APLatestNews.com top Banner
Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
Latest Telugu(AP and Telangana) News VideosLatest India(English) News VideosLatest India(Hindi) News VideosLatest USA(English) News Videos Press Releases/Note - News/Events/Pictures Latest Telugu Serials and Shows Videos Telugu Devotional Videos Telugu Movie News and Comedy Videos Telugu Full Length Movie Videos Indian/Andhra/Telugu Recipes(Cooking) Latest Sports News Latest Telugu/English News feed(Short Text Version) Telugu/English - India/USA Newspapers Polls - vote/share your thoughts? Live Streaming - Watch News Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live TVs Live Streaming - Listen Radio Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live Radio APLatestNews.com on Social Media Network
             
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వాలు కుడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి.
తత్వం 3 - భౌతిక పూజ కన్నా మానసిక పూజ గొప్పది(575 Views)
భౌతిక పూజ లేదా విగ్రహారాధన (10th class) కన్నా మానసిక పూజ(డిగ్రీ) గొప్పది, శ్రమ, ఖర్చు లేనిది, మోసగించలేనిది. దైవానికి, పరమ ఆనందానికి దగ్గర దోవ. ఆది గురువు లు నారాయణుడు‌ , శివుడు కూడా ధ్యానం చేస్తున్నారు. బుద్దుడు, మహమ్మద్, జీసస్ కుడా కనులు మూసుకొని ప్రార్ధన/ధ్యానం చేసారు. భౌతిక పూజ లేదా విగ్రహారాధన మొదటి మెట్టుగా చెప్ప బడింది. చిన్న పిల్ల వాడు నడిచేటప్పుడు 3 కాళ్ళ బండి ఎలా వాడుతాడో అలాగ.

మానసిక పూజ వల్ల చిత్తము(మనసు) నెమ్మదిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, కోరికల నుండి విముఖుడిని చేస్తుంది, ఆలోచనలను అదుపు చేస్తుంది.

6 గంటలు కష్టపడతాము అలంకరణ కు‌‌ , నైవేద్యం కు, ఊరేగింపు కు , తిరుపతి కి‌, షిర్డీకి, శబరిమల కు. కానీ అరగంట కళ్లు మూసుకుని రామ రామ(లేదా మీ ఇష్ట దైవ నామం) అని మనసు ను దైవానికి చిత్తశుద్ధి తో నైవేద్యం పెట్టటానికి ప్రయత్నం చేద్దాం ఇంట్లో. సరిగ్గా అర్థం చేసుకుంటే అన్ని ప్రశ్నలకు ఇందులో జవాబు ఉంది .

మనము కాని, మన పిల్లలు కాని 10th లో నే ఆగిపొతున్నమా? మరి భౌతిక పూజ(10th class) నుండి మానసిక పూజ(డిగ్రీ) కు వచ్చేదెప్పుడు? వచ్చే జన్మలోనా? లేక పై జన్మలోనా? ఇంకా బాధలు పడాలా? విముక్తి వద్దా? పిల్లలకు నేర్పుతున్నామా?

ఉన్నత స్ధానాల్లో, స్ధాయిలో ఉన్న వాళ్ళు కూడా, మనశ్శాంతి లేక, ఆశ్రమాల వెంట పడటము లేదా? చివరికి అదే కావాలి, పరమాత్మతో లయం. కాని అప్పుడు రొగాలతో, వయసు మళ్ళి(45 సం|| తర్వాత) , శరీరము సహకరిస్తుందా, నీ మాట వింటుందా? మొక్కై వంగనిదే మానై వంగుతుందా? 20 లలో కూడా చెడు మార్గములో పయనిస్తూ, మత్తులో ఊగుతూ, పెద్దలమాట వినక, అదుపులేని మనసుతో ఉన్న వాళ్ళు లేరా?
Dt: 2017-08-09


గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
Facebook Comments