
విజయవాడ దుర్గమ్మ తల్లి దగ్గరకు వెళదామని, బయలు దేరాము. దోవలో గుంటూరు దగ్గర జాతీయ రహదారి దగ్గరలో, హనుమయ్య (ఆంజనేయ స్వామి)పెద్ద భారీ విగ్రహం ఉంది. ఆయన బాధగా చూస్తున్నారు, ఎవరైన ఆగి మాట్లాడతారని ఇబ్బంది పంచుకోవటానికి. అందరూ బిజీ, యమా స్పీడ్ లో, లారీలు బస్సులు కార్లు ఇతర వాహనాలు.
కారు ఆపమన్నా, పక్కకు తీసి చెట్టు నీడన. మా వాళ్ళు లోపల ఉండి, ఏమిటో ఆకాశం/గాల్లో కి చూస్తూ పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో.
దూరము గా ఆయన. రోడ్డు పక్కన మేము. దండము పెట్టి, స్వామీ ఏమిటి విచారము గా ఉన్నారు అన్నాను. ఆయన నవ్వుతూ అన్నారు ఇలా - పెద్దమ్మ దగ్గరకు వెళుతూ, కారులో ఎయిర్ కండిషన్ వేసుకున్నవా కిటికీలు మూసి?
అవును స్వామి, ఎదో నన్ను శోధన చెయ్యలి అని అడగటమే గాని, మీకు తెలియనిది ఏముంది స్వామీ. మీ రక్షణలో బతుకుతున్నాము. విపరీతమైన ఎండలు ఒక వైపు, దుమ్ము ధూళి ధ్వని ఇంకో వైపు. తప్పదు స్వామీ కారులో, చలికి వెచ్చదనము ఎండకు చల్లదనము, కిటికీలు వేసి, అన్నాను నమస్కరించి.
అది సరేరా, మరి నా పరిస్తితి ఏమిటి, ఈ ఎండలో ఈ వానలో ఈ దుమ్ము ధూళి శబ్ధాలలో, మీరంతా నన్ను గౌరవిస్తున్నారా లేక ఇబ్బంది పెడుతున్నారా. మీరు హాయిగా ఇంట్లో కారుల్లో, చల్లదనము తో ఉంటే, నేను ఈ ఎండలో నిలబడి మీకు రక్షణ ఇవ్వాలా?
ఇదేనంటరా, కలికాలం లో రామ భక్తునికి ఇచ్చే మర్యాదా? పోనీ ఒక ఉరిలో సర్దుకుందాము అంటే, తెలుగు రాష్ట్రాలలో(దేశం లో) ప్రతి ఊరిలో 20 అడుగులకు తగ్గటము లేదు. రేపు ఆ విగ్రహము ఖర్మ కాలి పడితే, మరలా దేవునికి కోపము వచ్చింది అంటారు. ఏమిరా మీ తిక్క పనులు.
స్వామీ, క్షమించండి, మేము మాయా మోహములో పడి, ఏమి చేస్తున్నామో కూడా తెలియడం లేదు. పాత రోజులలో ఊరికి మొదలో చివరో సాంప్రదాయంగా 3 లేదా 5 అడుగుల ఎత్తు విగ్రహము పెట్టి, మండపము కట్టి, వీలైతే ఇనుప గేటు పెట్టే వాళ్ళము. కాస్త ఎండకు, వానకు, బాగుండేది.
ఇప్పుడు పొటీలు పడి, భారీ విగ్రహాలకు పోతున్నాము. మా అజ్ఞానానికి శపించకండి, ఆల్రేడి రహదారి దుర్ఘటనలు చాలా ఉన్నాయి ఇక్కడ. మా వాళ్ళకు చెపుతా, వింటారేమో.
అమెరికాలో లిబర్టీ విగ్రహము అంటే, మామూలు మనిషి లే అనుకోవచ్చు. అలాగే గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం. స్వామీ మీకూ, తప్పడము లేదు ఈ బాధలు. టాంక్ బండ్ దగ్గర, బుద్దునికి, ఆ సువాసన తప్పడము లేదు.
క్షమించండి స్వామీ, పోలీసు వాహనము వస్తుంది, ఎందుకు ఆగారు అని యక్ష ప్రశ్నలు వేస్తారు, అనుమతి ఇస్తే, అని బాధగా అడిగాను, నవ్వి జాగ్రత్త అన్నారు. ఎందుకంటే, ఆయన కష్టము తీర్చడము మన వల్ల కాదు. బయటకు చెపితే జనము, వినరు అరుస్తారు కోపముతో ఆ మాత్రం మాకు తెలీదా అని.
దుర్గమ్మను చూసి, వెనక్కి వచ్చేటప్పుడు, పెద్ద భవనము/అపార్ట్మెంట్ దగ్గర ప్రహరీ గోడకు బయట, చిన్న 2 అడుగుల గణపయ్య విగ్రహం ఉంది. ఆయన పరిస్థితీ అదే, ఆయన చెప్పే లోపే, నేను పాదాలకు దండము పెట్టి, స్వామీ మీకూ, హనుమయ్య బాధలే.
మీ పరిస్తితి ఇంకా ఘోరము. అయనన్నా ఠీవిగా, ఎత్తుగా ఉన్నారు, ఊరి బయట. మిమ్మల్ని మరీ, రోడ్ మీద ఓపెన్ గా , వాళ్ళ కింద మిమ్మల్ని వదిలేసారు, వాళ్ళు అంతా మీ పైన గూడులో ఉండి. మీకు చిన్న గుడి కట్టించాలంటే, క్షణము పని చిన్న ఖర్చు. కానీ వాళ్ళ మీటింగు లలో ఉన్న సమస్యల కంటే , మీది పెద్ద సమస్యా అని గమ్మున ఉన్నట్టున్నారు స్వామీ.
అయినా రోడ్ చివర గుడి ఉంటే, వెళ్ళటానికి బధ్ధకముతో, అసౌకర్యము గా మిమ్మల్ని ఇక్కడ పెట్టి, అనర్దాలు కొని తెచ్చుకుంటున్నారు స్వామీ. అని కన్నీళ్ళతో తిరుగు ప్రయాణము కొనసాగించాము హనుమయ్య, గణపయ్య అండతో.
ఎవరు అర్ధము చేసుకుంటారు వారి బాధ? ఎవరు తీరుస్తారు? ఈ విధము గా చెయ్యటము వల్ల పాపమే గానీ, పుణ్యము ఎటూ రాదు. కనీసము కొత్తవి అన్నా, నచ్చ చెప్పి ఆపగలమా? మా గాంధి, ఇందిరమ్మ, రామన్న, రాజన్న ల నే మేము గాలికి వదిలేశాము, మీరెంత అంటారేమో? జై హనుమా, జై జై గణేషా.
Dt : 14-Jan-2019, Upd Dt : 21-Feb-2019 , Category : General, Views : 166 ( id : 39 )
Tags :
hanuma ,
ganesh ,
anjaneya ,
vinaayaka ,
vigrahalu
Facebook Comments