APLatestNews.com top Banner
Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
Latest Telugu(AP and Telangana) News VideosLatest India(English) News VideosLatest India(Hindi) News VideosLatest USA(English) News Videos Press Releases/Note - News/Events/Pictures Latest Telugu Serials and Shows Videos Telugu Devotional Videos Telugu Movie News and Comedy Videos Telugu Full Length Movie Videos Indian/Andhra/Telugu Recipes(Cooking) Latest Sports News Latest Telugu/English News feed(Short Text Version) Telugu/English - India/USA Newspapers Polls - vote/share your thoughts? Live Streaming - Watch News Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live TVs Live Streaming - Listen Radio Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live Radio APLatestNews.com on Social Media Network
             
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వాలు కుడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి.
తత్వం 23 - దైవ ప్రార్దన - శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు - కరుణా మూర్తియగు దేవా (322 Views)
ప్రతి రోజు ఉదయం అందరూ దీనిని అర్దము చేసుకోని దేవుని ప్రార్ధిస్తే(వారి భాషలలొ వారి దేవుని), ఎటువంటి తప్పులు చేయము, బాధలను ఆనందముతో ఎదుర్కొంటాము, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, దేవుని క్రుప ఉంటుంది. పక్క వారితో(పని లో, ఇంట్లో, ఊరిలో,రాష్ట్రం లో, దేశం లో, ప్రపంచం లో) సమస్యలు ఉండవు, అందరు ఆనందము గా ఉంటాము.

కరుణా మూర్తియగు దేవా! మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందును మీ పాదార విందముల యందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి యుండునట్లు అనుగ్రహింపుము.

పరమదయానిధీ ప్రాతః కాలమున నిద్రలేచినది మొదలు మరల పరుండువరకు మనోవాక్కాయములచే మా వలన ఎవరికినీ అపకారం కలుగకుండునట్లును, ఇతర ప్రాణకోట్లకు ఉపకారము చెయులాగునను సద్బుద్దిని దయచేయుము.

సచ్చిదానందమూర్తి! నిర్మలాత్మా! మా యంతఃకరణములందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము గాని, విషయవాసనలు గాని అజ్ఞానవ్రుత్తి గాని జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపు.

వేదంతవేద్యా! అభయస్వరూపా! మా యందు భక్తి, జ్ఞాన వైరాగ్య బీజము లంకురించి శీఘ్రముగ ప్రవ్రుద్దములగు నట్లు ఆశీర్వదింపుము మరియు ఈ జన్మమునందే కడతేరి మీ సాన్నిధ్యమున కేతెంచుటకు వలసిన శక్తి సామర్ద్యములను కరుణతో నొసంగుము.

దేవా! మీరు భక్తవత్సలురు! దీనుల పాలిటి కల్పవ్రుక్షస్వరూపులు! మీరు తప్ప నాకు ఇంకెవరు దిక్కు! మిమ్ము ఆశ్రయించితిని. అసత్తు నుండి సత్తునకు గొనిపొండు! తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొండు, మ్రుత్యువు నుండి అమ్రుత్వమును పొందింపజేయుడు! ఇదే మా వినతి. అనుగ్రహింపుడు, మీ దరి జెర్చుకొనుము, పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి! - ఓం తత్ సత్
Dt: 2017-11-07

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
Facebook Comments