APLatestNews.com top Banner
         
భోగ సంక్రాంత కనుమ శుభాకాంక్షలు - తెలుగు జాతి పెద్ద పండుగ - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
​భోగ భాగ్యాల నెలవైన భోగి, కమ్మని సంతోషాల సంక్రాంతి, చక్కని వంటల కనుమ.
ఎప్పుడూ మీ ఇంట మరియు వెంట విరబోయాలి నవ్వుల పంట. అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

పంటలు చేతికి వచ్చి, సెలవలకు అందరూ కళ కళ లాడుతూ, చుట్టాలు , కూతుళ్ళు , కొడుకులు, మనుమలు తో సందడి సందడి గా ఉండే అతి పెద్ద తెలుగు పండగ ఇది. ఉత్తరాయణ పుణ్య కాలం మొదలు. మకర సంక్రాంతి రోజు పెద్దలకు నైవేద్యం పెట్టాలి, ఎందుకంటే వారి దయవలననే మనము ఈ రోజూ ఈ స్థితిలో ఉండి, సౌకర్యాలు పొందుతున్నాము. బతికి ఉన్నప్పుడే ముద్ద వేయము అనుకోకుండా, కొంచెము అయినా ఋణము తీర్చుకోవాలి.

పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తే, అయ్యో ఏమిటీ ఈరోజులు, ఏవి అలనాటి మధుర స్మ్రుతులు అనిపిస్తుంది. పొద్దున్నే 5 గంటలకు లెగిచి, పిల్లలందరు పిడకలు, కర్రలు, చినిగిన కాగితాలు వేసి చలిలో మంటలు వేసి, ఉదుతూ, దానిని పెంచుతూ, చుట్టూ కూర్చొని అనందము గా వెచ్చని మంటతో అందరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకునేవారు.

ఈ రోజు న, ఆ జనము లేరు, బంధాలు, భాంధవ్యాలు, స్నేహాలు, చలోక్తులు, చమత్కారాలు లేవు. అంత తీరికా లేదు, పొద్దున్నే లెగవము , అంతా అపార్ట్మెంట్ల మయం, పక్క వారితో మాటలు శూన్యం.

జనవరి మొదలు నుంచే రంగులతో ముగ్గులే ముగ్గులు. రధం ముగ్గూ వేస్తూ మా ఆవిడ తప్పి పోయింది అని జోకులు. అమ్మలు అక్కలు చెళ్ళెళ్ళు, పొద్దున్నే లెగిచి, వాకిలి చిమ్మి, పేడ తెచ్చి, కళ్ళాబి జల్లి, పక్క ఇళ్ళ వాళ్ళతో పొటీలు పడి, ముగ్గులు వేసే వాళ్ళు.

ఇప్పుడు, ఆ అవసరము, భూమి/వాకిలి, మనుషులు, పొటీలు లేవు.ఎందుకంటే పక్క వారితో మాటలు లేదా ఓపిక కూడా లేదు. అపార్ట్ మెంట్ దిగాలి అంటే పొద్దున్నే చలిలో బద్దకము , నెప్పులు బరువు తో.

రంగు రంగుల గాలి పటాలు కట్టి, పోటా పోటీ గా ఎగరవేసే వాళ్ళు స్నెహితులతో కలసి. ఎంత ఎత్తుకు పోతే అంత గొప్ప. బలమైన దారాలతో అవతల వాళ్ళ గాలి పటాలను తెంపే వాళ్ళు. అవి తెగిపొతే, వాటిని వెతుకుతూ దానివెంట పరుగులు తీసే వాళ్ళు, ఎలాగైన దాన్ని పట్టుకోవాలని.

కుంకుడు కాయల రసము కళ్ళలో పడి మండుతుంటే, వద్దు వద్దు అని పిల్లల ఏడుపులు. ఆరోగ్యానికి మంచిది, పండగ కూడా, నోరుమూసుకోని కుర్చో, అని నాలుగు పీకే అరుపులూ. ఇప్పుడు ఏమీ లేవు, కుంకుడు కాయలు తెలీదు, అనారోగ్యము తెచ్చే షాంప్ లు వచ్చాక. కుంకుళ్ళ తలక పొసే తల్లి లేదు, ఏడిచే పిల్లలూ లేరు.

పిండి వంటలు, ముఖ్యము గా నేతి బెల్లం అరిసెలు, 10 ఇళ్ళ అవతల దాకా గుభాయింపులు, కమ్మటి వాసనలు, అందరు కలిసి కష్టపది చేసే వాళ్ళు. ఇప్పుడు, కలిసే వాళ్ళు లేరు, ఓపికా లేదు, బయట కొట్లో ఎదొ ఒకటి కొనడము, ఆరోగ్యము సంగతి దేవునికి ఎరుక.

హరిలో రంగ హరీ అని, హరిదాసులు, కొంత మంది డూడూ బసవన్నలు వచ్చేవాళ్ళు. అయ్య గారికి దండము పెట్టు అంటే, ఆవు/ఎద్దు తల ఉపేది, అటు ఇటు తిరిగేది, ఊగేది . వారికి బియ్యము పొసి, గుడ్డలు ఇచ్చెవారు. ఇప్పుడు అన్ని కనుమరుగు.

కనుమ రోజు, మంచి మాంసము విందు గారెలతో. ఎడ్ల పందాలు. ఇప్పుడు రోజూ లేదా వారానికి 3 సార్లు తింటూ, ఆ రోజుకి ప్రత్యేకత లేకుండా పోయింది. ఎక్కడో ఒక చోట వింటున్నాము, ఎడ్ల లేదా కోడి పందాలు అని.

ఇప్పుడు అన్ని పాత సంగతులు, పాత సినిమాలలో, ఇంటర్నెట్ లో చూసుకుంటూ, నవీన మాయా ప్రపంచములో ఊహలలో తేలిపొతున్నాము, సస్వరూపతను పతనాన్ని మరచి.

అమెరికాలో అయితే ఆఫీసు పరుగులతో పండగలకు సమయము ఉండదు, కొంత మందికి అసలు పండుగనే సొయ కూడా ఉండదు. గుర్తు ఉన్నవాళ్ళు వారంతము లో గుడిలోనో లేక తెలుగు సంఘము చేసే కార్యక్రమములో పాల్గొని తమ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటారు. సిలికాన్ ఆంధ్ర వారు, మన తెలుగు ను బతికిస్తూ, చక్కటి తెలుగు కార్యక్రమాలను, తెలుగు దనము ఉట్టిపడేటట్లు గా , ఇక్కడ ఉన్న ప్రవాస తెలుగు వారికి అందిస్తున్నారు.

మరి ఆరొగ్యము, ఉత్సాహము పెరిగాయా? తరిగాయా? ఏమి కొల్పోతున్నామో తెలుస్తుందా నాగరికతతో?

Dt : 13-Jan-2019, Upd Dt : 10-Apr-2019 , Category : General, Views : 230 ( id : 35 )
Tags : sankranti , bhogi , kanuma , SiliconAndhra
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments