APLatestNews.com top Banner
  
మనసు ఉంది మనకు అందరి లాగే , అది ఎటు పరుగెత్తుతుంది - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu) 28
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
Latest Telugu(AP and Telangana) News VideosLatest India(English) News VideosLatest India(Hindi) News VideosLatest USA(English) News Videos Press Releases/Note - News/Events/Pictures Latest Telugu Serials and Shows Videos Telugu Devotional Videos Telugu Movie News and Comedy Videos Telugu Full Length Movie Videos Indian/Andhra/Telugu Recipes(Cooking) Latest Sports News Latest Telugu/English News feed(Short Text Version) Telugu/English - India/USA Newspapers Polls - vote/share your thoughts? Live Streaming - Watch News Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live TVs Live Streaming - Listen Radio Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live Radio APLatestNews.com on Social Media Network
             
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మనసు ఉంది మనకు అందరి లాగే , అది ఎటు పరుగెత్తుతుంది ఎవరి సాంగత్యం లో అనేది ముఖ్యం. అది తెలిసి పరమాత్మ వైపు నడవడమే జీవిత లక్షం, కోరికలు లేని మనసు తో, పునర్జన్మ లేకుండా. అది ఈశ్వరుడు, అల్లా, ఏసు, లేదా ఏ గురువైన.

గురువు కోసం వెతకడం అనవసరం. మనకు కనపడే ప్రతి వ్యక్తి, మన గురువే. కొందరూ ఏమి చెయ్యకూడదో చూపిస్తారు. కొందరు ఏమి చెయ్యాలో చూపిస్తారు. అంతే తేడా. అర్థం చేసుకునే మనసు మనకు ఉండాలి.

దేవుని కి కావలసింది మన డబ్బు, ఆర్భాటాలు, పూజలు, నైవేద్యాలు కాదు. కన్నప్ప కు, వేమన కు, బ్రహ్మం గారికి ఏ ముంది ఏమిచ్చారు దేవునికి , నిర్మలమైన మనసు తప్ప. దానితో నే ఆయనలో లీనమయ్యారు. దేవుడు ఎంత సులభుడు , రూపాయి ఖర్చు అవసరం లేదు.

ఆయనకు కావలసినది , మన మనస్సు బుద్ది మాత్రమే, అదీ మన కోసం, జన్మచక్రం లో నుంచి బయట వేయటానికి. రోజూ కళ్లు మూసుకుని అరగంట చూడు లోనికి, మనకే తేడా తెలుస్తుంది. మోహం విడిచి చూడు , మనది లేదా ఎదుటి వారి రాతలు స్పష్టం గా కనపడతాయి. నవ్వు కుంటావు ఎదటి వాళ్ళ పిచ్చి చూసి. అలాగే వాళ్ళు కూడా నవ్వు తారు మన వెర్రి చూసి. నిశ్చలమైన మనసు కు , సుఖం కష్టం , గెలుపు ఓటమి, ఉచ్చం నీచం , సమభావన. అధర్మానికి దూరంగా ఉండనిదే ఇందులో మొదటి మెట్టు కూడా ఎక్కలేము, అర్థం కూడా కాదు.

విదురుడు, దుర్యోధనుని కి దగ్గర ఉండి కూడా, కుటీరం లో ఉండి , సామాన్యుడి లా తామరాకు లా బతికాడు. వారి మాయలలో పడకుండా , తప్పులు ల లో భాగం కాకుండా, జ్ఞాన భోధ చేస్తూ తప్పులు చెప్పారు.

భగవంతుడు రారాజు ఇంటికి వెళ్ళక , విదురుడు ఇంటికే వెళ్లి , ఉండి, ప్రేమతో ఇచ్చిన అరటి తొక్కను తిన్నారు.

నిర్మలమైన మనసు , ప్రత్యక్ష దైవాలైన తల్లి దండ్రులు లకు , సేవ చేయని లేదా దూరంగా ఉన్న మనసు, కోట్లు ఖర్చు పెట్టి కోటి దీపార్చన చేసినా లేదా లక్ష మందికి భోజనం పెట్టినా ఫలితం శూన్యం.

Dt : 16-Dec-2018, Upd Dt : 15-Jan-2019 , Category : Devotional, 153 Views, Tags :

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
Facebook Comments