APLatestNews.com top Banner
         
శాస్త్రాలు, పంచాంగం, జాతకాలు పై నమ్మకం లేదా లేక అది చెప్పేవాళ్ళను నమ్మలేమా? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఈ పంచాంగం జాతకాల పిచ్చి యూరప్ , అమెరికాలలో కూడా ఉంది. జాతకాలు, సుర్యుని మీద లేదా చంద్రుని మీద ఆధారపడి చెపుతారు. ఇండియాలో, ఈ రెండు పద్దతులు ఉన్నాయి. పాశ్చత్య దేశాలలో, సూర్య పద్దతి ఉంది. సూర్య పద్దతి లో, పుట్టిన డేట్ ను బట్టి రాశి చూసుకొవాలి. చాంద్రమానం లో, మన పేరును బట్టి చూసుకోవాలి.

ఒక వైద్యుడు సరిగ్గ వైద్యం చెయ్యలేదని, వైద్య శాస్త్రాన్ని అవమానిస్తామా? లేక అతను సరిగ్గా చదవలేదు అనో, అనుభవము లేదు అనో, బాధ్యత లేదు అనో అనుకుంటాం కదా? ఈ రోజులలో నిష్టగా ఉండి, శాస్త్రన్ని అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారా? అలాగ అని, అందులో ఉన్నవి చూసి భయపడకూడదు, ఎందుకంటే, మనకు దైవ బలం ఉంటే, కొన్ని సార్లు అవి అన్ని పక్కకు చిన్న దెబ్బలు గా తప్పిపోతాయి.

అలాగని అందరిని నమ్మితే, మూర్ఖముగా గుడ్డిగా వారు చెప్పింది రాసింది నమ్మినా మోసబోయేది మనమే. మన వివేకము కూడా పనిచేయాలి.

ఒక ఉదాహరణ చూడండి :

జనవరి జాతకం లో ఎక్కడో చదివిన గుర్తు, మీరు అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళతారు ఏదైనా ఒక అత్యవసర కారణం తో, అది ఉద్యోగం కావచ్చు లేదా ఊరు కావచ్చు, ట్రిప్ కావచ్చు. ఇంకేదో అని ఉంది.

ఫిబ్రవరి వచ్చింది. హమ్మయ్య అనుకున్నాము. కానీ రాత తప్పలేదు, కొంచం లేటు అంతే. శనయ్య దెబ్బ ఉండాలి, కానీ కింద పడకూడదు దేవుని అండ తో. అదీ దైవ బలం.

ఈరోజు, బుధవారం(ఫిబ్ 27 2019), మధ్యాహ్నం 12 కి మేనేజ్ మెంట్ వారు, అందరూ ఖాళీ చేసి దూరంగా వెళ్ళండి, పరుగెత్తండి అన్నారు. గాస్ లీకైంది అని. చుట్టుపక్కలా పీల్చేగాలి ప్రమాదం, నిప్పు అంటుకుంటే ప్రమాదం, కార్లు కదిలించొద్దు అన్నారు.

అమ్మ ను పట్టుకుని గబగబా లాక్కుని వెళ్ళా దూరంగా. పసి పిల్లల ను పట్టుకుని తల్లులు, మొత్తం 10 ఇళ్ళు జనం, దూరంగా నిలుచున్నాం. ముక్కలు అదిరే వాసన, తల తిరిగినట్లు, వాంతి అయినట్లు. కొంత మంది ఊపిరి ఆడక చనిపోతారు ఆ టైం లో. అమ్మ ఏడుస్తుంది ఆయాసంతో రొప్పుతో వేగంగా నడవలేక. పసిపిల్లల ఏడుపులు, ఇంకో వైపు.

అదే నేను ఆఫీసు లో ఉంటే, నిప్పు అంటుకుంటే, అమ్మను ఎవరు తీసుకెళతారు పక్కకు దూరంగా? దేవుని కి తెలుసు, ఎప్పుడు ఎవర్ని, ఎక్కడ ఉంచాలో ఎలా కాపాడాలో. భారం ఆయనది, నష్టం కష్టం లో, ప్రశాంతము గా, నిర్లిప్తంగా ఉండాలి.

శాస్త్రం జాతకం పంచాంగం మంత్రం కరెక్టేనెమో. కానీ దాన్ని సరిగ్గా వాడే వాడు‌, వినే వాడు‌, చెప్పే నిష్టగల వాడేడి. నటనా స్వార్థ పరులు తప్ప. సరే ఎవరి నమ్మకాలు వారివి.

శాస్త్రాలు, పంచాంగం, జాతకాలు పై నమ్మకం లేదా లేక అది చెప్పేవాళ్ళను నమ్మలేమా? - Pic 2

Dt : 28-Feb-2019, Upd Dt : 10-Apr-2019 , Category : General, Views : 97 ( id : 52 )
Tags : vedam , sastram , jyotisham , gas leak
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments