APLatestNews.com top Banner
         
రామాయణ కాలానికి ఇప్పుడు కాలానికి ఎంతో ఎదిగామా , పతనమయ్యామా ? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
రామాయణ భారతాల లోని పాత్రలన్నీ, మన మనోభావాలే. మనకి ఏది మంచి ఏది చెడో చూపే, గురు మార్గాలు.

రామాయణ కాలం లో ధర్మం నాలుగు పాదాల నడచింది. రాజు, కేవలం జనం కోసం కష్టపడ్డారు. నీతి, నియమాలు, మంచి, మర్యాద అనేవి అందరికీ ఉండేవి. ఇప్పుడు కలియుగం లో ఒంటి పాదం తో కుంటుతూ నడుస్తుంది.సామాన్య జీవితములో కొన్ని పోలికలు చూద్దాము. యధా రాజా తధా ప్రజా, అన్నట్టు, రాముని సుగుణాలే ప్రజలకు ఉండేవి.

నాడు : ఊరుకొక శూర్పణక , కైక, మంధర , రావణుడు, వాలి ఉండేవారు కాదేమో
నేడు : ప్రతి ఇంట్లో వీలైతే అందరూ లేదా అన్ని లక్షణాలతో ఒకరు, లేదా కనీసం ఒకరు తగ్గరు

నాడు : రాముడు లాంటి రాజు కావాలి.
నేడు : రావణుడు లాంటి నాయకుడు మాత్రమే కావాలి రావాలి

నాడు : వేదాలు చదివిన రాక్షసుడు, రావణ బ్రహ్మ
నేడు : వేదాలు మరచిన పండితులు

నాడు : భర్త తో నార చీరలు ధరించి అడవికి వెళ్ళిన నారీమణి(సీతమ్మ తల్లి)
నేడు : భర్త గ్రామానికి పోయినా హైదరాబాద్ లేదా అమెరికా వదలాలా, నేటి ఫాషన్ కు కించిత్తు కూడా తగ్గేది లేదు అనే నారీమణులు

నాడు : తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిన కొడుకు(శ్రీ రామచంద్రుడు)
నేడు : తమ సౌఖ్యం కోసం తల్లి దండ్రులు ను ఆశ్రమానికి పంపే కొడుకులు/కూతుళ్ళు

నాడు : తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యజించిన కొడుకు(శ్రీ రామచంద్రుడు)
నేడు : ఆస్తులు అధికారం కోసం తల్లి దండ్రులు ను త్యజించే లేదా కీడు చేసే కొడుకులు/కూతుళ్ళు

నాడు : అన్నలేని అధికారం వద్దు అని అన్న పాదుకలతో రాజ్యాన్ని నడిపిన తమ్ముడు, భరతుడు
నేడు : వీలైతే అన్నను పక్కకు లేదా పైకి తప్పించి, అధికారం కావాలి అనే తమ్ముళ్ళు

నాడు : అన్న కోసం అడవికి తరలిన తమ్ముడు(లక్ష్మణ స్వామి)
నేడు : తమ సౌఖ్యం కోసం అన్ననే బయటకు నెట్టే తమ్ముళ్ళు / చెల్లెళ్ళు

నాడు : ఫలితం ఆశించక నాయకుడి కి సేవ చేసే నమ్మిన బంటు(రామదూత ఆంజనేయుడు)
నేడు : ఆస్తులు ఆశించి నాయకుడినే కడ తేర్చే అనుచరులు

నాడు : ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అనే భర్త(శ్రీ రామచంద్రుడు)
నేడు : పై మాటలు పాత మాటలు అని కోరి కష్టాలు తెచ్చుకునే గడుసు భర్తలు

నాడు : చూసి రమ్మంటే కాల్చి వచ్చే తెలివైన నమ్మక సేవకులు(రామదూత ఆంజనేయుడు)
నేడు : పని చేసి రమ్మంటే, చూడకుండానే, తమ పనులు చేసుకొని వచ్చే నమ్మక ద్రహులు

నాడు : అక్క / చెల్లెలి బిడ్డలను తన సొంత బిడ్డలు గా చూసే తల్లులు(కౌసల్య, సుమిత్ర ,కైకేయి)
నేడు : తమ బిడ్డలను కూడా చూసే ఓపిక , సమయం లేని తల్లులు (అమ్మలు, అమ్మమ్మ ల దగ్గర వదిలేస్తున్నారు కొందరు, పిల్లలకు బాధ్యత నేర్పకుండా ప్రొత్సహిస్తున్నారు )

నాడు : పంతం కోసం కాంతను తెచ్చి , దూరంగా ఉండి, 10 నెలలు గడువు ఇచ్చిన రాక్షసుడు, రావణ బ్రహ్మ
నేడు : 10 నిమిషాలు కూడా ఓపిక పట్టలేని రాక్షస జాతి శ్రేష్టులు

నాడు : సుభిక్షం గా ఉండే రామ రాజ్యం
నేడు : నిరంతర సమస్యలతో కష్టాలతో అల్లాడే రావణ రాజ్యం

నాడు : ఆడిన మాట తప్పని జనం
నేడు : ఎప్పటి మాట అది అనే జనం

నాడు : ముగ్గురు భార్యలతో కలసి సంతోషంగా ఉన్న భర్త, దశరధుడు
నేడు : ఒక్కరి తోనే కలత చెందుతున్న భర్తలు. వీలైతె, ఒకరిని వదిలి ఇంకొకరని చేసుకుంటూ పోతున్నారు ఆడ, మగ కూడా.

నాడు : తప్పు చేస్తే అన్నకు కూడా నచ్చ చెప్పి, వినక పోతే, ధర్మం కోసం, దూరమైన తమ్ముడు(రావణ బ్రహ్మ , విభీషణుడు)
నేడు : అన్ని చెడుపనులకు వెన్ను తట్టి ప్రోత్సాహం, ఇరువైపులా

నాడు : తప్పు చేస్తే కన్న తల్లిని తప్పుపట్టి, తల్లిని మంచి మార్గములో పెట్టిన కొడుకు(కైకేయి, భరతుడు)
నేడు : అన్ని చెడుపనులకు వెన్ను తట్టి ప్రోత్సాహం, ఇరువైపులా

నాడు : బలవంతుడైన వాలిని(అధర్మం) వదిలి బలహీనుడైన సుగ్రీవుని(ధర్మం) వైపు నిలచిన రాముడు
నేడు : అవసరానికి, కేవలం అధర్మానికి బానిసలైన బలవంతుల, పంచలో నే మా మకాం అంటున్న అందరూ

ఇలాంటివి ఇంకా ఎన్నో, రామాయణాన్ని చదివి అర్ధం చేసుకుంటే.

Dt : 15-Apr-2019, Upd Dt : 15-Apr-2019 , Category : Devotional, Views : 98 ( id : 90 )
Tags : sri rama
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments