APLatestNews.com top Banner
         
ఓటు విలువ ఎంత ఈరప్పా? మన పిల్లల బంగారు భవిషత్తు అంత కిట్టప్పా! - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
పొద్దుపోక రచ్చబండ దగ్గర కూర్చున్న ఈరప్ప, కిట్టప్ప ఇలా చర్చించుకుంటున్నారు ఓటు గురించి.

ఈరప్ప : కిట్టప్ప, ఎలెచ్చన్ రాబోతుంది. మరలా ఇంటింటికి తిరిగి, పతి పార్టీ వోడు 1000, 2000 చిల్లర ముష్టి వేసి, మన చేతులు పట్టుకొని, ముద్దు ఎట్టుకొని, అబ్బాయి ముడ్డి కడిగి పోతాడు. మరి, దీనివల్ల నష్టమే గదా మనకు, కానీ ఎందుకు ఈ పిచ్చి జనము, కులానికి, మతానికి, 1000 రూపాయల చిల్లరకు తలొగ్గి పిల్లల/మనుమల భవిష్యత్తు పాడుచేస్తున్నారు.

కిట్టప్ప : నిజం చెప్పావు ఈరప్పా. 5 యేళ్ళకు 1000 ఇస్తే, మనకు ఉపయోగము ఏంది? అది జనానికి అర్దము కాదు. అమెరికాలో చదువు, హస్పిటల్ ఉచితము అంటా పేదలకు ఎక్కువ రాష్ట్రాలలో. అద్దాలు లాంటి రోడ్ అంటా. పలుకుబడి రికమండేషన్ లేకుండా అన్ని పనులు చిటికె లో అవుతాయి అంటా లంచం లేకుండా.

ఎవరో ఒకాయన, తల్లిని పెట్టుకోని ఉంటే, వ్యవస్థ అండగా ఉంది అంటా. మరి మనకు 100 మంది చుట్టాలు ఉన్నా, ఒకారూ తోడు రారు. 5 ఏళ్ళ క్రితం, ఒక డాలర్ కి ఎంత తిండి, కూరలు వస్తాయో ఇప్పుడు అంతే వస్తాయి అంటా! మరి మన రుపాయి బతుకు ఏమిటి, దానికి బాధ్యులం పౌరులమైన మనము కాదా?

ఉదహరణకు, తక్కువలో అనుకుందాము. మనము ఇక్కడ, సంవత్సరానికి, 3 వ తరగతి కి కనీసము 10 యేలు కట్టాలి. 5 యేళ్ళకు, 50 వేలు కన్నా పెచ్చు అవుతుంది. రోగము వస్తే మనిషికి 10 వేలు ఖర్చు అనుకుందాము. 5 యేళ్ళకు 50 వేలు. మరి ఇంట్లో ముగ్గురు మనుషులు (3) ఉంటే దవాఖానా ఖర్చు 1,50,000. అంతే లచ్చ యాభై వేలు. అంటే మొత్తము 2 లచ్చలు, ఇది తక్కువలో. కొన్ని కుటుంబాలలో దీని ఖర్చు 5 నుంచి 10 లచ్చలు ఉంటుంది.

ఇక తాలూకా ఆఫీసు లో, పొలీసులతో , అధికారులతో, లంచాలు, దండాలు, అవమానాలు తప్పదు. ఆ ఖర్చు కలుపుకుంటే, అబ్బో ఎంతో ఉంటుంది.

ఆరోగ్యశ్రీ లో అన్నీ కవర్ కావు, అయినవాటికి కూడా డాక్టర్ భాధ్యత భయము ఉండవు. ఫీజ్ రీఇంబర్స్మెంట్ లో నాణ్యత భాధ్యత చదువు ఉండదు.

యధా ప్రజా, తధా రాజా. ప్రభుత్వాన్ని నిందించే ప్రతి ఒక్కరు, ముందు తనను తన ఇంట్లో వాళ్ళను ముందు నీతిగ ఉంచుకోవాలి. మన కుటుంబము 5000 కు బానిసలు గా అమ్ముడు పోతే లేని తప్పు, ప్రభుత్వానిది ఎందుకు అవుతుంది.

మొన్న తెలంగాణాలో, ఓడిపోయిన వారు, మరలా వచ్చి, తన్ని మరీ డబ్బులు లాక్కుని పోయారంటా, మీరు ఓటు వేస్తే ఎందుకు మేము ఓడిపొయాము అని.

అదే మనకు, మంచి చదువు, వైద్యము ఉచితముగా వస్తే? 2 నుంచి 10 లచ్చలు మిగులుతుంది. మరి 1000 కి 3000 కి అంత చీప్ గా ఎందుకు అమ్ముడు పోతున్నాము.

అదే మంచి వాడికి , జనము తో ఉండి, జనము కష్టాలు తీర్చే వాడికి, డబ్బు తీసుకోకుండా ఓటు వెస్తే, మనకు మంచి రోజులు వస్తాయి ఏమో కదా?

గెలిచాక వాళ్ళు మనకు దొరకరు. పని చెయ్యమని అడగ లేము. మనకు 1000 ఇచ్చి, వాళ్ళు పార్టీలు మారినందుకు 10 కోట్లు తీసుకుంటున్నారు. ఎలాగు పదవి(ఎమ్మెల్యే, ఎంపి, . . .) కి వచ్చే లంచాలు, నిధులు ఎటూ ఉంటాయి.

ఈరప్ప : అవును కిట్టప్ప, పాత దాసరి గారి చినిమాలో, ఓటు ను కన్న కూతురిలా పోల్చాడు. కూతురిని అల్లుడికి ఇచ్చి పెళ్ళి చేయటానికి , ఎన్ని విధలుగా మంచి అలోచన చేసి ఇస్తామో, అలాగే, ఓటు కూడా మంచి మనసు, వ్యక్తిత్వం ఉన్నవారికి వెయ్యాలి.

అప్పుడే మన జీవితాలు మారతాయి. లేదంటే, ఇలాగే మన జీవితాలు నరకప్రాయమే అని నిట్టుర్పు యిడిచారు.

పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం మండలం, కొప్పర్రు గ్రామంలో సగం ఇళ్ళకు పైనే, ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు, అని రాసి ఉంటుంది అంట. ఈ బొమ్మలో చూడు ఎలా రాసారో?

ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు, ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చారు.
పోరాడి రాజులు అవుతారో, ఓడిపోయి(అమ్ముకుని) బానిసలు అవుతారో, మీ చేతిలో ఉంది.
ఓటు ఆయుధం, దానిని కులం కోసమో, వర్గం కోసమో, డబ్బు కోసమో, వ్రుధా చేయకండి.

ఓటు విలువ ఎంత ఈరప్పా? మన పిల్లల బంగారు భవిషత్తు అంత కిట్టప్పా! - Pic 2

Dt : 12-Feb-2019, Upd Dt : 25-Mar-2019 , Category : General, Views : 200 ( id : 49 )
Tags : vote value , children future , election
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments