APLatestNews.com top Banner
         
నేటి ఉత్తమ ఇల్లాలు అత్యుత్తమ భర్త ల చిలక పలుకులు - 2 - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
సుమ, గోపి దంపతులు. ఇద్దరికీ మాట కుదురుతుంది, మంచి చెడు రెంటిలో. గోపీ కి పని పాట లేదు, పెళ్ళం సంపాదన, అత్త వైపు ఆస్తి. ఎక్కడ ఎలా ఏది దొరుకుందో అని వెతుకులాట. డబ్బు ఆస్తికోసం భర్త చూపులు, పుట్టింటి వారు ఇంకా ఏదో పెట్టాలి అని భార్య ఎదురు చూపులు.

సుమ తండ్రికి జబ్బు చేస్తే, కనీసం మద్రాస్ కి కూడా తోడు వెళ్ళ లేదు. ఒక సారి మాత్రం, అందరితో షికార్ కి వచ్చి వెళ్ళారు. అదేమి అల్లుడు ఖాళీగా ఉండి, బయట వారు ఎందుకు వెళ్ళాలి అంటే, మా ఆయనకు ఏమి తెలీదులే, నాన్న కు తోడు వెళ్ళె వాళ్ళు ఉన్నారు గదా అని వత్తాసు.

గోపి, అంతో ఇంతో నొక్కెయ్యందే, ఏ పని ఉరికే చెయ్యడు. డబ్బు దగ్గర, తన మన ఉండదు, నాకేంటి, మాత్రమే ముఖ్యం. ఉదాహరణకు, కరెంట్ బిల్ 350 కట్టు అని 400 ఇస్తే, ఇంక వెనక్కి రాదు మిగతా. దర్జాగ పెట్రోలు ఊరక రాదు గదా అంటారు నవ్వుతూ. అంత చిల్లరకే ఆశ పడితే, పెద్ద వాటికోసం ఎంత ఆశ ఉంటుందో కదా. అలా ఎంత నొక్కి ఉంటాడో లెక్కేస్తే, మనం సిగ్గు పడాలి, వాళ్ళు నవ్వుకుంటారు.

తండ్రి చివరి రోజుల్లో, తలకొరివి ఎవరు పెడతారు కొడుకు వీసా లేక రాలేకపోతే అని అడిగితే, సుమ నిర్మొహమాటముగా చెప్పింది, అంతో ఇంతో డబ్బు (లక్ష దాకా, 2005 దగ్గరలో) ఇస్తే మా ఆయన పెడతాడులే అని. అంత మంచి మనసులు వారివి, పుట్టింటి డబ్బు దగ్గర సహాయక గుణం లో.

భర్త బలాదూర్ తిరుగుతూ ఉంటే ఆపని ఈపని అని అబద్దాలు చెప్పి, ముసలి తల్లిని (తండ్రికి దూరం చేసి) దగ్గర పెట్టుకొని, పని మనిషిలాగా బాగా వాడుకుంది తను ఉన్న ఉద్యోగ ఊళ్ళ దగ్గర. పెళ్ళికి ముందు కూడా అంతే. పైకి మా అమ్మను నేనే చూస్తున్నాను అని మాయ మాటలు చెప్పేది, అడిగిన జనానికి..

తండ్రి గతించినాక, తల్లి హైదరాబాద్ స్టాంపింగ్ తోడుకోసం పాస్ పోర్ట్ తెచ్చుకోమంటే, 2 ఏళ్ళు తాత్సారం చేసింది. తర్వాత నేను వెళ్ళను, నాకు పాస్ పోర్ట్ వద్దు అంది. అప్పుడు అర్దం అయింది, పని మనిషిని వదులుకోలేక అలా, తల్లికి ద్రొహం చేసింది అని, కాలం వెనక్కి నెట్టి. చెల్లెలు కూడా అమ్మకు తోడు వెళ్ళను అంది క్రుతజ్ఞతతో.

