Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* భారత భూమి వీరభూమి, మన సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తైనదని
* శత్రువులకు భారత జవాన్లు పరాక్రమ జ్వాల
* జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో మన శక్తి సమున్నతం
* విస్తరణ వాద యుగం ముగిసి, అభివృద్ధి వాదం
* మనకు ఇద్దరు తల్లులు, ఒకరు భారతమాత, మరొకరు మిమ్మల్ని కన్న వీరమాత
* వన్ ర్యాంక్, వన్ పెన్షన్
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Modi briefed with Army, Air Force and ITBP at Nimmoo, Ladakh
He reached there early morning.He is interacting with personnel of Army, Air Force and ITBP. Located at 11,000 feet,this is among the tough terrains, surrounded by Zanskar range and on the banks of the Indus.
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న లధ్ధాఖ్,నిము ప్రాంతానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు..
ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజు తెల్లవారుజామున లధ్ధాఖ్,నిము ప్రాంతానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు.
ఇండస్ నది దగ్గరలో 11,000 అడుగుల ఎత్తులో కఠినమైన భూభాగం జష్కర్ శ్రేణికి చేరుకున్న నరేంద్ర మోదీ గారు ఆర్మీ,ఎయిర్ ఫోర్స్,ఐటీబీపీ బలగాలతో వ్యక్తిగతంగా పరిస్థితులను సమావేశమై సమీక్షిస్తున్నారు.
చైనా దూకుడును దృష్టిలో ఉంచుకొని సరిహద్దుల్లోని భద్రతా పరిస్థితులను సైనికాధికారులతో ప్రధాని మోదీ సమీక్షించి, సైనికులను ఉద్దేశించి, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ప్రసంగించారు.
భారత భూమి వీరభూమి... వీరులను కన్న భూమి అని, మన సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తైనదని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సైనికులను ఉద్దేశించి అన్నారు.
భరత మాత శత్రువులు సైనికుల్లో మీలోని కోపాన్ని చూశారని, ఈ భూమి 130 కోట్ల మంది భారతీయులకు ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
విచ్ఛిన్న శక్తుల కుట్రలకు లద్ధాఖ్ స్థానిక ప్రజలు తిప్పికొట్టారు, ముఖ్యంగా 14 కార్ప్స్ సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకుంటున్నారని, వారి సాహస గాధలు దేశంలోని ప్రతి ఇంటిని చేరాయని, భారత మాత శత్రువులకు భారత జవాన్లు పరాక్రమ జ్వాల ఏంటో చూపించారని మోదీ గారు అభినందించారు.
వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను భారత్ తిప్పికొట్టిందని, ఇవాళ భారత్ శక్తి సామర్థ్యాలు అజేయమని, జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో మన శక్తి సమున్నతంగా ఉందని భారత ప్రధాని శ్రీ మోదీ గారు స్పష్టం చేశారు.
వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని, బలహీనులు శాంతిని సాధించ లేరని, శాంతిని సాధించాలంటే ధైర్యసాహసాలు ఉండాలని సైనికులకు సూచించారు.
భారత్ ఆధునిక అస్త్రశస్త్రాలను నిర్మిస్తుందని, ప్రపంచంలోనే అత్యాధునిక శాస్త్ర సాంకేతిక సామర్థ్యం భారత్ అందిపుచ్చుకుందని ప్రధాని మోదీ గారు పేర్కొన్నారు.
అనేక సంక్లిష్ట, సంక్షోభ సమయాల్లో ప్రపంచం వెంట భారత్ నడిచిందని, ప్రపంచంలో ఎక్కడ శాంతిభద్రతలు లోపించినా అక్కడ భారత్ సేవలు అందిస్తోందని ప్రధాని తెలియజేశారు.
పిల్లనగ్రోవి ఊదే కృష్ణుడిని మనం పూజిస్తామని, సుదర్శన చక్రం ధరించిన అదే కృష్ఠుడిని కూడా మనం పూజిస్తామని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం మనకు ఉందని భారత సైనికులతో ప్రధాని అన్నారు.
విస్తరణ వాద యుగం ముగిసి, అభివృద్ధి వాదం ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న తత్వం అని ప్రధాని పేర్కొన్నారు.
మనకు ఇద్దరు తల్లులు అని, ఒకరు భారతమాత... మరొకరు మిమ్మల్ని కన్న వీరమాత అని సైనికులతో అన్నారు. వీర సైనికులను కన్నా వీరమాతలు గొప్ప త్యాగధనులని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సైనిక దళాల మెరుగైన సమన్వయం కోసమే సీడీఎస్ ఏర్పాటు చేశామని, వన్ ర్యాంక్... వన్ పెన్షన్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలుచేస్తున్నామని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తెలిపారు.
గల్వాన్ లోయలో వీరసైనికుల పరాక్రమం చూసి గర్వంగా ఉందని, సైనికులతో పాటు ఐటీబీపీ దళాలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలసికట్టుగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ వెంట మహా దళాధిపతి బిపిన్ రావత్ ఉన్నారు..
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,770,415; 104 తత్వాలు (Tatvaalu) and views 290,982
Dt : 03-Jul-2020, Upd Dt : 03-Jul-2020, Category : News
Views : 1659
( + More Social Media views ), Id : 23
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
worship ,
lord krishna ,
flute playing ,
sudarshan chakra ,
modi ,
soldiers ,
Army ,
Air Force ,
ITBP ,
Nimmoo ,
Ladakh
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments