APLatestNews.com top Banner
  
శబరిమల గురించి వింటున్నాము, మాల వేసారా? మహిళల నిరసనలు ? - లోకం తీరు(Loakam Teeru) 31
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
Latest Telugu(AP and Telangana) News VideosLatest India(English) News VideosLatest India(Hindi) News VideosLatest USA(English) News Videos Press Releases/Note - News/Events/Pictures Latest Telugu Serials and Shows Videos Telugu Devotional Videos Telugu Movie News and Comedy Videos Telugu Full Length Movie Videos Indian/Andhra/Telugu Recipes(Cooking) Latest Sports News Latest Telugu/English News feed(Short Text Version) Telugu/English - India/USA Newspapers Polls - vote/share your thoughts? Live Streaming - Watch News Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live TVs Live Streaming - Listen Radio Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live Radio APLatestNews.com on Social Media Network
             
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
సత్యం శివాన్ని అడిగాడు, మాల వేయలేదా అని , ఈ సంవత్సరం కుదరలేదు. వేసినప్పుడు అన్నా బుద్ది గా ఉంటున్నా అని అందరూ అంటున్నారు అని నవ్వాడు.

సత్యాన్ని అడిగాడు, మరి నువ్వు అని. నేను ఎప్పుడూ బుద్ధి గా ఉంటా గదా , నియమాలతో అని నవ్వాడు.

సరేగాని అక్కడ గొడవలు జరుగుతున్నాయి మహిళలు వెళ్ళాలా లేదా అని అడిగాడు శివం. సత్యం నవ్వుతూ మహిళలు అందరూ అని అనొద్దు, కేవలం ఉదాహరణకు 10 నుంచి 50 వయస్సు వరకే వద్దు అన్నారు. మా ఆవిడ ను అడిగాను , వెళతావా అని. ఆమె చెప్పిన సమాధానం నాకే షాక్, ఎవరమన్నా బుద్ధి ఉంటే మా ఇంటికి రావద్దు అన్న వాళ్ళ ఇంటికి వెళతామా అని. గుడి సాంప్రదాయాన్ని గౌరవించకుండా దేవుడి మీద భక్తి, నమ్మకము అంటే ఎలా?

నిజమే, ఆ వయస్సు వారు రావద్దు అంటే , వెళతాము అని పట్టు పట్టి మరీ వెళడం ఏమిటి. ఎవరి గుడి సాంప్రదాయాలు వారివి. సిక్కు ల గుడికి తల గుడ్డ కట్టు కొని రమ్మంటారు , పాటిస్తూ వెళతాము అన్నారు సత్యం. ఎందుకు మాకు అని వాదించము .

ఇంకో మాట కూడా అంది , ఇంట్లో ఇన్ని పనులు , సీరియల్స్ వదిలి, ఇరుగు పొరుగు వాదనలు మాని , అన్ని రోజులు దీక్ష అంటే కష్టం అని. వెళతాము అనే సోదరీమణుల కు మా తెలుగు సీరియల్స్ చూపిస్తే ఇంక వెళతాము అనరు అంది నవ్వుతూ .

శివాన్ని అడిగాడు , ఏమిటి మండల దీక్ష 40 రోజుల కన్నా తక్కువ కూడా చేస్తున్నారు అంట. అవును ఇప్పుడు వారానికి, రోజు కి కూడా వేసుకుంటున్నారు అని విన్నాను దాని వలన ఏమి ప్రయోజనమో అన్నాడు.

Dt : 03-Jan-2019, Upd Dt : 14-Jan-2019 , Category : General, 157 Views, Tags : sabarimala , ladies , maala

Facebook Comments