APLatestNews.com top Banner
         
ఐదు గుణాల స్నేహితులు తోడుగా ఉంటే, జీవితము లో మనకు అపజయము ఉండదు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మనకు ఈ ఐదు గుణాల స్నేహితులు తోడుగా ఉంటే, ముందు చూపుతో రాబోయే మన కష్టాలను తగ్గిస్తారు. జీవితము లో మనకు అపజయము ఉండదు.

1. నవ్వించేవారు - ఎప్పుడూ మనలను మంచి మాటలతో నవ్విస్తూ, మనసు తేలిక చేసి, కష్టాలను మరిచేటట్లు, జీవితం పై ఆశ కలిగించి, ఆనందపరిచే వారు.

2. మార్గదర్శి - జీవిత పాఠాలను నేర్పేవాడు ఉదాహరణలతో తాను ఆచరిస్తూ. ఉదాహరణ - బుద్దుడు, బ్రమ్మం గారు

3. ధైర్యశాలి - జీవిత నిర్ణయాలు ధైర్యము గా తీసుకొనే వాడు అవి ఎంత కష్టతరమైనా, తనకు నష్టమైనా. ఉదాహరణ - హరిశ్చంద్రుడు, కర్ణుడు. కర్ణుడు, కవచకుండలాలు ఇస్తే చనిపొతాను అని తెలుసు. కాని ధైర్యం గా ఇచ్చారు. హరిశ్చంద్రుడు, రాజ్యాన్ని ధారపోసాడు మాటకోసం.

4. ప్రశ్నించేవారు - మనము చేసే తప్పులను, ఎత్తి చూపే వారు, పక్షపాత బుద్ది లేకుండా, మన శ్రేయస్సు అభివ్రుద్ది కోసం. ఈరొజులలో అవసరానికి కలిసి పొగిడే వారే గాని, ఇది తప్పు అని చెప్పరు తెలిసినా కూడా. చెప్పినా, వినే వారూ లేరు.

5. విశ్వాసి - నమ్మకమైన స్నేహితుడు - మనము కష్టాలలో ఉన్నా, రోడ్ మీద ఉన్నా, అన్ని పోగొట్టుకున్నా, మనలను వదలడు, గౌరవం లో తేడా రాదు. ప్రాణం పోయే సమయం లో కూడా, తను నష్టపొతాడే కాని, ఇతరులను నష్ట పరచడు. ఈరొజులలో, మనం బాగుండాలి అని, పక్క వారికి ఎంత ద్రోహం చెయ్యటానికి కూడా వెనుకాడరు. ఇంకొంతమంది తమకు తామే ద్రోహం చేసుకుంటారు.

ముందు మనం ఆలోచన చెయ్యాలసింది, మనకు ఎన్ని లక్షణాలు ఉన్నాయి పైన వాటిలో? ఎందుకు మనకు లేవు? వాటిని నేర్చుకో గలమా, నిలబెట్టుకో గలమా?

పైన 5 లేకుండా, ఏ వ్యక్తి కూడా భగవంతుని చేరలేడు, పూజలు ఫలించవు. పెద్ద కష్టము వస్తే, తట్టుకోలేరు.

సరే మనకు లేవు, అలాంటి వారు, మన చుట్టూ ఎంత మంది ఉన్నారు, మనల్ని జీవితంలో కింద పడకుండా నిలబెట్టటానికి? నిలబెట్టటము అంటే, డబ్బు ఇవ్వటం ఒక్కటే కాదు. మాటలతో చెప్పిన ధైర్యము, ప్రాణాలను నిలబెడుతుంది. బతుకు పై ఆశను పెంచుతుంది. ఎంత మంది చనిపోవటము లేదు, నిరాశ తో, మార్గము గోచరించక లేదా చిన్న చిన్న బలహీనలతో.

డబ్బుతోనే బతుకుతాము అనుకుంటే, డబ్బున్న వారు ఎవరూ చావరు కదా? వారికి కూడా కావలసినది, అవసరానికి మాట సాయమే, మనశ్శాంతి కంటినిండా నిద్ర.

ఈ రొజులలో ఈ 5 గుణాలు ఒక్కరికే ఉండటము చాలా కష్టము. కనీసము అవి ఉన్నవారిని, మనము వదులుకోకూడదు మోహాంధకారములో. ఎందుకంటే, చివరకు నష్టపోయేది మనమే కాబట్టి.

కొంత మంది ధైర్యం అంటే, నలుగురిని తన్నటం, వేరే వారిని ఇబ్బంది పెట్టడం, ఆక్రమించుకోడం, వ్యాపారం లో పెద్ద పెట్టుబడి, ఇతరుల ధనంతో కంపెనీలు, బాగా సంపాదన అనుకుంటారు. అది కాదు, దానితో పాటే, ముళ్ళు కంచె అల్లు కొని, దాని లో నే చిక్కుకుంటారు, సతమత మౌతారు, పతనమౌతారు, అవి చివరకు ఆదుకోలేవు.

Dt : 27-Feb-2019, Upd Dt : 10-Apr-2019 , Category : General, Views : 150 ( id : 51 )
Tags : 5 good Characteristics of a friend
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments