APLatestNews.com top Banner
         
కఠోపనిషత్తు - ఆత్మ, ఓం - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu)
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
నువ్వు అడిగిన ఆత్మ ఇంద్రియ అగోచరం. గూఢమైన చోట వుంది. హ్రుద్గుహ లో ఉంది. సనతనమైన దాని జ్ఞానయోగంతో తెలుసుకున్న ధీరుడు సుఖదుఃఖాలకు అతీతుడవుతాడు. అధ్యాయం 1, వల్లీ 2, మంత్రం 12

అన్ని వేదాలు ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నయో, దేనికోసం అన్ని తపస్సులూ చేయబడుతున్నాయో ఏది కోరి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారొ ఆ లక్ష్యాన్నే పొందల్సిన మంత్రము క్లుప్తముగ నీకు చెపుతున్నాను - ఓం. - అధ్యాయం 1, వల్లీ 2, మంత్రం 15

ఓం అనే ఈ మంత్రం భగవంతుడు. ఈ మంత్రం సర్వోత్తమమైనది. ఈ మంత్రాన్ని తెలుసుకున్న వ్యక్తి ఏం కోరుకుంటే అతనికి అది లభిస్తుంది. - అధ్యాయం 1, వల్లీ 2, మంత్రం 16

కేవలం ప్రసంగాలు వినటం వల్లో, పాండిత్యం వల్లో, శ్రవణం చేయటం వల్లో ఆత్మ లభ్యం కాదు. ఎవరికి దానికోసం తీవ్ర ముముక్షుత్వం ఉంటుందో అటువంటి సాధకునిచేత ఆత్మ తనంతట తానే పొందబడుతుంది. అతనికి తన స్వభావాన్ని వెల్లడిస్తుంది.- అధ్యాయం 1, వల్లీ 2, మంత్రం 23

చెడు ప్రవర్తన నుంచి వైదొలగని వాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, ఏకాగ్రత లేనివాడు, ఉద్రిక్తత ఆపుకోలేని వాడు, కేవలం వేదవిజ్ఞానం వల్ల ఈ ఆత్మను పొందలేడు.- అధ్యాయం 1, వల్లీ 2, మంత్రం 24

వయసు పెరిగినా పరిపక్వత లేనివారు ఒక వస్తువు నుంచి ఇంకోవైపుకి పరుగులు తీస్తారు. అంతటా ఉన్న మ్రుత్యుపాశంలో చిక్కుకుంటారు. కాని వివేకవంతులు అనిత్య ప్రపంచంలో నిత్య వస్తువును తెలుసుకుంటారు. వాళ్ళు అశాశ్వతత్వాన్ని కోరరు.- అధ్యాయం 2, వల్లీ 1, మంత్రం 2

11 ద్వారాలు గల దేహం, మార్పులేని చైతన్యముదే. ఈ విషయాన్ని శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా తెలుసుకున్న వ్యక్తి దుఃఖించడు. అతనికి ఇప్పుడే జీవన్ముక్తి, మరణం తర్వాత విదేహ ముక్తి కలుగుతుంది. అదే నువ్వు అడిగినది.

ఏకాదశ అంటే 11. అవి తలలో 7 - 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. 3 క్రింది భాగం లో - 2 చెత్త విసర్జనకి, 1 నాభి. 11 వది బ్రహ్మ రంధ్రం. గీతలో క్రిష్ణుడు 9 ద్వారాలే చెప్పారు. నాభి, బ్రహ్మరంధ్రం చెప్పలేదు, అవి నిత్యం ఉపయోగించేవి కావు కాబట్టి. - అధ్యాయం 2, వల్లీ 2, మంత్రం 1.

ఇక్కడ, మనుష్య జన్మలో, శరీరం పోయే లోపల ఆత్మను తెలుసుకుంటే సంసారం నుంచి విముక్తి పొందుతాడు. లెకపొతే మళ్ళీ మళ్ళీ లోకాల్లో పుట్టాల్సి వస్తుంది. - అధ్యాయం 2, వల్లీ 3, మంత్రం 4.

Dt : 18-Sep-2017, Upd Dt : 16-Feb-2019 , Category : Devotional, Views : 695 ( id : 15 )
Tags :

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.