APLatestNews.com top Banner
         
వడ్డీ లు చీటీలు బినామీలు, గురు శిష్యులు సంవాదం 2 వ భాగం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఇంకో శిష్యుడు , గురువు గారు , వడ్డీ వ్యాపారం అంతటితోనే ఆగుతుందా , మారు(వివిధ) రూపాలు ఉన్నాయా, అందులో?

చాలా నల్ల ధన దొంగ వ్యాపారం లకు ఇదే మూలం. అత్యంత అవసరం అయితే, 20 రూ వడ్డీ లు కూడా ఉన్నాయి. ఒక మారు రూపం ఉదాహరణ చూద్దాం. సామాన్య జనానికి, ఉద్యోగుల కు, ఇవి తెలీదు లేదా పట్టించుకోరు.

జనం డబ్బు తో ఉదాహరణకు కు స్ధలాలు కొని , ఇళ్ళు కట్టి వెంచర్ లు గా అమ్మవచ్చు. దానిలో కోట్లు సంపాదించవచ్చు. అలాగే వేరు వేరు వ్యాపారాలలో, పెట్టుబడులు తో లాభాలు పొందవచ్చు. సామాన్య జనం కు ఇవి చెప్పరు , లాభాలు పంచరు , మూలధనం జనం దే అయినా, తెలివి మాది అంటారు. అలాగే నష్టాలు కూడా, వారే భరించాలి కదా జనం నెత్తిన రుద్దకుండా.

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే, వారి భాగస్వాములు విడిపోవడం , వెన్నుపోటు పొడుచుకోవడం పేపర్లో వింటున్నాము. క్షణ క్షణ గండం నూరేళ్ళ ఆయుష్షు వారిది.

స్వామీ , చీటీ పాటల లో, కొంతమంది ఎగకొడితే ఎలా? మిగతా వారికి ఎలా చెల్లించాలి?

శిష్యా భరించేవాడు భర్త, లేకపోతే పెళ్ళి చేసుకోకూడదు. అవన్నీ భరించాలి వ్యాపారం లో , తనకి కమీషన్, వస్తుంది కదా. అందుకనే మంచి వారు, ఇటువంటి వాటి జోలికి పోరు. ఇందాకే చెప్పినా, షాప్ లాభ నష్టాలు యజమానులవే , జనం , ఉద్యోగుల వి కావు.

స్వామి, నష్టం వస్తే జనాన్ని భరించమనడం తప్పా?

శిష్యా , నువ్వే చెప్పు జవాబు ఇది విని. పెళ్ళి చేసుకుని, భార్య పిల్లల తో ఖర్చు ఎక్కువ గా ఉంది, ఇబ్బందులు నష్టాలు ఎక్కువ అయినాయి, అని పదిమందినీ, మీరూ మా బాధ్యత పంచుకోవాలి, అని అడుగుతామా? అడిగితే, ఆ ఇంటికి యజమానులు, ఎంత మంది? బాంకు ల ను మోసం చేసే, వారి పరిస్థితి ఇదే.

అమ్మో , లేదు స్వామి, నా ఇంటికి, కుటుంబం కు, వ్యాపారం కు నేనే యజమాని కావాలి. వేరే వాళ్ళ ను, కానివ్వను స్వామి, నా ఆత్మాభిమానం చంపుకున్నట్లే గదా.

కళ్ళు తెరిపించారు. పదిమంది తో వ్యాపారం, పదిమంది డబ్బు తో జాగ్రత్తలు, కష్టాలు. వామ్మో, ఫలితాలు మన కుటుంబ తరాలు భరించాలి.

Dt : 03-May-2019, Upd Dt : 03-May-2019 , Category : General, Views : 64 ( id : 99 )
Tags : interest , cheetee , binaamee , guru , sishya
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments