APLatestNews.com top Banner
         
ప్రత్యేక హోదా కేంద్ర మోసమా లేక మన రాష్ట్ర నాయకుల స్వార్ధ మాయాజాలమా - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ప్రత్యేక హోదా, కేంద్రం మోసం చేసిందా లేక గుడ్డిగా విషయం తెలుసుకోక తప్పుడు నాయకుల మాటలను నమ్ముతున్నామా? చదవండి.

ఇప్పుడు హోదా కష్టం లేదా మిగతా వారు పట్టుబడుతున్నారు, అంటే తెలంగాణ ఒరిస్సా తమిళనాడు, మాకూ కావాలని , దానికి సమానమైన పాకేజీ ఇస్తాము, మీకు ఇబ్బంది లేకుండా అన్నారు మోడీ. ఇది బాబు గారే ఒప్పుకున్నారు.

పోనీ హోదా ఇచ్చినా, తమ బినామీ ల తో కంపెనీలు పెట్టించి వారే లాభం 90 రూపాయలు తిని , జనం మొఖాన 10 రూపాయలు చిల్లర వేస్తారు.

మన సీనియర్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి, లేదా అసెంబ్లీ కి పోకుండా జీత సౌకర్యాలు తీసుకునే ప్రతిపక్ష నేత ఏమి అనాలి? జనాలు తంతారు, ఇస్తారా చస్తారా అని, ఢిల్లీలో నిజమైన ధర్నా లు చెయ్యాలి , లేదా కెసిఆర్ లా ఉద్యమం చెయ్యాలి.

బాబు ఏమి ఆలోచన చేసారు, పాకేజీ అయితే పంచుకోవడం కి దోపిడీకి తేలిక అనుకున్నారు. కేంద్ర కి కాగితం రాసి ఇచ్చారు - హోదా వద్దు పాకేజీ ముద్దు అని. కేంద్రం ఇచ్చిన డబ్బు కి లెక్క చెప్పకుండా, అటూ ఇటూ మార్చి , బినామీ ల తో నొక్కేయడం మొదలెట్టారు.

ఇచ్చినవి లెక్క చెప్పకపోతే రాష్ట్రం, కొత్తవి ఇవ్వము అంది, కేంద్రం. అయినా చాలా పనులు చేసింది. మన ఇంట్లో నే చెప్పండి , భార్య భర్త బిడ్డ డబ్బులు ఖర్చు లెక్క చెప్పము ఎవరికి అని దుబారా చేస్తే ఏమి జరుగుతుంది? అరాచకం. జిల్లా లు , పట్టణాలు , గ్రామాల్లో కూడా లెక్క చెప్పం అంటే బాబు ఏం చేస్తారు?

మన జగన్ తాపీగా వ్యాపారాలు చూసుకుంటూ, పాండ్ లో రెస్ట్, అసెంబ్లీ కి పోక , తూతూ మంత్రంగా ఆంధ్రా లో 4 ధర్నా లు చేసి కాలం నెట్టేసారు. గట్టిగా అడిగితే ఈడీ , సిబిఐ కేసులు కదులుతాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి.

బాబు దోపిడీ చూసి జగన్ కన్ను చెదిరింది అంతే కాదు మరలా హోదా రాగం ఎత్తి బాబు మోసం అని అనందే తను గెలవడు అనేది అర్దం అయింది. జనం అడగరు కదా, కెసిఆర్ లా ఉద్యమం ఎందుకు చెయ్యవు, కేంద్రం మీద అని.

పాకేజ్ లొ భాగం మింగిన బాబుకు, ఏం చెయ్యాలో తెలీదు. పిచ్చి జనమే కదా అని, కేంద్రం మోసం చేసింది హోదా లో అని ఎదురు దాడి మొదలు పెట్టరు, లెక్కలు ఎందుకు చెప్పాలి అని.

నిప్పు లాంటి బాబు, సిబిఐ ని నిషేధం చెయ్యవచ్చా? అంటే బాబు నిప్పు కాదు. రేపు వైజాగ్ , కడప , నెల్లూరు పట్టణ పోలీసులు లేదా మేయర్ లు కూడా ఏసీబీని, రాష్ట్ర పోలీసును, ముఖ్యమంత్రి ని, మా పట్టణంలో కి రానీయం అంటే ఏం జరుగుతుంది? అరాచకం.

ఇప్పుడు చెప్పండి ఎవరం పిచ్చి వాళ్లం. ఏ రాయి అయితే నేం మన పళ్ళు రాలడానికి? ఇది చాలా మంది కి తెలుసు. కానీ బానిసలుగా, బినామీ లుగా నాయకులు కు ఊడిగం చేస్తూ, తమ రాష్ట్రం కి తామే ద్రోహం చేసుకుంటున్నారు.

బాబు వస్తే జగన్ బాచ్ ని వేధిస్తారు అని వీరి భయం. జగన్ వస్తే, బాబు బాచ్ ని వేధిస్తారు అని తీస్తారు అని వారి భయం. గెలవకపోతే భవిష్యత్ ఉండదని ఇంకో బాధ. పవన్ , పాల్ దెబ్బ ఎటు తగులుద్దో తెలీదు. బాబు కు, జగన్ కి జీవన్మరణ సమస్య.

మనమేమో, అన్నా మీరు, మీ వాళ్ళు, మీ కుటుంబం ఇష్టం వచ్చిన విధంగా ఎంతైనా దోచుకోండి దాచుకోండి. పదేలు మా మొఖాన కొడితే, మత్తులో బిర్యానీ తింటూ సీరియల్ చూస్తూ, మా బిడ్డలు చదువు కు, వైద్యం కు లక్షలు ఖర్చు పెడుతూ నిరుద్యోగులుగా ఉంచినా పర్లేదు అంటాము.

వాళ్ళిద్దరి సమస్యలు మన నెత్తిన వేసుకొని , వాళ్ళకు బానిస లు గా, మీకే జై, మీ నాన్న కు జై, మీ మనవడి కే జై, అందామా , కొత్త మార్పు కోరదామా?

మన కుటుంబం, మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతిలో ఉంది? నిర్ణయం మనదే


Dt : 09-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : Politics, Views : 77 ( id : 84 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal , special status , modi , rahul , sonia
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments