APLatestNews.com top Banner
         
మోక్షాన్ని అందుకోవటమే శాశ్వత ఆనందాన్ని పొందటానికి మార్గం - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu)
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మోక్షాన్ని పొందాలి అనే కోరిక ఉండాలి. మానవులంతా ఈ జీవితం బాగుండాలని, బాగా ధనం సంపాదించాలని, వస్తువులు కొనుక్కొవాలని, భోగం అనుభవించాలని - ఈ లోకంలో పరుగులు తీస్తూ ఉంటారు. వారికి శాస్త్రలను భోధిస్తామన్నా, సాధనలు చేయమన్న, సత్సంగాలు జరుపుకోమన్నా వారికి వినిపించదు.

ఉండవయ్యా బాబు! వీటితో కూర్చుంటే నాకేం వస్తుంది? అంటారు. ధనం సంపాదించే మార్గాలను చెబితే చెవులు రిక్కించుకొని ఎంతసేపైనా వింటారు. కాని, మోక్షాన్ని సంపాదించే మార్గాలను చెబుతానంటే ఒక్క నిముషం కూడా వినరు.

అలాంటి వానికి ఉద్ధారకం లేదు. జన్మను సార్ధకం చేసుకోవటం కుదరదు. ఎవరైతే మోక్షాన్ని అందుకోవటమే శాశ్వత ఆనందాన్ని పొందటానికి మార్గం అని తెలుసుకొని, మోక్షం కొరకు తీవ్రంగా తపన చెందుతారో వారికే మోక్ష మార్గం తెలుస్తుంది.

కర్మల ద్వారా మనం సంపాదించే ధనధన్యాలు, వస్తు సంపదలు అన్ని క్షీణించిపోయేవే. అలాగే పుణ్య కర్మల వల్ల సంపాదించే స్వర్గ భొగాలు కూడా క్షయమైపోయేవే.

Dt : 21-Sep-2017, Upd Dt : 16-Feb-2019 , Category : Devotional, Views : 604 ( id : 16 )
Tags :

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.