Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఎంతమంది గురువు లు ఉండొచ్చు. ఒకరే అని విన్నా, కానీ, మీరు అందరూ గురువు లే అంటున్నారు.
తల్లిదండ్రులు మొదటి గురువులు, వారిని మించిన గురువులు ఇలలో లేరు. వారినే మనము అనాధలు గా వదిలివేస్తున్నాము. ఆధారపడిన అత్త మామలు ఉంటే, వారు తల్లి దండ్రులతో సమానమే. ఇంక గురువుతో, మనకు పని ఏముంది, విలువ ఏముంది, ప్రయోజనము ఫలితము శూన్యం. గురువు గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. తర్వాత చదువు నేర్పిన వారూ గురువులే. అప్పటికే కనీసము 3 అయ్యారు. ఈ రోజులలో భగవంతుని తప్ప, వేరే వాళ్ళని, ఆధ్యాత్మిక గురువులు గా నమ్మలేని పరిస్థితి.
ఒక్కరు అనేది దాటి పొయింది గదా. కావాలి అనుకుంటే మంచి గురువులలో ఒకరిని, ప్రధాన గురువు గా అనుకోవచ్చు.
కనపడే ప్రతి వ్యకి మనకు గురువే. ఒకరు మంచి నేర్పుతారు, ఇంకొకరు చెడు లో మునిగి, మనకు అది చేయకూడదని, ఉదాహరణతో సహా తెలుపుతారు. మత్తులో, జూదములో లేదా వ్యసనాలలో, గుల్ల అయిన వారు కూడా, మమ్మల్ని చూసి బుద్ది తెచ్చుకోండి అని, ప్రాక్టికల్ గా చేసి, ఋజువు చేసి చూపుతున్నారు. వారూ గురువులే, ఆచరణాత్మక(ప్రాక్టికల్) గురువు లు అనొచ్చు, ఎందుకంటే మిగతా వారు నోటితో, అనుభవముతో చెపితే, వీరు చేసి చూపిస్తారు.
భగవద్గీత 7 వ అధ్యాయములో, క్రిష్ణయ్య కూడా ఇలా చెప్పారు - సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాలోనే కలదు, నేనే ఈ జగమంతయు నిండి ఉన్నాను. కాబట్టి అందరిలోనూ దేవుడు గురువు ఉన్నట్లేనా. అది తెలుసుకొవటమే పెద్ద పని. అది ఆత్మ శోధన, సాధన,ధ్యానం లోనే బయటపడుతుంది. బయట వెతకాల్సిన పని లేదు.
గుడి గోపురాల చుట్టూ తిరిగి పూజలు చెయ్యల్సిన పని లేదు. బావాజి గుర్తు ఉన్నారా, వెంకన్నే వచ్చి పాచికలాడారు. ప్రహ్లాదుడు, నారాయణుడినే ఇంటికి రప్పించారు. రామదాసు, రామయ్య నే డబ్బు కట్టేటట్టు చేసారు రాజు దగ్గరకు వెళ్ళి.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,925; 104 తత్వాలు (Tatvaalu) and views 221,560 Dt : 02-Jan-2019, Upd Dt : 10-Apr-2019, Category : Devotional
Views : 1557
( + More Social Media views ), Id : 28 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
guruvu ,
krishnayya ,
parents ,
teacher Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments