APLatestNews.com top Banner
         
అభివృద్ధి అంటే ఇదేనా? 2070 లో నాయక మనవడి పాలనలో అయినా సాధ్యమేనా? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
కొంత మంది మిత్రులు జవాబు పెట్టారు. నిన్న వేరే ఆర్టికల్/వ్యాసం లో చెప్పిన జనానికి అవసరమైన 6 పాయింట్లు, ప్రతి మండలం లో పెట్టాలి అని, రామన్న , రాజన్న లు ఎప్పుడో అనుకున్నారు అంట.

అన్ని మనమే చేస్తే , మా మనవళ్ల కు పని ఉండొద్దు అని అభిమానులు బతిమిలాడి తే కాదనలేక గమ్ముగా ఉన్నారంట. తప్పకుండా ఆ పనులు, బాబు లేదా గగన్ మనవడు కానీ వీలును బట్టి చేస్తారు అంట.

అప్పటిదాక పిచ్చి అభిమానులు, మా పాణాలు పోయినా పర్లేదు ఎదురు చూస్తాము అన్నారు అంట. 3 , 4 , 5 కుటుంబాలు మాత్రం రాకూడదు అంట అధికారంలోకి. ఎంత ముందు చూపుతో ఉన్నాము మనం.

ఈ ఉదాహరణలు చూడండి, నాన్న గారి కాలం నుంచి 30 ఏళ్లుగా వింటున్నా :

1. అత్యవసర వైద్యం అయితే గుంటూరు లేదా మద్రాసు తీసుకుని వెళ్ళండి అని.

ఎందరో బంధువులు, స్నేహితులు, మేనల్లుడి ప్రాణాలు కూడా పోయాయి అక్కడ కు వెళ్ళేలోపు. డబ్బు కూడా కాపాడలేదు. మన ఊరు లో, మన అందరి ప్రాణాలు విలువ అంతే నా?

మరి ఎప్పుడు గుంటూరు మద్రాసు అనే మాట లేకుండా, అరగంట దూరం లో వైద్యం ఉంటుంది?

2. మంచి నాణ్యమైన చదువు కు అయితే గుంటూరు లేదా వైజాగ్ లేదా హైదరాబాద్ లో మంచి స్కూలుకు కాలేజీ కి వెళ్ళండి అని.

ఎందరో బంధువులు, స్నేహితులు, తమ బిడ్డలకు కన్న ప్రేమను దూరం చేసి బంధాలు బాధ్యత లేని భవిష్యత్తు ను ఇస్తున్నారు జైలు జీవితం లో. అది పిల్లల కు , పేరెంట్స్ కు ఇద్దరు కూ ఉపయోగం లేదు. చాలా మంది పేరెంట్స్ వాపోతున్నారు, ఇప్పుడు పిల్లల అలవాట్లు, మానసిక స్తితి చూసి.

మరి ఎప్పుడు గుంటూరు వైజాగ్ హైదరాబాద్ అనే మాట లేకుండా, అరగంట దూరం లో మంచి నాణ్యమైన స్కూల్, గీతం లాంటి కాలేజి వస్తుంది? మరి డబ్బు లేని బిడ్డలు చదువు సంగతి ఆ స్కూల్ లో?

అభివృద్ధి అంటే ఇదేనా?

2070 సంవత్సరం లో మన నాయక మనవడి పాలనలో? మనందరికీ ఇష్టం మే గదా.

ఐతే వేసేయ్ ఓటు? జై జై మా నాయక మనవడా! జై.

Dt : 08-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : Politics, Views : 85 ( id : 81 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments