APLatestNews.com top Banner
         
అక్కా, మనము ఎదురు డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రకటనలు, ప్రచారం చూడాలా టీవీలో? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఎంకి, చెంచి ఇద్దరు ఒక పల్లెటూళ్ళో పక్క పక్క ఇళ్ళు, కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ కలసి మెలసి ఉంటున్నారు తగువులు లేకుండా.

ఎంకి : అక్కా, ఈ రోజు నుంచి టీవీ కనెచ్చన్ రేట్లు పెరుగుతున్నాయి అంట గదా? 150 అల్లా, అవి ఇవి కలిపి 200 పై దాకా కట్టమని అడుగుతున్నారు. ఎందక్కా ఈ అన్యాయము, సుప్రీంకోర్ట్ ఎదో మంచి చేద్దాము జనానికి అని రూల్ తెస్తే, ఈళ్ళు దానిని, ఈళ్ళకు అనుకూలంగా మార్చి, మన డబ్బులు కొట్టేస్తున్నారు.

చెంచి : అవునే ఎంకి, కోర్ట్ మన మంచికే చెప్పింది, కావాల్సిన చానెల్స్ మాత్రమే ఇచ్చి, ఖర్చు తగ్గించి, ప్రజలకు మంచి చెయ్యండి అని. కాని వీళ్ళు, అవసరము లేని అన్ని చానెళ్ళు కట్ట గట్టి, మన నెత్తిన రుద్దుతున్నారు.

అసలు మన బలహీనతనే వాళ్ళు వ్యాపారం గా మార్చుకుంటున్నారు. పాత రొజుల్లో ఎదో 5 నిమిషాలు ప్రకటన వచ్చేది. ఇప్పుడు అరగంట సీరియల్ లో 15 నిమిషాలు ప్రకటనలే వస్తున్నాయి.

ఎంకి : నిజమేను అక్కా, తల నొప్పి పుడుతుంది. వాళ్ళ ప్రకటనలు వేసినందుకు టీవీ కి డబ్బులు ఇస్తారు. మరి చూసినందుకు, మనకు డబ్బులు ఇవ్వరెందుకు? అలా ఇవ్వకపోతే, మరి ఊరకనన్నా, మనకు చానెల్స్ ఇవ్వాలి. అదీ లేదు, పైగా, ఇంక రేట్ పెంచుతున్నారు.

చెంచి : అవును చెల్లి. మనకు సమయం వ్రుధా, కరెంట్ ఖర్చు, కళ్ళ జోడు తప్ప ఉపయోగము లేదు. ఈ మాయలో పడి కుటుంబాని, పిల్లల్ని మరచిపోతున్నాము. పిల్లల చదువులు అటక ఎక్కుతున్నాయి. వాళ్ళు ఫ్రీ గా చానెల్స్ ఇచ్చినా కూడా మనకే నష్టము, అలాంటిది ఎదురు డబ్బులు ఇచ్చి ఎందుకు మనకు.

ఎంకి : అంతే కాదు అక్కా, ఆ ప్రకటనలు చూసి మనకు ఇంకా ఎక్కువ నష్టము కూడా ఉంది. మొన్న మా పిల్లాడు మన ఊరి స్కూల్ వద్దు అని, ఎదో దూరంగా ఉన్న స్కూల్ లో చేర్చమన్నాడు. డబ్బులు ఖర్చే గాని, ప్రయోజనము లేకుండా పోయింది. మనము వెళ్ళి అడిగినా, వాళ్ళు మనకు జవాబు చెప్పరు. బంగారము ప్రకటన చూసి, మా అయన చేత, అప్పు చేసి మరీ కొనిపించాను. ఆ పాటలు, సినిమాలు చూసి పిల్లలు పాడు అవుతున్నారు.

చెంచి : మరి ఇన్ని రోజులు అలవాటు అయిందానిని మానుకోవాలి అంటే కష్టమే కాని, తప్పదు. అప్పుడు గాని అందరికి తిక్క కుదరదు. అంతగా ఎదన్నా వార్త ఉంటే, ఎవరన్న పంపితే మనకు, ఇంటర్నెట్ వీడియో చూడొచ్చు.

ఇంకొద్ది రోజుల్లో చీ నారోయణో, చీ చెత్తన్నో ఇస్కూల్ ప్రకటనలు వత్తాయి. అంతే గాక ఎలెచ్చన్ కూడా ఉంది, అబ్బో ఇంక చంద్రన్న , జగనన్న, పవనన్న పెచారమే పెచారం, మన చెవుల్లో గుబులు బయటకి వచ్చేదాక. ఆల్రేడీ బాత్ రూం క్లీనింగ్, సబ్బు, షాంప్, కూల్ డ్రింక్ లతో, నగల గుండుతో, వేగ లేక చస్తున్నాము. జాగ్రత్త పడదాం.

ఎంకి : నిజమేనక్కా, మన ఊళ్ళో ఉన్న అందరికి చెపుదాము. కనీసము కొంత మంది అన్నా, ఆలోచన చేస్తారేమో. ముందు మన ఇద్దరము, మొదలు పెడదాము, రేపే కనెచ్చన్ తీసేయమని చెపుదాము, అని నిర్ణయించుకున్నారు.

Dt : 12-Feb-2019, Upd Dt : 11-Apr-2019 , Category : General, Views : 186 ( id : 48 )
Tags : tv cable rates , channel rates
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments