్రీ దేవతలను శ్రీ సూక్తం(హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం . . .) తో అర్చన చేస్తారు.
ప్రతి పూజకు ముందు గణపతిని, నవగ్రహాలను కూడా పూజిస్తారు. శివయ్యకు ప్రత్యేకముగా అభిషేకముతో నమక చమకాలు ఉన్నాయి.
ఇవి నోరు తిరగని వారికోసం పుస్తకాలలో, వాటి కింద శ్లోకాలు ఇస్తారు, అర్థం రాస్తారు. అలాగే దేవతా అష్టోత్తరం(108 నామాలు), మంత్రపుష్పం, దుర్గా సూక్తం(ఓం జాతవేదసే సునవామ సోమ . . .) కూడా చదువు తారు.
సహస్రశీర్షం దేవం . . . మంత్రాలు మంత్రపుష్పంగానూ, యోపాం పుష్పం వేద ఇత్యాది మంత్రాలు మహా మంత్రపుష్పంగానూ ప్రసిద్ధి చెందాయి. అంటే మంత్రము చదువుతూ పుష్పాలు సమర్పిస్తారు, లేదా మంత్రాలనే పుష్పాలుగా సమర్పిచడం.
అంటే దేవతను ఆహ్వానించి, కాళ్ళు కడిగి, ఆసనం వేసి, వస్త్రం ఇచ్చి, స్తుతించి, హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి , తాంబూలం ఇచ్చి, చేతులు కడుగుతారు. ఇంట్లో అయితే, మరలా యధాస్ధానం కి పంపుతారు. దీనినే షోడశోపచారాల పూజ అంటారు.
అంటే ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారో, అలా గౌరవించడమే ఈ పద్దతి. అంటే, మన ఇంటికి వచ్చిన వారిని కూడా గౌరవముగా చూడాలి.
ఇది అంతా ఒక పద్ధతి, ఒక అద్భుతమైన భావన. ఎందుకంటే మనసు ను నియంత్రణ చేయాలి అన్ని విధాలుగా. ఇక్కడ మనస్సు మాత్రమే ముఖ్యం. లేకపోతే, బ్రహ్మండం నేలే విశ్వరూపుడు భగవంతుని కి నిజంగా ఆసనం, అలంకారం, నైవేద్యం పెట్టగలమా?
అలాగే మంత్రాలు, పూజ చేయలేని వారు కూడా ఉంటారు. వారికీ ఇబ్బంది లేదు, మనసే ముఖ్యం అనుకున్నాము కదా. నిర్మలమైన మనసులో రామ, కృష్ణ, దుర్గ అని అదే గంట సేపు నామస్మరణ చేసినా, అదే ఫలం.
ఇంత పూజ చేసి కూడా, ఇంట్లో వాళ్ళ ను, వీధిలో వాళ్ళ ను ఇబ్బంది పెడితే, అంతా నిష్ప్రయోజనం. ఎందుకంటే దేవుడు ఒక్కరే, అందరం దేవుని బిడ్డలం మరువద్దు. మరి దేవుని ఒకపక్క గౌరవిస్తూ, ఇతరులను దూషిస్తే ఉపయోగము ఉండదు.
Dt : 08-Oct-2019, Upd Dt : 08-Oct-2019 , Category : Devotional
Views : 284
( + More Social Media views ) ( id : 36 )
Tags : god puja , goddess puja , purusha suktam , sree suktam , mantrapushpam
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.