Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ప్రతి ఉద్యోగం కి అర్హత కావాలి, ప్రతి పై చదువుకి అర్హత కావాలి. సర్టిఫికెట్ అంటే ధృవీకరణ పత్రం కావాలి. అవి లేకపోతే, మనకు సీటు ఇవ్వరు, ఉద్యోగం రాదు. ఇది, మన అందరికీ తెలిసిన విషయమే.
మరి దేవుళ్ళకు, గురువుల కు, బాబాల కు, స్వామీజీల కు ధ్రువీకరణ వద్దా? మరి ఎవరు ఇస్తారు? హిందువుల కు దేవుళ్ళ గురించి, ధృవీకరణ ఇచ్చే గ్రంథాలు వేదాలు, పురాణములు. అవే మనకు ప్రమాణాలు. ఎందుకంటే, అవి మన లాంటి స్వార్ధ పరులు, వ్యాపార దృష్టి తో పబ్లిసిటి కోసం రాసినవి కావు.
దేవుడు ఒక్కడే అని, నిరాకారుడు నిరంజనుడు అని చెప్పాయి. మనుషుల వ్యక్తి వికాసానికి, ఉదాహరణలతో సహా, దేవుని మంచి పనులను చెప్పాయి.
అవి స్పష్టంగా రాముడు, కృష్ణుడు, హనుమాన్, వెంకన్న, అమ్మ వార్ల గురించి ఉదాహరణ సహితముగా చెప్పాయి. గురువు అంటే వ్యాసుడు, వాల్మీకి ,కృష్ణుడు లాగా ఉండాలి.
వ్యాసుడు, వాల్మీకి ల ను ఆనాడు ఎవరూ దేవుళ్ళు అనలేదు, నారాయణ అంశం అయినా కూడా. ఎందుకంటే వారి పాత్ర, గురుత్వం మాత్రమే, దేవుని కి పోటీ కాదు. అంటే, దేవుని వైపు, దారి చూపడమే, వారి విధి.
కొన్ని పీఠాలు ఎన్నో ఏళ్లుగా, గురు పరంపరలో వస్తున్నాయి. ఉదాహరణకు కంచి పీఠం. పీఠాధిపతులు అంటే, ఎన్నో ఏళ్లుగా, కష్టతరమైన హైందవ పద్దతి పాటించి, ఆ స్ధానం కు వచ్చారు. అంటే, బ్రహ్మ ముహూర్తము లో లేవడం, జప తపాలు, వేద పఠనం, యజ్ఞాలు యాగాలు, శాఖాహారం, కాషాయం, ఎన్నో నియమాలు పద్దతులు పాటించి, మనసును నియంత్రణలో ఉంచాలి.
కానీ మనం వీరినెవ్వరినీ నమ్మం. నమ్మినట్టు గా నటిస్తాము, పూజిస్తాము. ఎందుకంటే అంత కష్టమైన నీతి నియమాలను పాటించం, మన మనసు ఒప్పుకోదు. అన్నీ తేలికగా ఉండాలి, క్షణం లో అయిపోయాలి. మరి శాస్త్రం దానిని ఒప్పకోదు కదా.
మరి మనసు నిలకడలేని, నీతి లేని మనకు, తేలిక దోవ ఏది? ఎవరు కొత్త గా బాబాలు, స్వాములు గా వస్తే వారు మనకు పూజ్యులు. వ్యాపారం కోసం, వారి పై జరిగే విపరీతమైన పబ్లిసిటీ, మన బలహీనమైన మనసులో పడుతుంది. మన తాతలు చెప్పకపోయినా, వారి వైపు నడిపిస్తుంది.
బెంగాల్ బాబా అయినా స్వామీజీ అయినా పర్లేదు, ఆ సొంత రాష్టం వాళ్ళు నమ్మకపోయినా పర్లేదు. మన రాష్ట్రంలో ఎంత మంది గురువులు ఉన్నా మనకు వద్దు, ఎందుకంటే పబ్లిసిటీ లేదు. మనము బయట వారినే నమ్ముతాము. అసలు దేవుడంటే నమ్మకము ఉంటే, వీరంతా అవసరమా?
కావాలి అనుకున్నా, గురువు, దేవుని చేరుటకు, దోవ మాత్రమే చూపుతారు. ముందు మనము, ధ్యానములో మనలను తెలుసుకుని, మన మనసును అదుపులో ఉంచుకోవాలి కదా.
వారికి ఎవరి ధ్రువీకరణ ఉంది? ఏ శాస్త్రం చెప్పింది? ఎవరో గాలి వార్త చెపితే, ఎవరో ఏదో పుస్తకం రాస్తే నమ్ముదామా? మన తాతలు చెప్పకపోయినా, వారి వైపు నడిపిస్తుంది.
అంటే దొంగలు దొంగల దగ్గరకే, మనసు నియంత్రణ లేని వారు అలాంటి వారి దగ్గరకే వెళతారు, అన్న నానుడి నిజం కాదా. మరి మన బలహీనతను వారు వ్యాపారం చేసుకోరా?
మరి తప్పు ఎవరిది? కొత్త లేదా దొంగ బాబా, స్వాముల దా లేక అరిషడ్ వర్గాలు కు దాసోహం అన్న మనదా? నిర్మలమైన మనసుతో ఆలోచన చెయ్యి.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2081 General Articles and views 1,820,123; 104 తత్వాలు (Tatvaalu) and views 220,087 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.