చెల్లెలు బూచిని చూపించి, బాబాయిలు ఎవరు లేకుండా స్థలాన్ని లాక్కున్నారు. టీచర్ వ్రుత్తి చేస్తున్నా, దొంగ చాటుగా బాబాయి లు లేదా అన్న లేకుండా వద్దు అనలేదు. ఇక భర్త మొదలు పెట్టాడు, రియల్ ఎస్టేట్ లో అమ్మితే, మనకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పాడు. డబ్బుకు కక్కుర్తి పడే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు (భర్తలు) కలసి కట్టు గా అమ్ముకున్నారు బంధాలను, తల్లి బతికి ఉండగా నే. తల్లి ఇచ్చిన చెరో లక్షా దొంగ చాటుగా దాచారు, తల్లికే ద్రోహం చేసారు. వచ్చిన అపార్ట్మెంట్ ల లో ఒకటి అమ్మేసాడు వ్యాపారానికి అని. కొత్త కారు నల్ల కళ్ళజోడుతో జల్సాలు.

సుమ తల్లిని చూడాల్సి వచ్చుద్ది అని ముందే మొదలు పెట్టింది, మాకు ఉద్యోగ బదిలీ అయితే, అటూ ఇటూ తిరగాలి, అమ్మతో కష్టము అని. రక్త పరీక్షకు తీసుకెళ్ళండి ఉన్న ఊళ్ళో అంటే, మేము అక్కడ వదిలి వెళతామేగాని, 2 గంటలు అమ్మతో కూర్చునే ఓపిక లేదు అని చెప్పేసారు. అలాగే వెంట తీసుకెళ్ళి మరలా తీసుకోని వచ్చే టైం లేదు అన్నారు ఇద్దరూ. 8 ఏళ్ళు ఒంటరిగా తల్లి మద్రాస్ లో తిప్పి బాగు చేయించింది గతం, గుర్తుకు రాదు.

2013 లో, తల్లి ఈ స్థలం ఊరు వదిలాలి అంటే బాధపడుతుంది, అక్కడ పలకరించే దిక్కు ఉండరు అన్నా, ఖర్చుకు 10 వేలు నెలకు(చిన్న వూళ్ళో సొంత ఇంట్లో ఖర్చు తక్కువ), అవసరానికి అదనపు ఖర్చులు ఇస్తాము అన్నా కూడా, పని మనిషి చేస్తూ ఉంటుంది కదా, మీరు దగ్గర ఉంచుకోండి అన్న కూడా, ససేమిరా మాకు వద్దు అన్నారు నిర్మొహమాటం లేకుండా, నిర్ధాక్షిణ్యం గా. పైకి నటిస్తూ అందరికీ చెప్పేది, మా నాన్న(మామ) వలనే బాగుపడ్డాము, కానీ ముసలి తల్లి(అత్తకు) సహాయం వద్దు. నాన్న(మామ)కు క్రుతజ్ఞత ఈ విధంగా తీర్చుకున్నారు.

తల్లి, ఊరి చివర చిన్న భూమి ఉంది, కొడుకు పేరు రాస్తాను, రిజిస్టర్ ఆఫీస్ కి తోడు రాండి అంటే, మేము రాము, ఎవరినన్నా తీసుకెళ్ళు అన్నారు. మీకు దురాశ ఉందా స్థలము మీద అంటే, లేదు అని వాళ్ళ మామతో కూడా చెప్పించారు. కాని ఇప్పటికి గోపి చుట్టము, గోపి పేరు చెప్పుకోని, ఆ స్థలాన్ని వాడుకుంటున్నాడు. సుమకు చీమ కుట్టినట్టు లేదు, మనకు రానప్పుడు ఎలా పోతే మనకెందుకు ఎవరికి పోతే మనకెందుకు అని పుట్టింటి మీద తల్లి మీద క్రుతజ్ఞతా భావం. భర్తకు వచ్చే టీ, బిర్యాని ఎందుకు పొనీవ్వాలని ,పుట్టింటి స్థలం మీద, అని కూడా కావొచ్చు.

సుమ అత్తకు కళ్ళ ఆపరేషన్ ధర్మాస్పత్రిలో చేయించారు, అదేమి అంటే వాళ్ళు మేము చేయిస్తా మన్న రాలేదు అని. డబ్బు దగ్గర, ఎవరైన ఒకటే మిగులుతుంది అంటే.

అన్న అందరినీ తీసుకోని భాగ్యనగరం లో 5 స్టార్ హోటల్ లో పెట్టి, డాక్టర్ కు చూపించి, ఊరంతా ఎంతో ఖర్చుపెట్టి తిప్పితే, అన్న ఊరు వెళ్ళెటప్పుడు ఒక్క రోజు సెలవ మాకు కష్టము అని తప్పించుకున్నారు. వాళ్ళ టీచర్ కూడా చెప్పింది, కానీ వినలేదు, అవసరం తీరాక పనియేముంది.

పుట్టింటి వారికి ఏదైనా విషయములో మధవర్తిత్వం చేసినా, ఏదైనా రాత కోతలు జరిగినా, నా బ్రోకరేజ్ రాలేదు అని గొణుగుతాడు. మా ఆయన బ్రోకర్ అయితే, కమిషన్ ఎందుకు ఇవ్వలేదు అని నిర్మొహమాటముగా అడుగుతుంది. కారులో ఉరికి వెళుతున్నా, పెట్రొల్ మీరు కొట్టాలి అని ముందే చెపుతారు. కన్నతల్లిని ఊరు తీసుకెళ్ళినా, చార్జీలు వసూలుకు వెనుకాడరు, పైకి వద్దు అంటారు. అంత దయామయులు, పుట్టింటి డబ్బు దగ్గర.

7 ఏళ్ళ క్రితం మే, అవసరమైతే బయట పిల్లలనే తెచ్చుకుంటాము , చుట్టాల పిల్లలు వద్దు అని అనుకున్నారు, రాబోయే చుట్టాల సమస్యల చిట్టా విని. కాని బుద్ది వక్రీకరిస్తే, అదే మంచిగా కనపడుతుంది.

తల్లిని అడ్డుపెట్టుకొని ఆస్తికోసం ఎన్ని నాటకాలు ఆడారో అందరికీ తెలుసు. అందరు అడిగింది ఒక్కటే, తల్లి మీద ప్రేమ ఉంటే, మీ ఇంట్లో పెట్టుకోక ఇంత డ్రామా లాయర్లతో ఎందుకు నడిపించారు.

మెట్టినింటివాళ్ళు తన డబ్బు చుట్టు ఈగల్లా వాలి తింటూ, దేవతా అని పొగిడితే, కళ్ళు మూసుకుపోయి లేదా సొంత దుర్బుద్దితో, పుట్టింటికి ద్రొహం చేసే కూతుళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు.

2014 తర్వాత, దేవుడా, కన్న తల్లి పీడ వదిలింది, అని ఇద్దరు అక్క చెళ్ళెళ్ళ కుటుంబాలు పూర్తిగా మరచిపొయారు. బతికి ఉందా అని గాని, ఇంత డబ్బు పుట్టింటినుంచి వచ్చింది కదా, అమ్మ వైద్యానికి రూపాయ పెడతాము అని గాని ఎప్పుడూ నటించలేదు. దురాశ లో, డబ్బు దగ్గర, అవసరానికి, 2 కుటుంబాలు(భర్తలు, భార్యలు) ఆప్త మిత్రులు.

చుట్టాల దగ్గర లేదా తమ బుద్దికి సరిపోయిన వారి దగ్గర, మా అన్న చూపించడు అని తమ నటనను పండిస్తారు. మంచి మనుషులైతే, వద్దు అని వదిలించుకున్నాక ఇంకా మీకెమి పని అని ఎదురు అడుగుతారు కదా.

అలాంటి వారి దగ్గర సహాయం పొందిన వారు ఎంత గుణాత్ములో, డబ్బుకు కక్కుర్తి పడేవారో కదా. ఎలాంటివారికి, అలాంటి మనుషులే తోడు అవుతారు, స్నేహితులు, చుట్టాలు అవుతారు. మన చుట్టూ ఇంత కన్న, ఘోరమైన మనుషులు కూడా ఉన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే, అబ్బో ఎన్నో వారి మంచితనానికి గుర్తులు. మన బుద్దే మనల్ని అధోపాతాళానికి నెట్టుద్ది, మనకు లేని క్రుతజ్ఞత మన తరవాతి వాళ్ళకు రాదు.

Dt : 10-Mar-2019, Upd Dt : 10-Apr-2019 , Category : General, Views : 138 ( id : 58 )
Tags : best couple nice talk
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments