APLatestNews.com top Banner
         
ఒంటరితనం తో కూడిన వ్రుద్ధాప్యం లో ఆత్మ స్థైర్యం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఒంటరితనం చాల కష్టము, అది అందరికీ అర్దము కాదు. మనము పది మందిలో ఉన్నప్పుడు తెలీదు. అలాంటి ఒంటరితనంలో, పెద్ద వయస్సు లో బతకటము ఇంకా చాలా కష్టము. 50 ఏళ్ళ తర్వాత అలాంటి వారిని ఎక్కువ మంది పట్టించుకోరు. అలాంటిది 80 ఏళ్ళ తర్వాత, అసలు అవసరమే ఉండదు పక్క జనాలకు.

కాని కొంత మంది పెద్ద వారు, ఆ పరిస్తితిలో కూడా ధైర్యముగా జీవించ గలరు. అలాంటివారే మన విశ్వం గారు. ఆయన మంచా లేక చెడా మనకు వద్దు. ఆయన ఎలా ఇప్పుడు ఉన్నారో చూద్దాము. ఇది ఎందరికో కనువిప్పు, ధైర్యము కలిగించాలి.

5 ఏళ్ళ క్రితము అనుకుంటా, భార్య మరణము తో, ఏకాకి అయ్యారు. కాని నిరుత్సాహ పడలేదు, బెంబేలు ఎత్తలేదు, మూలన కూర్చో లేదు. 80 దాటింది, సన్నగా, వంగి, కర్ర సాయంతో నడుస్తారు. తన పనులు తనే చేసుకుంటారు. దగ్గరలో ఉన్న కొట్టుకు నడచి వెళతారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు.

నేను అక్కడకు వెళ్ళినప్పుడు అల్లా, వారి దగ్గరకి వెళ్ళి పలకరిస్తా, కనీసము కొంత సమయము కూర్చోని మాట్లాడతా. ఆయనతో మనకి పని లేదు, అవసరమూ లేదు. కానీ, ఒక్కడే ఎలా జీవితాన్ని ఎదుర్కుంటున్నారు అని ఆశ్చర్యము. అలాంటివారిని పలకరిస్తేనే భగవంతుడు మనకు తోడు ఉంటాడు.

2014 లో అనుకుంటా, ఉదయము కొట్టుకు వెళుతూ, వారి ఇంటి దగ్గరకు వెళ్ళా, పలకరిద్దాము అని. గేటు దగ్గర ఉండగానే, మంత్రాలు వినపడుతున్నాయి చిన్నగా. గేటు బయటే మెట్లు మీద కూర్చున్నా, ఆయన పూజ అయినాక మాట్లాడదాము అని. ఆయన స్నానం చేసి మడితో, అటు ఇటు తిరుగుతూ, చిన్నగా దేవుని స్తోత్రం చదువుతూ, పూలు కోస్తూ, నవ్వుతూ లోనకి రమ్మన్నారు. వద్దులే పూజ కానీయండి పర్లేదు, అని అక్కడే కూర్చున్నా.

10 నిముషాలలో పూజ ముగించి వచ్చి, బయట కుర్చి లో కూర్చున్నారు. నాకూ కుర్చి తీసుకు రాబోయారు. వద్దు కింద కుర్చుంటాను అని దగ్గరలో కుర్చున్నా. ఎలా ఉన్నారు, ఆరోగ్యము ఎలా ఉంది, ఒంటరిగా కష్టము లేదా అని అడిగాను. దేవుడి దయవల్ల ఏమీ ఇబ్బంది లేదు, చూస్తున్నావు గదా ఇలా జరుగుతుంది అన్నారు.

అమ్మ ఎలా ఉంది, నీతో ఉంది అని విన్నాను అమెరికాలో, అద్రుష్టవంతురాలు అన్నారు. అమ్మకు కూడా పెద్ద వయస్సు, పర్లేదు, మంచి వైద్యము అందుతుంది అని చెప్పాను.

భోజనము ఎలా అంటే, మా వాళ్ళు తెచ్చి ఇస్తారు. కొన్ని నేనే చేసుకుంటాను అన్నారు. ఒక్కడిగా భయము లేదు, భగవంతుని నామ స్మరణలో అలా రోజులు గడచి పోతున్నాయి అని అన్నారు. రెండు స్తోత్రాలు చదవండి అని కోరాను, ఆయన చదివారు నాకోసం. ఆత్మ జ్ఞానం గురించి కొన్ని విషయాలు చర్చించాము.

చాక్లేట్ లు తెచ్చాను, మీరు తినకూడదు, మీ చుట్టాల పిల్లలకు ఇవ్వండి అని అన్నాను. ఆయన నవ్వుతూ, భలేవాడివిలే, అంత దూరము నుంచి తెస్తే, ఒకటి తింటే ఏమి కాదులే అని నోట్లో వేసుకున్నారు. ఆరొగ్యము జాగ్రత్త, తోడు కూడా ఎవరూ లేరు అన్నాను.

ఆయన చేతి కర్ర చూసాను, చాలా పాతది, అయినా గట్టిది. నేను తెచ్చిన చేతి కర్ర ఇవ్వబోయాను. ఎందుకబ్బాయి, నాది ఉంది కదా అన్నారు. ఇది మూరగా మడిచి సంచిలో పెట్టుకోవచ్చు, అవసరము లేనప్పుడు అన్నాను. బరువు లేదు, తేలిక అని చెప్పాను. శివరాత్రికి, శివయ్య మీకు పంపారు, కాదనకూడదు అని చెప్పి ఇచ్చాను. నవ్వుతూ, తీసుకోని, కాసేపు అటూ ఇటూ తిరిగి, దానిని చిన్న దానిగా మడవటము నేర్చుకున్నారు సంచిలో పెట్టడానికి.

ఆరోగ్యము జాగ్రత్త, ఎప్పుడైనా ఎదన్నా విషయము ఉంటే, మా ఇంట్లో వాళ్ళకి చెప్పండి అన్నాను. అలా ప్రతి సంవత్సరము వెళ్ళి పలకరిస్తాను. ఈ మధ్యలో ఏదో ఆరోగ్యము బాగోలేదని విన్నాను. దేవుని దయవల్ల, తనకు ఎటువంటి కష్టము కలగ కూడదు అని ప్రార్దించాను.

అప్పుడప్పుడూ అనిపిస్తుంది, మనము ఆ వయస్సులో అలా తిరిగి మన పనులు చేసుకో గలమా అని, అంత ధైర్యం ఉంటుందా అని. రాబోయే రోజులు ఇంకా కష్టతరమైనవి. ముందుంది ముస్సళ్ళ పండగ, జాగ్రత్త గా ఉండాలి, తప్పులు తగ్గించుకొని, పుణ్యము పెంచుకోవాలి.

Dt : 11-Feb-2019, Upd Dt : 10-Apr-2019 , Category : General, Views : 248 ( id : 47 )
Tags : old age , single , strength , confidence
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content