Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. బాబా : సరే రా అబ్బాయి, తెలుగు గురువులు వేమన, బ్రహ్మం గారు తెలుసా? వారి పద్యాలు కాలజ్ఞానం విన్నావా?
బాబా అంటూ కన్నీళ్ళతో ఆయన కాళ్ళ మీద పడ్డాను.
బాబా : లే, వదలరా, ప్రతి వాడు వచ్చి, నా పాదాలు పట్టుకోవడం అలవాటుగా మారింది. ఏడుపు ఎందుకు, తప్పు ఏమన్నాను.
దూరంగా ఉండి మనసులో దండము చాలదా, చేతులు కాళ్ళు తల బుగ్గలు తాకుతారు, ఎందుకు రా బాబూ? మీ అమ్మా నాన్న కాళ్ళు, ఎన్నిసార్లు పట్టుకున్నారు రోజుకి? మరి నా దగ్గర ఎందుకు ఈ నటన, మీ బుద్ది నాకు తెలీదా? వయసులో పెద్దవాడ్ని, దూరంగా ఉండి నమస్కరించండి చాలు.
నేను : వేమన, బ్రహ్మం గారి పేర్లు వింటే ఆనందభాష్పాలు స్వామీ. ఏది జరిగినా, వారి మాటలను తలుచుకుంటాము, మేము కొంతమందిమి. తేట తెలుగు లో తేలిక పదాలలో, గీత సారాన్ని, ఎంతో వివరంగా సామాన్యులకు తెలిసేటట్టు చేసారు. అలాగే మంత్రాలయ రాఘవేంద్రస్వామి ని, జగద్గురు ఆదిశంకరాచార్య ని కూడా.
మా వాళ్ళు , ఎప్పుడో మరచిపోయారు, ఈతరం వాళ్ళకి అసలు తెలీదేమో. పొరుగింటి పుల్లకూర రుచి అని, మేము బాగా నమ్ముతాము. కేరళ అయ్యప్పను కూడా వదలము స్వామి, అమెరికాలో కూడా మాల కట్టేస్తాము.
ఇంకోటి స్వామి, చిన్న గా అనండి వారి పేర్లు. మా వాళ్ళు విన్నారంటే, వాళ్ళు ఏ బెంగాలీ అనో లేదా ఏ మరాఠీ అనో, కొత్త వ్యాపారం మంచి గా ఉంటుంది అని, కొత్త గుడులు కట్టేస్తారు వెంటనే ఇండియాలో మరియు అమెరికాలో కూడా.
బాబా : నిజమేరా, మహానుభావులు అంత మంది ఉంటే మీ తెలుగు రాష్ట్రాలలో, ఎక్కడో ఉన్న మరాఠా(మహారాష్ట్ర) రాష్ట్రం లో ఉన్న నా వెంటపడి, నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
ఇంట్లో తల్లిని గౌరవించకుండా, ఎక్కడో ఉన్న పిన్నిని గౌరవిస్తారు ఏమిటి. ఇద్దరు తల్లులూ ఒకటే గదా? గురువులు అంతే కదా?
మీ తెలుగు వాళ్ళు మరీ ఇలా ఉంటే ఎలారా. మరాఠా రాష్ట్రం కన్నా, మీ తెలుగు రాష్ట్రాలలో నా మందిరాలు ఎక్కువ ఉన్నాయి.
మిమ్మల్ని చూసి, నేనొకడిని ఉన్నాను అని తెలుసుకొని, మరాఠా నుంచి ఉత్తర దేశం నుంచి, మిగతా వాళ్ళు వస్తున్నారు, షిర్డి మొత్తము వ్యాపారమయం అయిపొయింది.
నేను : అంతే కాదు స్వామి, మేము మంచి వ్యాపారం దొరికితే ఊరుకోము. అమెరికా , దుబయ్ లలో కూడా మీ గుడులు కట్టేసాము. అమెరికాలో అయితే మరీ ఘోరము, బజార్ లు , సెంటర్ లు, షాపింగ్ మాల్ ల దగ్గర కూడా పెట్టేశాము షాప్ అద్దెకు తీసుకొని. వీలు కాని చోట, మిగత దేవుళ్ళ గుడిలో కూడా మీకు విగ్రహం పెట్టేసాము, ఆదాయం పక్కకు పోకూడదు అని.
ఇండియాలో ప్రభుత్వము, మమ్మల్ని లెక్కలు అడగదు. వచ్చిన దాంట్లో కొంచెం భక్తులకు పంచితే చాలు, వాళ్ళు సంతోషం, అబ్బో ఎన్నో కార్యక్రమాలు, భోజనాలు అని. మిగతా ఏమైంది, మొత్తం ఎంతొచ్చింది అని అడిగే వాడు లేడు. బాబా గుడుల ధర్మకర్తల, ఆదాయం ఆస్తులు, మూడు పువ్వులు ఆరు కాయలు.
మొన్న ఎక్కడో పేపెర్ లో చూసాను స్వామీ, భాగ్యనగరం లో ఎదో బాబా మందిరంలో, ఇద్దరు ధర్మ కర్తలు ,డబ్బు విషయంలో రోడ్ మీద కుస్తీ కి దిగారంటా. నువ్వు ఎక్కువ తింటున్నావు అంటే, గతంలో ఇంతకన్నా నువ్వు ఎక్కువ తినలేదా అని. మా చిన్న ఊర్లో కూడా, నాలుగు దిక్కులా , నాలుగు మందిరాలు వచ్చాయి.
వెంకన్న గుడిని, ఇతర రాష్ట్రాలలో లేదా మన దగ్గర అయినా, తిరుమల తిరుపతి దేవస్థానము,
తమ డబ్బుతో కట్టిస్తుంది. కాని మీ గుడులు మాత్రం, మా తెలుగు వాళ్ళు, జనం డబ్బుతో, ఏ దేశం లో అయినా, కట్టేస్తున్నాము. లాభసాటి వ్యాపారం కాబట్టి, నష్టం మాట లేనేలేదు. మా వేమన, బ్రమ్మం గార్ల గురించి, మా రాయలసీమ నాయకులు కూడా, మరచిపోయారు.
బాబా : తెలుగు గురువులు ఎందరో ఉన్నారు, దేవుళ్ళు తిరుపతి వెంకన్న, బాసర సరస్వతమ్మ, , బెజవాడ దుర్గమ్మ ఇంతమంది ఉన్నా, మీరు ఇంటివాళ్ళని వదిలి నాకు గుర్తింపు తెచ్చారు అంటే, మిమ్మల్ని ఏమి అనాలో తెలియడం లేదు.
నేను : అంతే స్వామీ, కోపము వద్దు. మమ్మల్ని క్షమించాలి. గురువు కన్నా వ్యాపారం ముఖ్యం స్వామి, మా తెలుగు వాళ్ళకు.
స్వామీ, మీరు ఎన్ని తిట్టినా, ఏమి అనుకున్నా సరే, ఇంకో కొత్త ఒరియా బాబా నో లేదా కన్నడ బాబా నో వచ్చిందాక, మిమ్మల్ని వదలము గాక వదలము మేము.
మమ్మల్ని చూసి, మా పిల్లలు కూడా, భర్త లేదా భార్య వచ్చిన తర్వాత, పాత తల్లి దండ్రులతో, పని ఏమి అని వదిలేస్తున్నారు. అయినా, మాకు బుద్ది రాదు.
శ్రద్ధా, భక్తి, జ్ఞానం, ధ్యానం ఉంటే ఏ గురువైనా ఒకటే. అవిలేనప్పుడు, ఏ గురువైనా నిష్ప్రయోజనమే. సద్గురువు దేవుని చేరే మార్గం చూపుతారు, భౌతిక కోరికలు తీర్చరు. మొదటి గురువులైన, తల్లి దండ్రులను గాలికి వదిలేసిన వారిని, ఆధ్యాత్మిక సద్గురువులు క్షమించరు, దగ్గరకు తీయరు.
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,557; 104 తత్వాలు (Tatvaalu) and views 221,604 Dt : 09-Mar-2019, Upd Dt : 10-Apr-2019, Category : Devotional
Views : 3466
( + More Social Media views ), Id : 57 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
baba ,
vemana ,
braham garu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments