APLatestNews.com top Banner
         
భాగం 3 : బాబా శోధన - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
సరేరా , ఇది చెప్పు. 20 ఏళ్లుగా పాట సరే , మందిరం లో పూజ కాని , కాయ కానీ కొట్టలేదు.

బాబా నిజంగా మీకు నైవేద్యం పెట్టాలి అంటే మా ఊరు మొత్తం అమ్మినా సరి పోతుందా. ఇంట్లో నాకు వల్ల అయిన ది ఏదో పెట్టుకుని, పూజ చేసిన తర్వాత మాత్రమే గుడి కి వెళతా. మీరు అడిగింది,మనసు తో శ్రద్ధ మాత్రమే, అక్కడ రాసి ఉంటుంది. 6 రోజులు మనం ఇద్దరం మాత్రమే ఉంటాం మాట్లాడుతూ ఉంటాం. నాకు ఆదివారం సాయంత్రం గుర్తు, ఒక్క పురుగు కనపడదు. మన ఇద్దరం మాత్రమే. శ్రద్ద లేని పూజ , నైవేద్యం శుద్ధ దండగే. బాబా నవ్వారు.

సరేరా , అందరూ నా వల్లే గాలి వీచింది , డోరు తెరిచింది , పాస్ అయ్యింది, పదవి వచ్చింది, పిల్ల వచ్చింది, తల్లి పోయింది అంటారు. నువ్వు ఎప్పుడూ అలా అనవే. ఎందుకనీ?

గురువు ని అవమానించడం ఇష్టం లేక లేదా గురు బలం అర్థం అయి. అంటే ఏమిటి రా వివరంగా చెప్పు, నన్ను పొగిడితే తప్పా? నవ్వారు.

తండ్రి, తెలిసీ కావాలని అడిగారు. మీరు చిన్నప్పుడు మీ గురు ధ్యానం చేశారు, ఆయన మీకు ఆత్మ జ్ఞానం ఇచ్చారు కానీ భౌతిక సుఖాలను మీకు ఇవ్వలేదు. గురువు ఎప్పుడూ మంచి మార్గం వైపు చూపించి , దేవుని చేరే మార్గం చూపుతారు.

నేను నా గురు దైవం వలన , ఆత్మ జ్ఞానం, దైవ మార్గం దొరికిన ది అని గొప్పగా చెప్పుకుంటా. కానీ భౌతిక విషయాలు చెప్పి, అవమానించను సద్గురువు ని.

గమనిక - సత్వ గుణ సంపన్నులకు ఇందులో తత్వం మాత్రమే కనపడుతుంది, నేను , బాబా కాదు.

చెప్పినది అర్థం చేసుకొని తప్పు ను సరి చేస్తే లేదా ఒప్పును సమర్ధిస్తే నే , మీకు మనసు శాంతి కుసుమం తో నిండి ఉంటుంది.

జ్ఞాన వ్రృద్ది జరుగుతుంది. సత్వ గుణం చిన్నగా అలవాటు పడుతుంది లేదా ధ్రుఢ పడుతుంది. భీష్ముడు లాగా గమ్ముగా ఉంటే ప్రయోజనం ఎవరికీ లేదు.


Dt : 30-Dec-2018, Upd Dt : 18-Mar-2019 , Category : Devotional, Views : 118 ( id : 21 )
Tags : baba
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments