APLatestNews.com top Banner
         
రాబోయే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హైందవ తులసి - లోకం తీరు(Loakam Teeru)
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
రాబోయే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు , డెమోక్రటిక్‌ పార్టీ తరపున, తన అభ్యర్థిత్వాన్ని తులసి గ్యాబార్డ్‌(37 సం) ప్రకటించారు.

తులసి నిజమైన హిందూ అమెరికన్ నాయకురాలు. అమెరికా కాంగ్రెస్ మొదటి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం అప్పుడు, భగవద్గీతపై ప్రమాణం చేసారు. ఆమె తన నియోజకవర్గానికి మాత్రమే కాకుండా, దేశములో మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూల శ్రేయస్సును ప్రభావితం చేసే సమస్యల పై, అంశాల పై స్పందించారు. తులసి , చట్టబద్ధత మరియు దౌత్యతకు సంబంధించిన విధానం లో కర్మ యోగం మరియు ధర్మ విధానం మార్గనిర్దేశం గా ఉంటుంది.

మీడియా లో మరియు పబ్లిక్ స్కూల్ పాఠ్య పుస్తకాల్లో, హిందు బోధనలు మరియు సాంప్రదాయాల గురించి, తప్పుడు మరియు అగౌరవ ప్రెజెంటేషన్లకు వ్యతిరేకంగా తులసి తన గొంతును వినిపించారు. ఆమె, భూమిని మరియు అన్ని జీవులను, గౌరవించే విధానాలను, సమర్ధించారు/ప్రశంసించారు.

ఆమె, పౌర మరియు మానవ హక్కుల కోసం, విరామం లేకుండా వాదించారు. హిందూ మైనారిటీల కొరకు మాత్రమే కాదు, బాధలు పడుతున్న అన్ని వర్గాల ప్రజల కొరకు కూడా.

అమెరికా భారత్ ద్వైపాక్షిక భాగస్వామ్యం ని తగ్గించాలని కోరుకునే వారికి వ్యతిరేకంగా ధైర్యముగా నిలబడ్డారు. ముఖ్యంగా, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం, మొదలగు వాటిని, నోటి మాటలు ద్వారా కాక, ఆమె చర్యల ద్వారా నిరూపిస్తూ, అమెరికా ను గొప్పదిగా చేయడం అనే ప్రాథమిక విలువ కోసం తులసి నిలబడ్డారు.

ముందుగా తను, తన పార్టీ నేతలలో, దేశ మరియు ప్రపంచ విషయాలు/విధానాలు /సమస్యల పై, సమగ్రముగా , మెరుగుగా వాదించి, జనాన్ని మెప్పించాలి. ఇలాంటి వాదనా సమావేశాలు, 3 లేదా 4 సార్లు దాకా జరుగుతాయి వివిధ నగరాలలో దేశములో ఎక్కడైనా. ఉదాహరణకు, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, టాంపా. తమ పార్టీ అభ్యర్దులతో ప్రైమరీ ఎన్నికల పొటీలో గెలవాలి. అలా గెలిస్తే, ఆమెను పార్టీ అభ్యర్దిగా ప్రకటిస్తారు. అప్పుడు, నేరుగా, ప్రెసిడెంట్ ట్రంప్ ని, ఢీ కొనవలసి వస్తుంది. ట్రంప్ ని ఎదిరించి నిలుస్తారో లేదో చూడాలి. ముందు గా తమ పార్టీ నేతలే, తన తప్పిదాలను ఎత్తి చూపి, తూర్పార బడతారు. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ వంతు.

భారత దేశము లో , రాజకీయ ప్రముఖుల పని చాలా తేలిక. ఇంత కష్టము లేకుండా, పదవిలోకి వస్తారు.

తులసి జన్మతః హిందువు కాదు, హిందూ మూలాలు ఉన్నాయి, కానీ బాల్యం లోనే హిందూమతాన్ని స్వీకరించారు. ఇరాక్‌ యుద్ధం లో ఆమె అమెరికా తరపున పోరాడారు. 2012లో హవాయి నుంచి మొదటిసారి చట్టసభ్యురాలిగా ఎన్నికయ్యారు. హవాయి నుంచి వరుసగా 4 సార్లు ఎన్నికయ్యారు.

Dt : 13-Jan-2019, Upd Dt : 22-Feb-2019 , Category : America, Views : 146 ( id : 38 )
Tags : Tulsi Gabbard , House of Representatives , presidential campaign

Facebook Comments