APLatestNews.com top Banner
         
భ్రాంతిలో శివ సంక్రాంతి - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
సంక్రాంతి పండుగ అయిపోయింది, భాగ్యనగరం నుంచి టికెట్ దొరక్క, నెల్లురు వెళ్ళలేదు మోహన్. శివ కి ఫోన్ చెసాడు, ఎలా పండగ చేసుకున్నారు అని.

శివ ఇలా చెప్పాడు. అబ్బో ఏమి సందడిలే రోజంతా, నవ్వులే నవ్వులు, ముగ్గులు, కోడి పందాలు, జనాలు, ఆటలు, పాటలు, పోటీలు, కేరింతలు, ఈలలు, డాన్సులు.

నిజమా, ఎక్కడ రా? కలగంటున్నావా? అని అడిగాడు మోహన్.

శివ - నిజమే చెపుతున్నా, రోజంతా తెలీకుండానే గడచిపొయింది అన్నాడు. మరి నీవు?

ఆఫీస్ పనితో తీరిక లేదు ఇంట్లోనే ఉన్నా అన్నాడు మోహన్, సరేరా ఇంట్లో గొడవలు అన్నావు. కట్నము చాల లేదని ఒక బావ, ఆస్తి ఇవ్వలేదని ఒక అక్క, అలిగి పండగ కు రాలేదు అన్నావు గదా. మరి ఈ సందడంతా ఏమిటి, గజి బిజి చేయక, అసలు విషయము చెప్పు అన్నాడు.

భలే వాడివి రా, నీ దగ్గర దాపరికం ఏముంది. జెమినీ టీవీలో, భీమవరం లో జరిగిన, సంక్రాంతి కార్యక్రమము చూస్తూ, రోజంతా గడిపేసాము అందరము. అలాగే ఈ టీవీ లేదా ఏ టీవీ అయినా కూడా ఫుల్ ప్రోగ్రాం లు. ఈ రొజుల్లో మనకు జనము, బంధాలు, ఆప్యాయతలు, బయట ఎక్కడా లేవు ఒక్క టీవీలలో తప్ప. గొడవలు మాత్రము ఉన్నాయి. టీవీ అయితే మనల్ని అది కావాలి ఇది కావాలి అని అడగదు. కాకపొతే చూపు తగ్గుద్ది, కళ్ళజోడు ఉంది కదా అన్నాడు, ఇంకా ఉన్న టీవీ మత్తులో.

నేను ఎంతో ఖర్చు పెట్టి, ఆ రైలు బస్సుల్లో నానా గడ్డి తిని, సాధించింది పొందింది ఇదే. కాకపొతే మన వాళ్ళను కలిసాను అనే ఆనందము ఉంది. కాకపొతే అది వచ్చే వారము అయినా ఫ్రీ గా రావొచ్చు, ఇంత రొచ్చు లేకుండా. నువ్వే నయము, పొదుపుతో హయిగా అక్కడే ఉన్నావు, అన్నాడు నవ్వుతూ.

నిజమేరా, మనకు ఇంట్లో చేతకానివి, దొరకనివి అన్నీ టీవీ, సినిమాలలో చూసుకుంటూ, బతుకు భ్రాంతిలో, సంక్రాంతి కూడా ఆనందము గా చేసుకున్నావు అద్రుష్టవంతుడివి రా.

మాకు కనీసము ఆ భ్రాంతి కూడా దక్కలేదు అని నవ్వుకున్నాడు, సాఫ్ట్ వేర్ భ్రాంతిలో నిండా మునిగిన బడుగు జీవి మోహన్. అమెరికా చుట్టాలు కూడా, ఇలాగే టీవీ లో, సంక్రాంతి ఎంజయ్ చేస్తారు, అన్న మాటలు గుర్తొచ్చాయి. రేపు మేనేజర్ అడిగే రిపోర్ట్ గుర్తొచ్చి మరలా పనిలో నిమగ్నమయ్యాడు.

Dt : 15-Jan-2019, Upd Dt : 10-Apr-2019 , Category : General, Views : 380 ( id : 40 )
Tags : sankranti
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content