APLatestNews.com top Banner
         
శివతత్వం లోక కళ్యాణం - మన మంచి కోరే, మనకు మంచి నేర్పే శివ చిద్విలాసం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
పంచాక్షరీ మంత్రం, ఓం నమశ్శివాయా! ఓం నమశ్శివాయా! ఓం నమశ్శివాయా! శంభో హర హర మహదేవా శివ శంభో శంకర మహా దేవా అంటూ వారణాసి(కాశీ), శ్రీశైలం, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, అమరావతి లాంటి అన్ని శైవ పుణ్య క్షేత్రలు మరియు అన్ని శివాలయాలు భరతభూమి అంతా మారు మ్రోగుతాయి మహ శివరాత్రి పుణ్యదినాన.

జన్మ కో శివరాత్రి అంటారు, కనీసం ఒక్కసారి అయినా, ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి, రాత్రి జాగారణ చేస్తారు. ఆరోగ్యాన్ని బట్టి, పాలు, నిమ్మరసం, పండ్లు తీసుకోవచ్చు. ఉపవాసం అంటే శివునికి దగ్గరగా ఉండటం, నామ, జప, ధ్యానాదులతో.

రాత్రి జాగరణా అంతే. ఈ రోజు ఈశ్వరుని పుట్టిన రోజు. అరిషడ్ వర్గాల మాయలో పడి, పతనం చెందకుండా, మెలుకువతో ఉండి, దైవ ధ్యానం తో, ఈశ్వర సహాయాన్ని అర్ధించాలి.

పరమేశ్వరుడు, భోళా శంకరుడు, లయకారుడు, ఓం కార స్వరూపుడు. శ్రీ మహా విష్ణువు కన్నా, తొందరగా భక్తులకు దర్శనమిచ్చి, ఎటువంటి వరాన్ని అయినా, కాదనకుండా వెంటనే ఇచ్చేవాడు. ఆయన సద్గుణాలు కొన్ని తలచుకుందాము ఈ పుణ్యదినాన :

1. అంతటి దేవుడు కూడా, నిరాకార స్వరూపుడుగా లింగ రూపములో అవతరించారు. మనము ఎంత గొప్ప వారిమైనా, ఒదిగి ఉండాలి.

2. నిర్లిప్తంగా, నిగర్విగా ఉంటారు ఎప్పుడూ యోగ ముద్ర ధ్యానం లో, బయట ప్రపంచంలోని విషయ వాసనలను పట్టించుకోకుండా, నీటిలో తామరాకు లాగ.

3. అంతటి మహా దేవుడు కూడా, ఎటువంటి భవనాలు అలంకారము లు పట్టు వస్త్రాలు లేకుండా, ఒక సామాన్య దిగంబరిగా, శ్మశానంలో భస్మం ధరించి ఉంటారు. భక్తుల జీవిత చివరి మజలీలో కూడా, మీకు తోడు నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ.

4. మహ గంగ వేగానికి భూమి, కొండలు, ఊళ్ళు కొట్టుకొని పోకుండా, తన జుట్టులో బంధించి, జనులకు నష్టము లేకుండా కావాల్సినంత మాత్రమే భూమిపైకి వదిలిన జన సమ్రక్షకుడు.

5. సమస్త ప్రాణికోటిని గౌరవించడము కోసము, నాగుల్ని ఆభరణాలుగా, నందిని వాహనముగా చేస్తుకున్న జీవ కారుణ్యుడు.

6. క్రోధము వస్తే, తప్పు చేసిన రాక్షసులను లేదా తనవారినైనా, శిక్షించడానికి లేదా హరించడానికి, మూడవ కన్ను తెరవడానికి లేదా శూలాయుధాన్ని ఉపయోగించడానికి కూడా వెనుకాడలేదు.

7. తన కుమారుల విషయములో కూడా రాగద్వేషాలు లేని మంచి బాధ్యత గల తండ్రి. దేవగణ అధ్యక్ష పదవి కోసం, కుమారుల ఆధిపత్య పరీక్షలో, కుమారస్వామిని ప్రపంచమంతా కష్టపడి తిరిగి వచ్చేందుకు పంపారే గాని, ఆపలేదు. అలాగే వినాయకుడు ప్రాధేయపడి నమస్కరించిన దాకా, ఉపాయం చెప్పలేదు. వాళ్ళ కర్తవ్యము వారికి గుర్తు చేసి, తెలివి తెచ్చుకునేటట్ట్లు చేసారు పక్షపాతం లేకుండా జ్ఞాన వ్రుద్ది కోసం. పదవుల్ని ఉరికే ఇవ్వలేదు అర్హత లేకుండా.

8. ఆయన అభిషేక ప్రియుడు. ఆయన పూజ చాలా తేలిక, ఆకులతో మనస్పూర్తిగా పూజించి, చెంబుడు నీళ్ళతో, శివలింగాన్ని తడిపినా ఆయన పొంగి వరాలిస్తాడు. భక్త సులభుడు. పండితులు దేవాలయములలో, ఆయనకు నమక చమకాలతో రుద్ర అభిషేకం చేస్తారు.

9. సాగరాన్ని మధించినపుడు, హాలాహలం పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే, దానిని తానే మింగి, కంఠము లో బంధించి, నీలకంఠుడు గా కీర్తి గడించారు. కష్టములో జనులకు అండగా ఉండే నాయకుడు.

ఇంకా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే, ఎన్నో విషయాలు, మరెన్నో తత్వాలు, మంచి విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని అయినా ఆచరించి, నిజమైన శివ భక్తులు గా ఉండాలి మనము. నిరంతరము శివ నామ స్మరణ చేస్తే ఆయన ఎల్లవేళలా మన వెంట ఉండి, మనలను కాపాడతారు.

మిధునం చలన చిత్రం లో తనికెళ్ళ గారు, శివ గీతిక లో, మామూలు పదాలలో, వేదాంతం ఎంత బాగా చెప్పారో ఆస్వాదించండి :

ఆట కదరా శివ, ఆట కద కేశవ.. ఆట కదరా నీకు అమ్మ తోడూ
ఆట కద జననాలు, ఆట కద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు...
ఆట కద సొంతాలు, ఆట కద పంతాలు.. ఆట కద అంతాలు ఆట నీకు...
ఆట కదరా నలుపు, ఆట కదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు..
ఆట కద ఓడటం , ఆట కద గెలవటం, గెలుపు ఓటములే పెద్ద ఆట నీకు
ఆట కదరా మన్ను ఆట కదరా మిన్ను.. మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను...


శివతత్వం  లోక కళ్యాణం -  మన మంచి కోరే, మనకు మంచి నేర్పే శివ చిద్విలాసం - Pic 2





Dt : 03-Mar-2019, Upd Dt : 11-Apr-2019 , Category : Devotional, Views : 168 ( id : 54 )
Tags : maha shivaratri , lord shiva , jagaran
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments