APLatestNews.com top Banner
         
మన రాజకీయ నాయకుల గురించి కొంచెం మంచి చెడు, మార్పులూ విశ్లేషణ - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మనకు చాలా మంది మిత్రులు అన్ని పార్టీలలోను ఉంటారు. కాని మనము మన పార్టీ లోపాలను సరి చేసుకుంటూ పోతే, మన నాయకులు బాగుపడతారు. మనమూ బాగుపడతాము. తప్పులు అందరము చేస్తాము, కానీ కొంతమందే దానిని సరిచేసుకొని ముందుకు పోతారు. చెప్పే వాటిలో, కొన్ని సార్లు కటువు గా రాయాలి ఎందుకంటే అవి కార్యకర్తల మనోభావాలు. అది సరిచేసుకోటానికి, సోపానాలు.కాంగ్రెస్స్ బీజేపి పరిస్థితి ఘోరం, సరైన నాయకుడే లేడు.

1. చంద్రబాబు - అన్న గారి అల్లుడుగానే, జనానికి బాగా తెలుసు. అందుకే వెన్నుపోటు లేదా పార్టీని కాపాడటం, జనం మర్చిపోలేక పోతున్నారు. కిందనుంచి కష్టపడి, తన్నులు తిని, తన్ని పైకి వచ్చిన 30 సంవత్సరాల పైగా అనుభవమున్న నాయకుడు. దాదాపుగా పోటీలో, ఎవరూ లేరు సమకాలీనులు. ఎన్నో మంచి పనులు చేసారు, అలాగే తప్పిదాలు చేసారు.

ఈ ఎన్నికలలో పాపం ఎంతో కష్టపడ్డారు అంత వయసులోను. మొఖం లో ఆందోళన, భయము కనిపించాయి, జగన్ పవన్ లను చూసి. ఎవరు కాదన్నా, సాఫ్ట్వేర్ బూం తెలుగు వాళ్ళలో తెచ్చింది ఆయనే. దేశం అభిమానులు అంటారు, బాబు తప్ప ఈ మహా సముద్రాని ఈదాలి అంటే, వేరే వాళ్ళ వల్ల కాదు అని, అది నిజం.

గత 5 ఏళ్ళు లోపాలు : సొంత కుల ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపొయింది ఆయనలో లేదంటే ఆయన కోటరీలో. పుత్ర వ్యామోహం ఎక్కువ అయింది. ఈ రెండూ ఆయన కంట్రొల్ చేసుకోవాలి. చుట్టూ ఉన్నవాళ్ళు, ఆయనకు తెలియచెప్పాలి, ఊరకనే పొగడకుండా తమ అవసరాలకోసం.

జూ ఎన్ టీ యార్ ను వాడుకోని, పార్టీని నిలబెట్టాలి. ఇది ఆయనకు ఇబ్బందే, కాని తెలుగు దేశాన్ని నమ్ముకోని అండగా ఉన్న, లక్షలాది అభిమానుల వైపు ఆలోచన చెయ్యాలి. పార్టీ క్షేమం ఒకవైపు, లోకెష్ భవిష్యత్ ఇంకోవైపు, స్వార్ధం విడిచి ఆలోచన చేస్తే మంచిది. యువ నాయకత్వం రావాలి.

అమెరికాలో జరిగే మంత్రి మీటింగులకు కూడా ప్రకటన లో పసుపు రంగు వాడుతూ, దేశం కుల పార్టీ మీటింగ్ లు గా మార్చేసారు. అంటే మిగతా జనం రారు, అది తెలుగు దేశం సొంత కార్యక్రమం అని.

2. జగన్ - రాజన్న ప్రజల మనసులో సుస్తిర స్థానం తెచ్చుకున్న నాయకుడు. రామన్న ను సినిమా నాయకుడిగా, రాజన్న ను రాజకీయ నాయకుడిగా జనం ఎన్నటికీ మరువ లేరు. రాజన్న అధికారం లో ఉన్నప్పుడే, జగన్ అన్ని విషయాలలో, కుర్రతనం తో వేలు పెడుతుంటే, బెంగళుర్ లో పెట్టారు అంటారు. దూకుడు ఎక్కువ, ఎవరి మాట వినడు, మొండి ఘటం.

సోనియా ఎంత చెప్పినా వినకుండా ఎదిరించి, బయటకు వచ్చి, కొత్త పార్టీ పెట్టి, ఇన్ని రోజులు నిలబడ్డాడు అంటే, చాలా గట్టి పిండం, ధైర్యవంతుడు. ఇంకొకరైతే, చంద్రన్న కుట్రలకు ఎప్పుడో బలి అయ్యేవారు. ఇది చాలా గొప్ప ధైర్యం. 2014 లోనే గెలవాలి, కాని తన స్వభావం వల్ల, గెలవలేదు. మరి ఇప్పుడైనా మార్పు వచ్చిందా? చూద్దాం.

గత 5 ఏళ్ళు లోపాలు : దూకుడు ఎక్కువ, ఎవరి మాట వినడు. ఇదే ప్రమాదం. గాలి లాంటి వారికి, పోగడ్తలకు దూరంగా ఉండాలి. కేవీపి లాంటి వారు పక్కన ఉండాలి అదుపు చేయటానికి, ఉన్నా జగన్ వారి మాట వింటాడా? వినాలి, జగన్ ని నమ్ముకున్న లక్షలాది జనానికి అండగా ఉండాలి అంటే.

కేసియార్ తో ఎంత వరకో అంతే ఉండాలి. ఎన్నికలప్పుడు ఆ తర్వాత కూడా, రెండు రాష్ట్రాలలో ప్రాంతీయత రెచ్చ గొడతారు, ఆ ఉచ్చులో పడకూడదు. కేసియార్ విషయాలు ఎత్తకూడదు. ఎదురు గా ఉన్నది బాబు అన్న విషయం మరువ కూడదు. లోటస్ పాండులో ఉంటూ, ఆంధ్రా జనాలకు దూరపు చుట్టముగా ఉండకుండా ఉంటే బాగుండేది. బాబు ఫోన్ టాపింగ్ భయంతో నేమో? కాని, జనాల మదిలో అమరావతి లో లేరు అని ఉంటుంది.

3. పవన్ - ఆవేశం, ఉత్సాహం, అభిమానులు. సినిమా లోకం నుంచి రాజకీయ లోకం లోకి అడుగు పెట్టాడు. కొంచెం అటు కొంచెం ఇటు గా ఉంటుంది. కానీ చిన్నగా మారుతుంది స్వరం, రాజకీయ నాయకుడి లా. చిరు మచ్చ తన మీద పడకుండా జాగ్రత్త పడ్డారు, దూరంగా ఉంచి.

గంటా లాంటి నాయకులను, దూరంగా ఉంచి, మంచి పని చేసారు. చివరి నెలలు చాల కష్టపడ్డారు, బాబును జగన్ ను ఏకి పారేసాడు, నిర్భయంగా. తమతో కలిసాడు అన్న అపవాదులను, సమర్ధం గా ఎదుర్కొన్నాడు.

గత 5 ఏళ్ళు లోపాలు : కొంత కాలం లోపల, కొంత కాలం బయట అన్నట్లు గా , టైం చూసుకొని ప్రశ్నించారు. దానివల్ల పార్ట్ టైం నాయకుడిలా గడిపారు. సంస్థాగతంగా బలం గా ఉన్న పార్టీలను ఎదుర్కోవాలి అంటే, జనసేన ను కూడా అదేవిధంగా కింద నుంచి నిర్మించ గలిగారా, చూడాలి.

అటు బాబు, ఇటు జగన్ వెన్ను పోటు పొడవటానికి, కోవర్ట్ లను వాడకుండా ముందు జాగ్రత్త ఉండాలి.

4. పాల్ - ప్రపంచ నాయకుడు, మరి ఇంత చిన్న రాష్ట్రానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో తెలీదు. బాబు ప్లాన్ ప్రకారం, పచ్చ మీడియా పాల్ ను పైకి లేపింది. మరి ఉపయోగపడిందా లేదా చూడాలి. మరి దేవుని బిడ్డలు, పాల్ మాటలు విశ్వసించారా లేదా చూడాలి.

గత 5 ఏళ్ళు లోపాలు : తను అన్ని పార్టీలను, సమానం గా దుమ్ము దులిపినా, జనం సీరియస్ గా తీసుకున్నారా అనేది తెలీదు, ఆయన వింత చేష్టలతో. పూర్తిస్థాయి నాయకుడి గా ఇక్కడ లేరు.

Dt : 11-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : Politics, Views : 93 ( id : 87 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments