APLatestNews.com top Banner
         
బయటకు చెప్పుకోలేక , లోలోనే కుమిలి, మానసికంగా దెబ్బ తిన్న వారు ఎందరో - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
కష్ట సుఖాలు, నష్టాలు, నమ్మకమైన బాధ్యత గల, ఆడంబరాలు ఆర్భాటాలు లేని, ఆప్త మిత్రులు తో పంచుకోవాలి. కొన్ని సార్లు వారి సలహాలు ఉపయోగం, దానిని అర్దం చేసుకోనే బుద్ది మనకు ఉండాలి. టైం కి సరైన సలహా లేక, జీవితాలను నష్టపోయిన, ప్రాణాలు కోల్పోయిన, వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న విషయాలకే, భవిష్యత్తు కానరాక, ఎలా ఎదుర్కోవాలో తెలీక.

చెడుబుద్ది కలిగిన మిత్రులకు చెపితే, మనల్నే ఇంకా దిగజార్చి ఆడుకుంటారు. జాగ్రత్త సుమా!

బయటకు చెప్పుకోలేక , లోలోనే కుమిలి, మానసికంగా దెబ్బ తిన్న వారు, ఎందరో. దానికి లక్షలు ఖర్చు చేసినా నిరుపయోగం. బాధను బయటకు చెప్పి, వదిలేయాలి, లేకపోతే అది మనల్ని తినేస్తుంది. బయటకు చెప్పుకుంటే సగం బాధ తీరుతుంది, ఎదుటి వారు ఏమి చెయ్యకపొయినా.

మానసిక జబ్బుకు మందు మంచిమాటలే. అన్ని లోపల దాచుకోని వ్యధ పడుతూ ఆ స్తితికి రాకూడదు.

ఇంకొంతమంది ఇప్పుడు తమకున్న గొప్ప పరిస్తితులు శాశ్వతమనుకొని, కన్ను మిన్ను గానక, ఎవరిని లెక్క చేయక, తమ రాబోయే రోజుల్లో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. నేను ఎవరి మాట వినను, నాకు ఎవరంటే భయము లేదు అనేవారి భవిష్యత్ అగమ్యగోచరము.

ఇంకొంతమంది తమకు ముందు చూపు లేదు అని కూడా తెలుసు, మాట నిలకడ ఉండదు అనీ తెలుసు, అజ్ఞాన మొహం లో ఉన్నామనీ తెలుసు. కాని మూర్ఖముగా తమను, తమ కుటుంబాన్ని, తమను నమ్ముకున్నవారిని , భవిష్యత్ కష్టాలలోకి నెట్టివేస్తున్నారు.

మనం ఆప్త మిత్రులతో, సంవత్సరం గమ్ముగా ఉండి, తర్వాత చిన్న సహయం కూడా అడగలేము. ఎందుకు అంటే వారికి, మన మీద నమ్మకం ఉండదు. తర్వాత రూపాయ కూడా సహాయం చేయలేదు అనుకున్నా, ప్రయోజనం లేదు. తప్పు మనదే. ముందు చూపు తో ఉండాలి. మంచి సలహాలు, భవిష్యత్తు లో లక్షల నష్టం ని నివారిస్తాయి. దీనినే కౌన్సిలింగ్(బోధన/యోచన) అంటారు, వేలలో ఫీజ్ వసూలు చేస్తున్నారు పెద్ద నగరాలలో.

ఈరోజుల్లో సంవత్సరాలు తెలిసిన వాళ్ళ ను కూడా నమ్మలేకపొతున్నాం. ప్రతి వ్యక్తిలో లేదా సొంత కుటుంబం లోనే స్వార్థం రాజ్యమేలుతున్నది. ఎప్పుడు ఎవరి బుద్ది ఎలా మారుతుందో తెలీదు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. దాంకున్నా , చాటుగా ఉన్నా, గమ్ముగా ఉన్నా, మనకెందుకు అనుకున్నా , తర్వాత నష్టపోయేదెవరు? మనమే.

మనకు ఆత్మ ధైర్యం ఉంటే, మనము అరిషడ్వర్గాలను జయిస్తే, ఎవరికీ చెప్పల్సిన పనిలేదు. యోగా, ధ్యానం తో దానిని అధిగమించగలము.

Dt : 06-Mar-2019, Upd Dt : 12-Apr-2019 , Category : General, Views : 173 ( id : 55 )
Tags : best friends , happy , difficulties , bad situations , share with friend , depression
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments