APLatestNews.com top Banner
         
బరిలో ముగ్గురు - ఇటు చంద్రన్న అటు జగనన్న మధ్యలో పవన్ - ప్రజా ఓటు ఎవరికో - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఇద్దరూ పోటా పొటీ అన్నిటిలో, అనుభవం లో, అవినీతి ఆరొపణలో, ప్రజలకు మంచి చేయటం లో అంట . మరి ప్రజలను వెర్రి వారిని చేయటం లో కూడానా? ప్రజలు తెలివిగల వారు, వారి మనోభావాన్ని త్వరలోనే తెలియ చేస్తారు.

అవతలి పక్షం గురించి తమ వాదనలు -

చంద్రన్న - తండ్రి పరిపాలనలో నే, కోట్లు దొంగ చాటుగా సంపాదించిన వాళ్ళు, అధికారం లోకి వస్తే, ఇంకెంత దోచుకుంటారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే జైలు నాయకుడు, మనకు కావాలా? రౌడి రాజ్యం కావాలా? తెలంగాణా నాయకులతో అంటకాగుతూ, ఆంధ్రా కి నష్టం చేసే వాళ్ళు గెలవాలా? ఎన్నో దొచుకోని, ప్రజలకు బిస్కట్లు వేసారు మీ రాజన్న పాలనలో. . . .

జగనన్న - బాబూ నిన్ను నమ్మము. మామనే వంచించిన వాడివి, జనాన్ని వంచించడానికి వెనుకాడవు. దొంగ వొట్ల తో గెలవడానికి ప్రయత్నిస్తున్నావు. గతం లో, పవన్ పుణ్యమా అని గెలిచావు , తక్కువ తేడాతో. నీ కొడుకు క్షేమం కోసం కష్టపడుతున్నావు గాని, ప్రజల కోసం కాదు. ఎన్నో సార్లు కోర్టు ల నుంచి స్టేలు తెచ్చుకోని బయటపడ్డావు, నీది ఒక నీతేనా? మీరు ఎన్నో, మీ వాళ్ళకు దోచి, ప్రజలకు బిస్కట్లు వేసారు.

పవనన్న - ప్రజలు కూడా నాతో పాటు గా, పై ఇద్దరి వాదనలు 100 శాతం కరక్టే అనుకుంటున్నారు. అందుకే మనకు ఇద్దరూ వద్దు, స్వార్దపరులు, స్వజనానికి లాభం చేసే వారు . కొత్త వారికి అవకాశం ఇవ్వండి. అనుభవం ఉంది అని, పోయినసారి ఏమీ ఆశించకుండా, బాబు కి మద్దతు ఇస్తే, అందరిని మోసం చేసారు. ఇంక మనము మోసపోకూడదు, యువతకు పట్టం కట్టండి, నేను యువతకు పెద్ద పీట వేస్తున్నాను.

పాలన్న - పవన్ లాగనే, నాకు అవకాశం ఇస్తే, అందరికన్న మిన్నగా చేస్తాను. బాబూ జగన్ ని నమ్మొద్దు. పవన్ మంచివాడు నిజాయితీపరుడు, ఆయన నాతో కలసిరావాలి అంటారు. పాల్ ఓట్లతో, జగన్ కి నష్టము అని, బాబు హస్తం ఉంది అని కొందరి అభిప్రాయం.

అన్న చిరు లాగే పార్టీని అమ్ముతారు అని కొందరి వాదన. మా అన్నని మోసం చేసారు, నేను అలా మోసపోను అంటున్నారు పవన్. అందుకే 75 శాతం కొత్త వారికి చోటు ఇస్తున్నాను. అవినీతి పరులు లేదా గంటా లాంటి వారికి చోటు లేదు. స్వార్దం లేకుండా యువతకు అండగా ఉంటాను అని చెపుతున్నారు.

3 వ మనిషికి ఇప్పుడు అవకాసం వస్తేనే, మిగతా కులాలకు/మనుషులకు అవకాశం వస్తుంది కదా భవిష్యత్ లో, అని జనము అనుకుంటున్నారు.

ఎవరికి వారే మేము గెలుస్తాము అని చెప్పుకుంటున్నారు. రేపు గెలవకపోతే, జగన్ తనను చావు దెబ్బ కొడతాడు అని బాబు భయం. ఇప్పుడు కూడా గెలవకపోతే, ఇంక అసలు గెలవనని జగన్ భయం. పవన్ దెబ్బ ఎవరిమీద పడుతుందో అని ఇద్దరికీ భయం.

ఎందుకంటే, పవన్ పూర్తిగా అధికారం లోకి వస్తారు అని జనసైనికులు అంటున్నారు. కొత్తగా ఓటు వేసే యువత పవన్ వైపు ఉన్నారు అని కొందరు అంటున్నారు. కాని ఎక్కువ సీట్లు గెలిచినా బాబు జగన్ లకు నష్టం. అంతే కాకుండా, పవన్ కి ఎక్కువ సీట్లు రాకపొయినా కూడా, ఓటింగ్ శాతం తగ్గితే బాబు లేదా జగన్ అభ్యర్దులు ఓడటం ఖాయం.

పవన్ ని ఎలాగైనా, తమకు మద్దతుగా వాడుకోవాలి అని ఇద్దరు ప్రయత్నిచారు. కాని కుదర లేదు. ప్రజల మనసులో మాట తెలీదు 1. ఎవరికైనా స్పష్టమైన మెజారిటీ ఇస్తారా? 2. బాబు, జగన్ తల రాతలు మారుస్తారా? 3. పవన్ ని కింగ్ మేకర్ ని చేసి, ప్రభుత్వాన్ని పవన్ అండ తో నడిపిస్తారో చూడాలి.

ఇక ఏపీలో కులాల అధిపత్యం సంగతి తెలిసిందే. ఏపీలో ఆర్ధికము గా బలమైన కులాలు ఉన్నాయి అధికారంలో. కాని సంఖ్యాపరం గా కాపులు అతి ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏపీలో దాదాపు 15 నుంచి 20 శాతం ఉన్న కాపులు ఏ పార్టీకి అండగా ఉంటే ఆ పార్టీదే అధికారం అన్నది నిజం. గత ఎన్నికల్లో కాపుల మద్దతు లేకనే, వైసీపీ ఓడిపోయింది. టీడీపీ, గోదావరి జిల్లాలో ఘన విజయం సాధించింది. కాపులను బీసీల్లో చేర్పిస్తామని చెప్పి, కాలం వ్రుధాచేసి, పిల్లి మొగ్గలు ఎన్నో టీడీపీ వేసింది.

కాపులు టీడీపీ మీద విముఖంగా ఉన్నారు అన్నట్లుగా ఉంది. మరో వైపు, పవన్ కళ్యాణ్ జనసేన కూడా బరిలో ఉండడంతో, కాపుల అండ ఎవరికన్నది తెలియదు. కొంత మంది అవకాశవాదులు జగన్ వైపు వెళుతున్నా కూడా, పూర్తిగా కాపులు జగన్ ను సమర్దిస్తారా అన్నది తెలీదు.

కాపులకు దొరికిన కొత్త నాయకుడికి(పవన్), కావలసిన బలాన్ని అందించి, తమ నేత గా మరియు కింగ్ మేకర్ గా నిలబెడతారా అన్నది తెలియాలి.

కర్ణాటకలో అదే జరిగింది, పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది.

Dt : 08-Mar-2019, Upd Dt : 10-Apr-2019 , Category : Politics, Views : 180 ( id : 56 )
Tags : andhra election , jagan , pavan , chandra babu , paul
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments