వనజ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు వెళుతున్నది, ఎందుకు? - వ్యాపార ధన సేవల మురిపాల అండ ఎన్నాళ్ళు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2097 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2132 General Articles and views 1,982,896; 104 తత్వాలు (Tatvaalu) and views 232,252.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Rajo Tamo guna, Vanaja is going to Senior Citizens Home like orphan, by having children/ relatives/ friends, why? - And how long are those business money services happy support? పిల్లలు/ స్నేహితులు/ బంధువులు ఉండి, రజో తమో గుణ వనజ, సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు అనాధగా వెళుతున్నది, ఎందుకు? - మరి ఆ వ్యాపార ధన సేవల మురిపాల అండ ఎన్నాళ్ళు?*

మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు - Updated with your suggestions, share to all/ మీ సలహాలతో కొత్తవి కలిపి సరి చేసాము, అందరికీ పంచండి.

చుట్టుపక్కల చూడరా చిన్నవాడ! సహాయం చెయ్యి, అహంతో చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా - Chuttupakkala chudara chinnavada, sahayam cheyyi, aham toa chukkallo chupu chikkukunnavada (Look around and help them, little one! O person blinded by ego - మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva

*వనజ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు వెళుతున్నది ఒంటరిగా అందరూ ఉన్న అనాధగా - పిల్లల బంధువుల స్నేహితుల ఇరుగుపొరుగు మనసులు గెలవలేక, వయసులో అన్ని ఉన్నప్పుడు మరియు 60 వచ్చాక కూడా, ఏ ముదుసలి వారికీ సజీవ గురువు సేవ మనస్కరించక, సత్వ గుణం వ్రుద్ది చేసుకోలేక, సొంతముగా పని పాట చేసుకోలేని బద్దకము నిర్లక్ష్యము తో. మరి ఆ వ్యాపార ధన సేవలు మురిపాల అండ ఎన్నాళ్ళు?*

*Vanaja is going to Senior Citizens Home as a lonely orphan - Unable to win the hearts of children, relatives, friends, neighbours; and even after reaching 60 years not ready to do seva for old folks as living guru seva; not ready to improve sattva guna, and not ready to do own work independently carefully. And how long have those business money services support her?*

వనజ వయస్సు 60 ఏళ్లు, బాపట్ల/ తిరుపతి/ వరంగల్/ కాకినాడ్ పట్టణం నుంచి హైదరాబాద్/ బెంగళూర్/ ఢిల్లీ/ విదేశీ నగరం కు వెళ్లిపోతోంది, 60 ఏళ్ళ జీవితములో సొంత మనుషుల, సొంత ఊరు ప్రేమ పొందలేక, ఓడిపోయి, ఒంటరిగా, అనాధలా, రజో తమో గుణాల బానిసలా.

Vanaja is 60 years old, moving from Leaving from Bapatla/ Tirupati/ Warangal/ Kakinad town to Hyderabad/ Bangalore/ Delhi/ Foreign City, in her 60 years of life, unable to get the love of her own people, her hometown, defeated, alone, orphaned, like a slave to Rajo Tamo Guna.

ఇక్కడ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌ అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమం. ఏ ఆశ్రమము అయినా అంతే, ముందు అంతా మురిపెం, ఆ తర్వాత నరకం. వారి వ్యాపారానికి కావాలసింది నీ ధనం/ ఆస్తి/ సేవ, కాళ్ళు చేతులు కదిలిన వరకే, నీకు గౌరవము, మర్యాద. ఈ కధనములో వనజ బదులు ఏ పేరు పెట్టుకున్నా, అలాగే రమేష్ అని మగవారి పేరు పెట్టుకున్నా, అర్ధం పరమార్ధం ఒకటే.

Here Senior Citizens Home means, i.e. a special old age home. It's like any ashram. First everything is well, then hell. Their business needs your money/ property/ service, till you move your hands and feet, they respect you. Whichever name is given instead of Vanaja in this article, as well as the male name Ramesh, the meaning is the same.

బాగా చూస్తారు అన్న విదేశం లోనే, సీసీ కెమేరాలు ఉన్న చోటే, ముదుసలి రోగి మందు తీసుకోలేదనో లేదా ఇంకో తప్పిదానికో, నర్స్ దబ దబా బాదింది, వీడియో బయటకు వచ్చింది. నీళ్ళ టాప్ మరియు లైట్ ఆపరు, ఉచ్చ కింద పోస్తూ నడుస్తున్నారు, తూలి పడుతున్నారు అని, తలుపుకు గడియ వేయరు, అలా ఎన్నో ఇబ్బందులు ఎన్నో సార్లు ఉంటే, విసుక్కోరా? అంటున్నారు వారు.

Even in a foreign country that is well cared, where there are CCTV cameras, the nurse kept complaining and hitting that the older patient, who did not take the medicine or something else was wrong, and the video came out. If we are not stopping light and water tap, walking with urine, falling down many times, not locking door, will they care without shouting if we do many times? that people asking

25 ఏళ్ళు, లక్షలు కోట్లు పోసి పెంచి పిల్లలే చూడము అంటే, బయట నెలకు 10 వేలు పైన పోస్తే, వారు ప్రేమతో చూస్తారా? ఎంత పిచ్చి జనం. మన పిల్లలు/ ఇరుగుపొరుగు/ స్నేహితులు/ బంధువుల కన్నా, ఆ బయట కొత్త వారిని నమ్మగలవా? అసలు ధనముతో నే పెద్దలను/ పిల్లలను చూస్తాము అనే మన సంతానం ను, తోడ బుట్టిన వారిని అయినా నమ్మవచ్చా? అలాంటి వారి నుంచి పారిపోయిన, పెద్దలు ఎందరో. లేదా అన్ని బాధలు మింగుకుని బాధ చావు చావలేదా?

For 25 years, after spending lakhs and crores, own cared children will not see us, if we spend more than 10 thousand per month outside, will they see us with care? What a crazy crowd. Can we trust those new outside folks than our children/ neighbors/ friends/ relatives? Can we believe those who say that, we will see you with money, either our own children or brothers/ sisters? There are many adults who have run away from such people. Or they die with pain after swallowing all the pain?

కాళ్ళు చేతులు నోరు పడిపోయినాక, వారి కధలు బయటకు రావు, ఎవరూ వినరు, ఎవరూ రాయరు. ఎందుకు ఇదంతా? మన చుట్టూ, దయ జాలి కరుణ క్రుతజ్ఞత విశ్వసనీయత లేని, రజో తమో గుణాలు రాజ్యం ఏలుతున్నాయి. వాటిని పెంచి పోషించింది మనమే. అన్ని కల్తీ, మన మనసుతో సహా.

After the hands, legs and mouth fall down, their stories will not come out, no one will listen, no one will write. Why all this? All around us, no mercy, pity, compassion, gratitude, faithfullness, and everything is running by rajo tamo guna. We raised them. All corruption, including our minds.

తను సొంతముగా కర్ర లేకుండా నడవగలదు, రైలు బస్సు ఎక్కి తిరగ గలదు, హైదరాబాదు చెన్నై మధ్య. కానీ ఆ మిగిలిన ఓపికతో, స్నేహితులు బంధువులు ఇరుగుపొరుగు లాంటి ఇతరులకు సేవ చెయ్యడం ఇష్టం లేక, ఆ మిగిలిన జీవితాన్ని సుఖముగా కూర్చుని తిని తిరిగి జల్సాగా నెట్టేదామని, అందరికీ గొప్పగా తనకున్న ధనముతో, కొత్త వ్యాపార జనముతో, సుఖముగా బతుకుతున్నా, ఒంటరిగా పాత అందరినీ వదిలించుకుని, కొత్త వారి చేతిలో బంధీని అయి అని చెప్పేందుకు, మూర్ఖత్వముతో, అందరినీ వదిలి వెళ్ళిపోతున్నది. తనకు ఇప్పటికీ భవిష్యత్తు అర్ధం కాలేదు, మాయ మోహ బ్రమలు వీడలేదు. లోపం తన లో ఉంది అంటే ఒప్పుకోదు.

ఎందుకంటే, తనకు ఆస్తి ఉంది, ఆదాయం ఉంది, పించన్ ఉంది, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కూడా అధికముగా ఉంది. ఎవరినీ లెక్క చేయదు, ఎవరి మాట వినదు, ఎవరితో పొసగదు, మంచి మనసుతో సర్ధుకోవటం, 4 మెట్లు దిగడం అనేది తనకు ఇష్టం లేదు.

బంధువుల/ స్నేహితుల/ ఇరుగుపొరుగు వారి పిల్లలు చూస్తారు, పెత్తనం చేద్దాము అని ముందు అనుకుంది, కానీ ఈమె ఇన్నాళ్ళ స్వార్ధం అహంకారం చూసి, ఆస్తి రాయమనే సరికి, నేను ఎందుకు సర్ధుకోవాలి తలవంచాలి ఇక్కడ అని, ఇంకో నగరములో కొత్తవారితో సర్ధుకోవడానికి, వారి బారిన పడటానికి బయలుదేరింది. కొద్దిరోజులు ఇంకొకరితో ఉన్నా, తాను వారితో సర్ధుకోలేక పోయింది. ఇక్కడ లేని మంచి/ సర్దుబాటు అక్కడ దొరుకుందా, అని దేవుడు అలాగే సత్వ గుణ సజీవ గురువు సేవకులు చిరునవ్వుతో గమనిస్తునారు. పాత వారు మోస గాళ్ళు, మరి కొత్త వారు కాదా? లోపం మన రజో తమో గుణ ఆలోచనలు/ పనులు కాదా?

భర్త పిల్లలు ఉండగా, బంధువులు స్నేహితులు ఇరుగుపొరుగు ఎవరితోనూ మాటలు సరిగ్గా లేవు. ఏ ఒక్కరికి, తన ఇంట్లో మనిషిగా సహాయం చెయ్యలేదు, వారి ఇళ్ళకు వెళ్ళి, నిస్వార్ధముగా, అణుకువ సహనం ఓర్పు త్యాగం తో. కనీసం ఫోన్ లో కూడా, ఇతరుల బాధ వినదు. ఇతరులను, ఎలా ఉన్నారు, మీ 60 ఎళ్ళు దాటిన అమ్మా నాన్న అని కూడా, 3 లేదా 6 నెలల కొకసారి పలకరించదు.

మానవ సేవ మాధవ సేవ అని, నర సేవ నారాయణ సేవ అని తనకు నమ్మకము లేదు. తోటి మనిషి అల్లాడుతూ ఉంటే, ఒంటరిగా సహాయం అందలేక, చూస్తూ గమ్మున కూర్చుంది. వారి ఖర్మ వారు పడతారు లే అని.

సత్వ గుణ సజీవ గురువు సేవకులకు 10 వేలు ఇస్తాము ఏడాదికి వెతికి పెట్టండి అని చెప్పినా, 60 ఏళ్ళ సత్వ గుణ ముదుసలి పెద్దలను 1 ఏడాది సజీవ గురువు సేవ చేసిన వారిని చూపండి మేము ఉచితముగా సేవ చేస్తాము అని చెప్పినా, పట్టించుకోలేదు. కనీసం మంచి ప్రయత్నం అని అనలేదు, తానూ ఆ సేవను మొదలు పెట్టలేదు. నేడు తనకే, చూసే వారు, ఇంకొకరు కావాలి. బయట ఊర్లో సర్దుకుంటుంది, కాని సొంత ఊర్లో తెలిసిన వారి దగ్గర సర్దుకోలేదు, పాపం.

తనకు ఎవరైనా సాధనలు, మంచి పనులు, చేస్తున్నవి పంపినా, అబ్బో ఇవన్నీ అనవసరం, తలనొప్పి. నాకు ఆదాయం ఉంది, ఫించన్ ఉంది అని, ఆస్తి అధికార పిల్లల స్నేహితుల బంధువుల సర్కిల్ బలగం ఉంది, ఇవి మనకు వేస్ట్ అనేది. కనీసం మెచ్చుకోవడం, పదిమందికి పంపడం చేయలేదు. కనీసం తాను ఆచరిస్తూ, తన పిల్లలకు నేర్పలేదు. వారి సత్వ గుణాన్ని అలవాటు చెయ్యలేదు.

గుడికి అంటే, ప్రసాదానికి, టైం పాసు కు అని చెప్పిందే గానీ, దైవ గుణాల ఆచరణ తనకు తన పిల్లలకు పట్టలేదు. రాముడు, క్రిష్ణుడు, సీతమ్మ, రుక్మిణి లక్షణాలు తనలో తన పిల్లలలో లేవు. కనీసం, నోటితో స్తొత్రాలు, పాటలు కూడా వారు పాడలేరు. కనీసం వాట్సాప్ లో తెలుగు కూడా రాయలేరు, అదీ వారి క్రుతజ్ఞత విశ్వసనీయత. తన పిల్లలను, ముదుసలి వారి దగ్గర, ఒక పూట, కనీసం ఒక గంట ఉండి, సేవ చేయమని చెప్పదు. ఎందుకంటే, తనూ చేయలేదు ఎప్పుడూ.

అవసరాలకు, అవకాశాలకు, జనాలను చుట్టూ తిప్పుకోవడానికి, ఎక్కువగా ఉన్న ధనం విదిలించింది. ధనం చూసి వచ్చిన వారిని చూసి, తన గుణం చూసి వచ్చారనుకుని, గొప్పల బ్రమలో ఉంది. భర్తను అలాగే బంధు జనాన్ని అదిలించింది. భర్త దూరముగా ఉద్యోగం అనో, కాంప్ అనో, యాత్ర అనో మాయం, ఎందుకొచ్చిన తలనొప్పి అని. బతికి ఉన్నప్పుడు అత్త మామ వచ్చి ఓ నెల ఉండలేక, పారిపోయారు, తర్వాత రావాలంటే భయపడ్డారు.

ముదుసలి అమ్మను నాన్నను, అత్త మామను కూడా చూసే దయలేదు. వారి ఆస్తి అమ్మి, వారికే పని మనుషులను పెట్టింది, దూరముగా నెట్టింది. పిల్లలకు సంస్కారం, కొంచెం కూడా నేర్పలేదు, ఎందుకంటే ముందు తనకే తెలీదు. రాణీ కాసుల రంగమ్మ లా, అందరిపై పెత్తనము చేయడమే తన జీవితము అనుకుంది.

ఎంతో మంది చెప్పారు, మీ కన్నా ధనవంతులు, అధికారం బలగం ఉన్నవారే, ముదుసలి తనములో ఒంటరి అయ్యారు. నానా గడ్డి తిన్నారు అని చెపితే, మేము వారి కన్నా ఉత్తములము తెలివిగలవారం అని అనుకున్నది.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి అని చెపితే, అహంకారముతో, ఓ వెర్రి నవ్వు నవ్వింది.

తన 60 ఏళ్ళ జీవితములో, తన గురించి తాను తెలుసుకోలేక పోయింది. వ్రుధా యాత్రలు, యాగాలు, పూజలు, దానాలు, సంతర్పణలు చేసింది, అంతా తనది, తన చేతుల మీదగా గొప్పగా అంతా జరుగుతున్నది అని అనుకుంది. ఏ ఒక్కరి సేవకు, తన మనసు, అహంకారం అంగీకరించలేదు.

జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, ఆధ్యాత్మికం, మోక్షం,వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం - మనల్ని తెలుసుకుందాం అంటే, ఎవరో పాపం పిచ్చివారు అనుకున్నది. ధనం సంపాదించడం చేత గాక, తిన్నది అరక్క ఇవన్నీ చెపుతున్నారు, పంపుతున్నారు అని అనుకున్నది. 7 రోజులకు ఆటో డిలీట్ పెట్టుకుంది, ఇంట్లో ఎవరికీ 7 నిమిషాలు కూడా మంచి మాటలు ఎక్కవని గుర్తుగా. స్టేటస్ లో మంచి మాటలు ఎక్కవు, అసలు చూడదు, తన సత్వ గుణ పనులు పెట్టదు. ఏరోజు తన భావాలను పంచుకోలేదు, మెచ్చుకోలేదు, జవాబు చెప్పలేదు, కనీసం తిరస్కరించలేదు, అంత నిర్లక్ష్యం తన మరియు పిల్లల భవిష్యత్ అంటే.

భగవద్గీత చదివినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, అక్కడ ఎన్ని చోట్ల రాత్రులు నిద్రలు చేసినా, కపట నటన దైవ సేవలు ఎన్ని చేసినా, ఏదీ తనది కాదు అని తెలుసుకోలేకపోయింది. తన గుణం మార్చుకోలేక, చేదు దోసకాలా మిగిలింది. తానూ ఏదో ఒకనాటికి ఒంటరిని అని నమ్మలేక పోయింది. ఒంటరి వారిని ఎప్పుడూ పలకరించదు, హీనముగా, దిక్కు లేని వారిగా, దూరముగా ఉంచింది. కనీసం అండగా కూడా నిలవలేదు, అవసరాలకు.

గుణవంతు లైన స్నేహితులను, బంధువులను, ఇరుగుపొరుగును దగ్గర చేసుకోలేకపోయింది, తనకు ధనం, ఆస్తి, ఫించను, ఆదాయం, వర్గం, బలగం ఉంది అని. జీవితం వ్రుధా అయ్యింది అని తెలిసింది ఇప్పుడు.

కానీ, మొద్దు బారిన మనసు, అహంకారం, ఇంకా తప్పు ఒప్పుకోవడం లేదు. సర్ధుకుందాము సొంత వారితో, తెలిసిన వారితో, సజీవ గురువు సేవ చేస్తున్న వారితో, అని మనసుకు నచ్చ చెప్పుకోవడం లేదు. ఎక్కడైనా, తలవంచాలి సర్దుకోవాలి అని తనకు ఇప్పుడు తెలియడం లేదు.

రజో తమో గుణాల బురదలో మునిగిన మనసును, నియంత్రించడం తనకు చేత కాదు కదా. బలహీన మనసు మాటే జయించింది, కొత్త కష్టాలు కన్నీళ్ళకు దారి తీసింది, దారి వెతుక్కుంది, అంటే సొంత గొయ్య తీసుకోవటం కొనసాగించింది.

ఇతరుల ముదుసలి వారికి, ఒంటరివారికి, ఇళ్ళు వదిలేసి ఇతర ఊళ్ళలో తల్లి దండ్రులను దేవతలు గా చూస్తున్న వారికి, సేవ చేద్దామని అండగా చేదోడుగా ఉందామని ఇప్పటికీ అనిపించడములేదు. అహంకారము తో, ధనముతో ఏసీ రూం లో ఒంటరిగా, అన్ని పోగొట్టుకున్న, జీవితం వ్రుధా చేసుకున్న, శారీరక అవసరాలు తీర్చుకున్న, ప్రపంచానికి జంతు సంతాన భారాన్ని వేసిన, పాపాల భైరవి అనాధ మహరాణి లా, బతకగలను అని బ్రమ పడుతున్నది.

డబ్బులు అధికారం ఉండి, జయలలితమ్మ శ్రీదేవమ్మ కోడెలయ్య రామన్న రాజన్న సావిత్రమ్మ ఏం సాధించారు? మన లో నిస్వార్ధ సేవలు, సహనం, ఓర్పు, సర్దుబాటు తనం, త్యాగాలు ఉన్నాయా? జీవితం అంటే సినిమా, సీరియల్, లేదా వార్తా కల్పిత కధనం కాదు కదా? తలకు ఎక్కడం లేదు, అహంకారం లో ఉన్నప్పుడు, బురద పన్నీరు లా ఉంటుంది.

25 ఏళ్ల పెంపకంలో బిడ్డల కృతజ్ఞతలు లేదా, కనీసం స్నేహితులు బంధువులు, ఎవరికీ అండగా ఉండి, వళ్ళు వంచి, పనిచేసి మన్ననలు పొందలేదు. 25 ఏళ్ల వీళ్ళ నే నమ్మనిది, రిటైర్మెంట్ అనాధ ఆశ్రమ వ్యాపారం ను, ఎలా నమ్మింది? వ్యాపారం కు జాలి దయ కృతజ్ఞత ఉంటాయా? అదే మాయ, అహంకారం, భ్రమ, మదం అని పెద్దలు అంటే?

పిల్లలు చీత్కరించారు, నీ లాంటి దానిని భరించలేము అన్నారు. ధనం అహంకారం ముఖ్యం అన్నావు, ముదుసలి వారి సేవ వద్దు అన్నావు, ఎవరికీ కష్టం లో అండ వద్దు అన్నావు, అవే నేర్పావు. ఇప్పుడు మాకు అవే ఇష్టం, నువ్వు కష్టం అన్నారు, ఈసడించారు. నెలసరి ధనం కూడా పంపము అన్నారు. సొంత ఇల్లు, అద్దె ఉంది, ఖర్చులు ఏమీ లేవు, దుబారా చేస్తావు ఎక్కువ ఉంటే అని, చెప్పారు. తండ్రిని, నాయనమ్మను, తాతను పెట్టిన టార్చర్ వారు మరువలేదు.

బయట జాలి దయ కరుణ కృతజ్ఞతలు విశ్వసనీయత లేవు. ఇవి ధనం ఆస్తి అధికారం తో రావు. రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల ఉదాహరణ అదే. ఆడ మగ తేడా లేదు. కేవలం సత్వ గుణం మాత్రమే మనకు అండ అని చెప్పినా తనకు ఆనలేదు, దూరపు కొండలు నునుపు అంది.

మనకు దగ్గర లో గుణ వంతులను అలాగే మంచి గురువుని/ సిష్యుని వెతకాలి, ఏళ్లుగా. మనం ఏప్రిల్ లో గుణ వంతులకు, వారు చేస్తున్న సజీవ గురువు సేవలకు, 10 వేలు ఇస్తాం అని 2020 నుంచి మీ అందరినీ ప్రాధేయపడలేదా? 60 ఏళ్ళు పైన సాత్విక తల్లి తండ్రులు ఉంటే, ఉత్త చేతులతో వస్తే, మేము ఉచితముగా సేవ చేస్తాం, అమ్మకు చేసినట్లు, జీవితాంతం అని, 2024 నుంచి మీ అందరినీ వేడుకోలేదా? ఒకవైపు మేము సజీవ గురువు సేవ చేస్తూ కూడా అన్ని విన్నపాలు చేసాము కదా? అదే పని అందరూ ఎందుకు చేయరు? ధనం తో సేవ నటన కొన్ని రోజులే, తర్వాత అసలు రంగు.

కన్న జంతువులు తో బంధం పెంచుకోవడం వృధా అని, ఆమె కు చేతులు కాలాక 60 కి అర్థం అయిందా? మరి 6 ఇళ్ళలో, 5 ఇళ్ళు వారి పేరున రాసి, ధనం ఎలా ఇచ్చాము, వారు జంతువులు అయితే? మరి జంతువులకు 5 ఇళ్ళు ఇచ్చి పెంచి పోషించినది మనిషా? అంటే, తనే దొంగ బుద్ది, కపట నటన 2 నాల్కల ధోరణి అని ఒప్పుకున్నట్లే కదా? అరిషడ్ వర్గ అష్ట వ్యసన బానిసత్వం వీడమా, ఇకనైనా?

అయినా రిటైర్మెంట్ హోం కు వెళుతుందా, ధనం ఉందని? మరి బీదలు ఎక్కడకు వెళ్ళాలి? ఇదేనా దైవ సమానత్వము, భగవద్గీత నేర్పింది? కాళ్ళు చేతులు కదలనప్పుడూ, వారు చూడకపోతే అవమానిస్తే పట్టించుకోకుండా ఉంటే, బయటకు నెడితె, అవయవాలు లాగేస్తే, అడిగే దిక్కు ఏది? ఎక్కడకు పోతుంది, ఎవరు వింటారు ఆనాడు? పిల్లలకు చెపితే, ఆశ్రమం వారు, ఎక్కడ తీసుకుని వెళ్ళమంటారో అని, వాళ్ళు ఫోన్ లు ఎత్తుతారా? అసలు కోడళ్ళు/ అల్లుళ్ళు రానిస్తారా?

అంటే గుణం లేని పెళ్లి, జంతు సంసారం సంతానం, అహంకారం తో జీవితం వృధా అయింది అని, ఇప్పుడు కూడా పశ్చాత్తాపం పడదా? ఫింఛను ఆస్తి ఆదాయం ఉందని అహంకారం నా? అందుకే రామన్న రాజన్న సావిత్రమ్మ శ్రీదేవమ్మ జయలలితమ్మ కోడెలయ్య కధలు చదవమంది.

పెళ్ళి దగ్గర నుంచి మొదలైన బ్రమలు, పిల్లలతో పెరిగి, ఇప్పుడు అనాధ ఒంటరి మహరాణి రిటైర్మెంట్ రూం లో, బ్రమలతో కొనసాగుతున్నది. అంటే, ఇంకా పంచభూతాల దెబ్బ అర్ధం కాలేదు కదూ?

ఎవరో చెప్పినట్టు… ఏముంది.? ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది, మంచి ఆరోగ్యం, ఆయుర్వేదం ...అత్యవసరాలు… మిగిలినవన్నీ గత అహంకార గురుతులు మాత్రమే…

ఇప్పుడు అర్థమవుతుంది మనకు… మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… సజీవ గురువు సేవ ఉండాలి, మంచి మాట, మన గోడు వినే ఒక చెవ్వు, లాలించే ఒక చెయ్యి, కబుర్లు చెప్పే ఒక నోరు, నిస్వార్ధముగా ధైర్యం ఇచ్చే ఒక గుండే. సత్వ గుణ జనాలను వెతికి పట్టుకోవాలి. వారికి తల వంచాలి, మనశ్శాంతి గా వారి నీడన ఉండాలి. ఒంటరి అలాగే ముదుసలి వారి సేవ చేయాలి.

మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు, మనకు ఇక ఎటూ పనికిరాని వాటిని, అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను, సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు… వదిలేయాలి… వదిలించుకోవడమే… తోటి మనుషుల సేవ చెయ్యాలి నిస్వార్ధముగా. కనీసం ముదుసలి తల్లి తండ్రి అత్త మామ, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు సేవ అయినా.

కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్… లైఫ్ అంటే చివరికి, ఓ మడత కుర్చీ, పడకమంచం, తినే పళ్ళెం, తాగే గ్లాసు, కట్టుకునే గుడ్డ్ మాత్రమే నిజంగా అంతే…

ముప్పై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి… ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి… అంతిమ గమ్యం ఏమిటో, భవ బంధాలేమిటో అర్థమవ్వాలి…

మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించ లేనివి వదిలేయక తప్పదు… అందుకే స్వార్ధ అవసర అవకాశ కపట నటన 2 నాల్కల రజో తమో గుణ బంధం పెంచుకోవడమే వృథా…

సో....కాబట్టి,

ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి… మానవ సేవ చేయండి. ఏదీ మనది కాదు… ఎవరూ మనవాళ్లు కారు సత్వ గుణం లేకపోతే … ఏదీ మనతో రాదు, మనిషి ఒంటరి… మహా ఒంటరి… వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఉత్త చేతులతో ఏడుస్తూ.. !!

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను వీడకపోతే, మన పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, భాగస్వాములు, స్నేహితులు, బంధువులు, పంచభూతాలు, అందరూ మనల్ని ఇలాగే నిర్దాక్షిణ్యముగా వదిలేస్తారు సుమా.

అందరూ ఉండి, వెలివేయబడి, ఆశ్రమము కు పోవడం, అదీ ధనము ఖర్చుతో, ఆత్మాభిమానం చంపుకుని, అది అవమానం, చచ్చిన శవముతో సమానం, మనకు నరకమే గతి, మరు జన్మ దుర్లభం. బతికి, తోటి వారికి సహాయపడదాము, దైవ క్రుప తో మోక్షం పొందుదాము.

78+ ఏళ్ళ ముదుసలి సొంతగా నడవలేని తల్లిని, ప్రభుత్వ ఉద్యోగం వదలి, లక్షల ఆదాయం, ఫించను వదలి, 3 ఏళ్ళు పైగా ఉద్యోగం ఆదాయం లేకపోయినా, అవే సౌకర్యాలు కల్పిస్తూ, శాఖాహారం తింటూ, చాప నిద్ర చేస్తూ, 237 వారాల 108 ప్రదక్షిణలు చేస్తూ, ఒంటి మీద పైసా బంగారం మేకప్పు లేని, సజీవ గురువు సేవ గౌరవ భక్తి శ్రద్దలతో చేస్తూ, 3 ఏళ్ళు పైగా కాళ్ళు కడిగి వేదాలతో పూజ చేసి నెత్తిన నీరు చల్లుకుని, 10 ఏళ్ళు గా రోజూ చేయి పట్టుకుని మైలు దూరం నడిపిస్తూ, సొంత ఆయుర్వేదము తో, షుగరు బీపీ ని నిండు బిళ్ళ నుంచి అర బిళ్ళకు తెచ్చిన వారు, 10 ఏళ్ళ జీవిత కాలం పెంచిన వారు, ఇంత కన్నా ఎక్కువ సేవ చేసిన వారు మనలోనే ఉన్నారు. మనచుట్టూ ఉన్నారు, అహంకారం అజ్ఞానం విడిచి, సత్వ గుణం తో వెతుకు.

మీకు, మీ కుటుంబానికి బందువులు పిల్లలు స్నేహితులకు చేతకానిది, ఇంకొకరు చేసి చూపిస్తున్నారు ప్రత్యక్ష సాక్ష్యముతో అని అహంకారాన్ని విడిచి, పది మందికి చెప్పి, వారి బతుకులు నైనా మార్చు. పెళ్ళి అయితే, అత్తా మామలను కూడా అలాగే తల్లి దండ్రుల లాగే సేవించాలని చెప్పు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2132 General Articles and views 1,982,896; 104 తత్వాలు (Tatvaalu) and views 232,252
Dt : 13-May-2024, Upd Dt : 13-May-2024, Category : General
Views : 279 ( + More Social Media views ), Id : 2102 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Vanaja , Senior , Citizens , Home , business , money , services , muripala , support
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content