APLatestNews.com top Banner
         
చివరిలో ఏయన్నార్ లా వెళదామా లేక ఎన్టీఆర్‌ లానా? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారం, ఉద్యోగాలలో పడి, క్షణం తీరిక లేక, పిల్లల భవిష్యత్తు మరియు వాళ్ళ మానసిక ఎదుగుదలను పట్టించుకోవడంలేదు. ఎందుకంటే బిజీ లైఫ్, ఎన్నో పనులు, భార్యా భర్తల తగవులు, అన్నిటి మీద మోహం. ఏదో వీకెండ్ కొన్ని గంటలు లేదా రోజూ ఒక గంట పిల్ల ల తో, మొక్కుబడిగా గడిపితే చాలు అనుకుంటున్నారు. ఇంకొంతమంది పిల్లలతో ఫోన్లలో లేదా దూరంగా బతికేస్తారు.

భార్యా భర్తలు ఉద్యోగాలు లేదా ఇంట్లో ఉన్నా కూడా ఆఫీస్ లేదా మిగతా వ్యాపకాలు తో బిజీ. దీని వలన, పిల్లలు బాగా చదివినా కూడా, జీవితం లో సమస్యలు వస్తే, ఎలా ఎదుర్కోవాలో తెలీక, ఆత్మ హత్యలకు లేదా నిరాశా నిస్పృహలకు లోకి వెళుతున్నారు.

మొక్క అయి వంగనిది మాను అయి వంగుతుందా, అని మనకు సామెత కూడా ఉంది. 10 లేదా 15 (కొంతమందికి 30 ఏళ్ళు లేదా పెళ్ళి దాకా) ఏళ్ళ లోపు మనము ఎంత జాగ్రత్త గా పెంచగలిగితే, ఆ తర్వాత ఆ క్రమశిక్షణతో వారు ముందుకు సాగ గలరు. రాముడి గుణ గణాలు, కృష్ణుడు తెలివితేటలు నేర్పిస్తే బాగుంటుందేమో ఆలోచన చెయ్యాలి. అతి గారాబం అన్ని విధాల అనర్ధం.

అంటే వారి వ్యక్తిత్వం ఏమిటి, ఎంత అర్దం అవుతుంది, ఎంత ఆచరిస్తున్నారు అని, 15 ఏళ్ళు వచ్చేదాకా కనీసం, జాగ్రత్త గా కనిపెట్టుకొని ఉండాలి, ప్రతిక్షణం వారి కదలికలు గమనిస్తూ. కొంత మంది స్వేచ్చ హరిస్తున్నాము అంటారు. మంచిగా పెంచినా, చెడు గా మారే వారిని ఏమీ చేయలేము, వారి రాత అది.

సరే, మనము పెద్దవాళ్ళు గా ఏమి సాధిస్తున్నాము? మితిమీరిన కీర్తి, సంపదలతో, చివరకు ఎవరికి ఏమి లాభం? పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వక పోగా, కనీసం పేరెంట్స్(మనకి) కూడా, వారు పనికి రావడం లేదు. ఆ, మనము మన తల్లి దండ్రులకు పనికి వచ్చామా అంటారా? తన దాకా వస్తే కాని తెలీదు కదా.

బయోపిక్ లతో, గతాన్ని గుర్తు చేస్తున్నారు అందరూ. పెద్దల జీవితాల నుంచి, గుణపాటం నేర్చుకోవాలి అందరం, అన్యధా భావించవద్దు.

అన్న గారి పేరు ప్రఖ్యాతులు, తెలుగునాట తెలియని వారు లేరు. సినీ రంగంలో, నంబర్ 1 అన్నగారు అయితే, నంబర్ 2 ఏయన్నార్ గారే. ప్రేమ కధా చిత్రాలలో, ఏయన్నార్ గారే నంబర్ 1. అన్న గారు, సినిమాలు, రాజకీయాలు తన పూర్తి జీవితం అన్నట్టు గడిపారు.

అన్న గారి పిల్లలు, ఒక్కరు అన్నా, నాయకత్వ లక్షణాలతో , అన్న గారి తర్వాత పార్టీని నడిపించ గలిగారా? కనీసం చివరలో నన్నా బిడ్డలుగా, తోడు ఉన్నారా కోపం లేకుండా? లేదు పాపం ఆయన ఒంటరిగా, గుండె వ్యధతో నింగికేగారు.

అదే ఏయన్నార్ గారు, ఎంత వరకు సినిమాలు చేయాలో, అంత వరకు మాత్రమే చేసారు. ఏది మితిమీరి చెయ్యలేదు, కుటుంబానికి కూడా సమాన విలువ ఇచ్చారు. ఒకవేళ ఎక్కువ చేసినా, పిల్లలను స్వంత అభిప్రాయాలతో, తీర్చిదిద్దారు. ఆయన చివరలో ప్రశాంతముగా, అందరి మధ్య, చిరు నవ్వుతో నింగి కేగారు. పిల్లలు, అందరు మనుమళ్ళతో కలిపి అందరూ దగ్గర ఉన్నారు అంతిమ కాలం లో.

ఒంటరి వాళ్ళ సంగతి ఏమీ చేయలేము, ఎక్కువా బాధపడరు. కానీ ఇన్నేళ్ళు, ఇంత కష్టపడి పెంచి చదివించి, చివరలో తోడు లేకపోతే, కన్న వాళ్ళే మోసం చేస్తే, కలిగే గుండె కోత కొంతమందికే తెలుసు, ముందుచూపుతో.

ఇప్పుడు చెప్పండి? ఎప్పుడు మితిమీరిన కీర్తి లేదా డబ్బు సంపాదనతో, చివరలో మనశ్శాంతి ఉంటుందా మనకు? సంపాదనతో పాటు కుటుంబానికి సమాన విలువ ఇవ్వాలా? బిడ్డల మానసిక ఎదుగుదల బాధ్యత మనది కాదా, అది ఎంత కష్టమో తెలీదా? అవసరం లేదంటారా, సరే కాలం చెబుతుంది.

Dt : 15-Apr-2019, Upd Dt : 15-Apr-2019 , Category : General, Views : 151 ( id : 89 )
Tags : Happy Life , Good kids
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments