APLatestNews.com top Banner
         
ఆంధ్రా ఎన్నికల తాజా పరిస్తితి - మంచి గట్టి పోటీ అందరికీ - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
చాలా మంది తో మాట్లాడుతూ ఉంటే , కొంత సమాచారం తెలుస్తోంది. వికార నామ సంవత్సరం, శని దేవుడు రాజు, అందరు చాలా కష్టపడాలి. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు.

పాపం, బాబు గారి పరిస్థితి కష్టం గా ఉంది. రామన్న శాప ఫలితం ఉంటుంది ఏమో. జూ ఎన్టీఆర్ మాత్రమే కాపాడాలి. కానీ అద్భుతం జరిగితే తప్ప, చాలా కష్టం అని అంటున్నారు. బాబు గారూ కూడా బాధ పడుతున్నారు, సొంత వాళ్లు మోసం చేస్తున్నారు, ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నారు అని. IAS IPS లను మార్చడం కూడా సైకిల్ కు దెబ్బ.

మార్పు కావాలి అంటున్నారు. మరి ఎంత మార్పు అన్న దగ్గర, క్లారిటీ మిస్ అవుతున్నారు కొందరు.

ఫాన్ వారి పాలన తండ్రి పేరుతోనే జరుగుతుంది. అంటే ముప్పాతిక పాలన అలాగే ఉంటుంది, కాబట్టి పాతదే. తండ్రి నవ్వు మాట మర్యాద బిడ్డకు రాలేదు. అన్న కన్నా అక్క బాగా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. కేసులు తేలిందాకా, అక్క ఉంటే బాగుండేది అంటున్నారు. కారణం ఏదైనా కేసియార్ తో కలవడం చాలా మందికి నచ్చడంలేదు.

బాబూ మరియు జగన్ వరాలు చూస్తుంటే, వారిద్దరు ఎంత ఆరాటపడుతున్నారో ఎలాగైనా గెలవాలని. చావో రేవో లాగ ఉంది. ఆదాయం ఎలా వస్తుందో చెప్పకుండా, ఈ విధంగా చెయ్యడం తప్పు అని భావిస్తున్నారు.

పవన్ ఓట్లు ఎవరికి దెబ్బ కొడతాయి అన్నది కూడా వేడి పుట్టిస్తుంది, అయోమయంలో పడవేస్తుంది. కనపడకుండా పాల్ దెబ్బ ఉంటుందేమో.

పూర్తిగా మార్పు రావాలి అంటే గ్లాసు తో నే అంటున్నారు యువ రక్తం, మరి ఇందులో ఓటు ఉన్నవాళ్ళు ఎందరో తెలియడం లేదు. ఎందుకంటే ఆ రెండు కుటుంబాలు మారితేనే, నిజమైన మార్పు అని కొందరు.

పై ఇద్దరూ నామినేషన్ లో కోట్ల ఆస్తులు చూపిస్తున్నారు. కానీ తమ్ముడు 30 కోట్ల అప్పు, పాపం, అంటున్నారు బహుజనులు బలహీన వర్గాలు.

హంగ్ వస్తే బాగుంటుంది ప్రాక్టీసు కి అని కొందరు అంటున్నారు. అంటే కాంబినేషన్, చచ్చినట్టుగా రెండో మనిషి తో కలవాలి. నేల మీద నడవాలి, అహంకారము తగ్గించుకోని.

ఉచిత పధకాల పేర ఇష్టం వచ్చినట్లు కోట్లు అప్పు చేస్తే , ఎవరు తీర్చాలి , మన బిడ్డలా అని కొందరి బాధ. శ్రీలంక , అప్పు కట్టలేము అంటే , చైనా ఎయిర్ పోర్టు ని స్వాధీనం చేసుకుంటానంటుంది. రేపు మన పరిస్థితి అదే, ప్రపంచ బాంక్ అప్పు తీర్చకపోతే అని కొందరు.

ఇడుపుల పాయను అమ్మి లేదా, హెరిటేజ్ ని అమ్మి, జనం కోసం పధకాలు పెడితే గొప్ప. అలా కాకుండా, స్థలాలు అమ్మి, టాక్స్ ల డబ్బుతో, లేదా అప్పుతో చేస్తే ఎలా అని బాధపడుతున్నారు.

రాజన్న సెజ్ ల తో భూపందేరం చేస్తే, చంద్రన్న అమరావతి లో తన వారికి భూపందేరం చేసారు. అందరూ ఒకటే అని భావిస్తున్నారు.

సర్వే లు అన్నీ మాయాజాలం. తెలంగాణ ఎన్నికల్లో, మన 2014 ఫలితాలు లో అంతా అబద్దాలే, జాగ్రత్త గా ఉండాలి.


Dt : 05-Apr-2019, Upd Dt : 11-Apr-2019 , Category : Politics, Views : 168 ( id : 78 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments