APLatestNews.com top Banner
         
మిగతా కులాలకో లేదా కుటుంబాలకో ముక్కమంత్రి పదవి వస్తుందా ఎప్పటికైనా, వీరప్పా - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
గ్రామం నడిబొడ్డున, రచ్చబండ మీద కుర్చోని, వీరప్పా, ఎర్రప్పా రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. కేంద్రము లో, టీ అమ్ముకునే ఆయన, పెదాన మంత్రి అయ్యాడు. ఒమెరికాలో, రాజకీయం తెలియని, ట్రంపయ్య, చెడుగుడు ఆడుతున్నాడు, కొమ్ములు తిరిగిన నాయకులను సైతం. మన తెలంగాణా చంద్రం రఫ్ ఆడించాడు, పాతుకుపొయిన కులపోళ్ళను / కుటుంబాలను.

ఎర్రప్పా : వీరా, మనకు ఎన్ని పార్టీలు ఉన్నాయి, కులానికి సంభందము ఉందా? ఎక్కువ ముక్కమంత్రులు ఏ కులపోళ్ళు. అందరూ కులతత్వం అనో ఎదో అంటారే? అది, ఈళ్ళకు ఉందా?

వీరప్పా : ముక్కమైన పార్టీలు 3 , నాలుగోది కొత్తది. చేతి గుత్తు ఇందిరమ్మ, చైకిల్ చెంద్రన్న, ఫాన్ జగనన్న. కమలము వికసించదు, లెక్కలో లేదు. చేయి కూడా ఇరిగింది కదా, పార్లమెంట్ లో తలుపులు మూసి కారం జల్లుకున్న, ఇభజన దెబ్బకు . చేతి గుత్తు పార్టీలో, ఎక్కువ రెడ్డి రాజులే లేరు. చెంద్రన్న పార్టీలో, అసలు కమ్మ దొరలే ఉండరు. చెంద్రన్న గూడా, నాయుడే నంటా, పేరు చివర ఉంటాది. ఫాన్ పార్టీలో, అసలు రెడ్డి రాజులే లేరు, జగనన్న కూడా మారిపోయారు.

అధికారము కూడా, రెండు కుటుంబాలలోనే, లేనే లేదు. బూతద్దము ఏసి చూసినా, కులతత్వం ఎక్కడా, అసలు లేనే లేదు.

దాదాపు గా మంత్రులూ, ఎమ్మెల్యేలు అందరూ, వేరే వేరే కులమే. ఫాన్ సాయి, చైకిల్ సుజనా కూడా వేరే. ఎక్కువ మంది, ముక్క మంత్రులు లేదా హొం మంత్రులూ , రెడ్డి రాజులూ కాదూ, కమ్మ దొరలూ కాదూ. సత్తె పెమానకంగా అన్నాడు.

ఇంక కొత్తగా పవనాలు సారు, వచ్చాడు చినిమాలు ఇడిచి. ఆయనా, ఎదో కులాన్ని, నా కులమే అన్నాడు. ఆయన , ఇంకా అధికారం లోకి రాలేదు. ఆయందేమో, పొద్దున్నే మన చేతిలో ఉండే టీ కాపీ గలాసు అంటా.

నిజంగా పవనాలు సారు ముక్కమంత్రి అయితే గొప్పే మరి, ఎందుకంటే, ఈ కాలం లో, మూడవ కులానికి అవకాశం వచ్చినట్లే. బాగా కష్టపడి తిరుగుతున్నారు. తర్వాత చిన్నగా నల్గవ, ఐదవ కులాల వారు రావటానికి బాగుంటుంది అధికారం చేతులు మారితే.

ఎర్రప్పా : మామోయ్, ఎదో పేరుకే ఎర్రప్పని, బుద్ది లో కాదు. చెంద్రన్న ని చిత్తూర్ లో అలా పిలిచినా, అన్న గారి కూతురు ని ఇచ్చారు అంటే, ఆ మాత్రము తెలుసుకోలేని ఎర్రి పప్పను కాదు, అని పగలబడి నవ్వాడు.

ఆ రెండు కులాలలో కూడా, మంచి వాళ్ళు చాలమంది ఉన్నారు. మనూర్లో వెంకయ్య చౌదరి మావ , పెద్ది రెడ్డి బావ, అంత మంచోళ్ళు ఎక్కడ ఉన్నారు మావా. కానీ ఆ రెండు కుటుంబాలు తప్ప, వేరే వారికి అవకాశము ఇవ్వరు , వాళ్ళ కులంలో కూడా.

ఎందుకంటే కుట్రలు, కేసులు, కుతంత్రాలు, దోచుకోవడము, దాచుకోవడము, ఎన్నుపోటులు లో మాస్టర్ డిగ్రీ ఉండాలంటా. అన్నిటికీ, ఊగిపోయి అరిచే చెంచాలు ఉండాలి, అదో పెద్ద కళ అంట. ఈలైనప్పుడు అల్లా, పార్టీలు మాటలు ఇధానాలు వీజీగా మార్చాలి.

సరే వీరప్పా , మరి అమెరికాలో లేదా విదేశాలలో అన్నా, ఈ కుల తత్వం ఉండదు కదా? అంతా సదూకున్నోళ్ళు. .

వీరప్పా : అబ్బే, ఆళ్ళు చదూకున్నోళ్ళు, ఆణిముత్యాలు, మన లాగ పోసుకోలు కబుర్లు చెప్పరు, అంతా నిఖార్సుగా ఉంటాది, అక్కడ.

మొన్నా, గుడి దగ్గర, బాపనోళ్ళ రామయ్య బాబు వచ్చి చెప్పాడు - మామా, మేము బాగా చదువుకొని, ఇండియాలో తెలుగోళ్ళ లాగా తిట్టుకోము, తన్నుకోము. ఎక్కడి కక్కడ , వేరు వేరు గా, కావలసినన్ని -తన / మన- సంఘాలు పెట్టుకొని, కార్యక్రమాలు మాత్రము కలిసికట్టు గా చేస్తూ, నచ్చిన మెచ్చిన సినిమా వాళ్ళను రాజకీయ నాయకులను తెచ్చి తిప్పుతూ, తెలుగు దనాన్ని, ఇపరీతముగా ఇకచింప చేస్తున్నాము, ఈకెండులలో అన్నాడు.

కులము మరియు పార్టీ - లోపల అసలు ఉండదు, ప్రాంతం మాత్రమే బయటకు ఉంటాది అన్నాడు.

కుల లేదా పార్టీ మీటింగులు, అసలే ఉండవంటా. జెండాలు పట్టుకొని, కార్లు ఏసుకోని, ఇమానం నుంచి, ఎదురు స్వాగతాలు లేనే లేవంట.

ఎమిటో, ఈ చదూకున్నోళ్ళ మాటలు, అర్ధము అయి చావవు ఒక పట్టాన, అన్నాడు, నసుగుతూ.

ఎర్రప్పా : మామా, నాకు అర్దము అయ్యింది. నువ్వెంత తెలివిగా, తెలుగు పార్టీల కుల భాగోతం గురించి చెప్పావో, ఆ రామయ్య బాబూ, అలాగే చెప్పాడులే ఎటకారంగా.

సరే మావా, ఆ ఇద్దరు కన్నా, జన సంక్యా, బలము, మిగతా వాళ్ళకు, ఎక్కువ గదా. డబ్బుతోనే గెలిచే టట్టు అయితే, మొన్నే జగన్ బాబూ, మహ కూటమి గెలిచి ఉండేయి కదా. మన బామ్మలు, సాలీ, వైశ్య, యాదవ, కాపు, వడ్డెర, గిరిజన, హరిజనులు, మిగతా జాతులకి అసలు ఇంకో 15 ఏళ్ళకైనా ముక్కమంత్రి పదవి వస్తుందా?

వీరప్పా : ఒరే, ఎర్రప్పా, మన మిగతా కులాలలో, ఐకమత్యము ముందు చూపూ, లేవు. వాళ్ళిద్దరూ ఏసే పేలాలు , బిస్కత్తులు తీసుకుంటూ, మన బిడ్డలకు మంచి రోజులు లేకుండా చేస్తున్నాము. పెద్దోళ్ళు, కోట్లు వాళ్ళు తీసుకుంటూ, లక్ష కన్నా విలువైన ఓటుకు, చిల్లర నోట్లు విదిలిస్తున్నారు మన చిన్న బుద్ది చూసి.

కేసియార్ చూడూ, చ్చీ, మీ పేలాలు నా కొద్దు అన్నాడు. పక్క రాష్ట్రానికి ముక్కమంత్రి అయ్యాడు దమ్ముతో. కిక్కురు మనకుండా ఉన్నారు, వాళ్ళు , ఇద్దరు అక్కడ .

ఎర్రప్పా : నిజమే వీరప్పా, మనము ఇప్పుడైనా మేల్కొని, కుల గజ్జిని వదిలి, అందరికీ సమానము గా అవకాశము వచ్చేటట్టు ప్రయత్నిద్దాము. చూడు.

మరి మనకు, ఆ మాత్రము తెలివి విషయము లేదా. మిగతా కులాలకు అవకాశము లేదా ఎక్కువ సీట్లు వస్తే గదా, రేపు మనదాకా వచ్చేది అన్నాడు.

మన పిల్లోడు బిటెక్ అయ్యాక, ఉద్యోగం కోసము చూస్తాము. కొత్త పిల్లాడు ఎనక ఏమీ లేదు, ఒక్క చాన్స్ ఇవ్వమని. సినిమాలోనూ అంతే కదా. మరి ఇక్కడ ఎందుకు, అలా ఆలోచన చెయ్యమూ, అన్నాడు.

Dt : 16-Jan-2019, Upd Dt : 10-Apr-2019 , Category : Politics, Views : 555 ( id : 41 )
Tags : telugu state , election , minister , caste politics
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content