APLatestNews.com top Banner
         
మన మనసులో ని భావాలు. నీ దోవ ఎటు? నీ రాత నువ్వే మార్చుకుని దేవుని నిందించద్దు. - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
భీష్ముడు లాగ గమ్ముగా ఉంటే ఫలితం లో మనం భాగస్వామ్యం పొందినట్టే. ఆయనకే కష్టం వస్తే, మనకు 100 రెట్లు వస్తాయి. ఎందుకు మన ప్రతి అడుగులో , మోసం , కపటం , అవసరం, కుట్ర , ధన దాహం.

నువ్వు మారకపోతే సమాజం ఎలా మారుతుంది ? దుష్ట సాంగత్యం కర్ణుని మింగేసింది.

ధర్మరాజు , క్రృష్ణయ్య, విదురుడు కౌరవుల తప్పులు ను ప్రతిక్షణం ఎత్తి చూపారు. దూరంగా ఉన్నారు. కౌరవ భోగాలకు , అవసరాలకు తలవంచ లేదు.

రాముడు, సుగ్రీవుడు , విభీషణుడు ఎదురు వారి తప్పులు నిరంతరం చెప్పారు. ఎందుకు, పాపాగ్ని లో ఎదుటి వారు దగ్ధం కాకూడదు అని. వారు వినలేదు.


ధర్మం గా ఉంటే అది మన బిడ్డకు మనం అడకుండానే సాయం చేసేవారు ముందుకు వస్తారు. నాకు ఇంకా వస్తూనే ఉన్నారు. మన పిల్లలు , మనుమలు మీద మనకు ప్రేమ ఉంటే ధర్మం నేర్పుదాం ధర్మం తో నడుద్దాం.

ధర్మం తో కష్టాలు తప్పవు , నేల మీద నడవాలి , లాభం ఉండదు, అరిషడ్ వర్గాలకు దూరం గా ఉండాలి. కానీ మనశ్శాంతి, సుఖనిదుర , రోగహీనం. పాండవులు, సుగ్రీవుడు, సీతా రామ, క్రృష్ణయ్య, విభీషణు, . . .

అధర్మం తో అరిషడ్ వర్గానికి బానిస తో , అందలం , సర్వ సౌఖ్యాలు , పతనం , గాలి మేడలు , వినాశనం. రావణ , వాలీ , ధుర్యోధనాది కౌరవులు, . . .

అవి పురాణాలు కావు , మన మనసులో ని భావాలు. నీ దోవ ఎటు? నీ రాత నువ్వే మార్చుకుని దేవుని నిందించద్దు. దేవుడు తెలివిగా బుద్ధి ఇచ్చాడు , సాక్షిగా చూస్తున్నారు. ఎందుకంటే నీ పాపమే నిన్ను పాపాగ్ని లో ముంచేస్తుంది.

Dt : 16-Dec-2018, Upd Dt : 23-Mar-2019 , Category : Devotional, Views : 253 ( id : 26 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.