APLatestNews.com top Banner
         
జపమాల/కరమాల తో జపం - ప్రశాంతత కు, ఏకాగ్రత కు తేలిక మార్గం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మనము ఈ రోజులలో పని వత్తిడిలో పడి లేదా విషయ వాసనలో మునిగి, బీపీ, షుగర్ పెరిగి, ఏమి చేస్తున్నామో తెలీక, దేని మీద ఏకాగ్రత కుదరక, అయోమయము లో పడిపోతున్నాము.

దాని నివారణకు, తేలికైన మార్గం, జపం ధ్యానం. కానీ కూర్చోని, నచ్చిన దైవం పేరు, మనసులో స్మరణ చేస్తూ ఉంటే, చిన్న గా నిద్ర వస్తుంది. తెలీకుండానే నిద్రపొతారు చాలామంది అలవాటులేక.

అందుకే, జపమాల. అందులో 108 పూసలు లాంటివి ఉంటాయి, కొంతమంది రుద్రాక్షలు మరియు ఇతరములు కూడా వాడుతారు. ముందు మనము జపం లో, ముడి దగ్గర మొదలు పెట్టి , ఒక్కొక్కటి వేళ్ళతో జరుపుకుంటూ పోతే, మరలా ముడి దగ్గర వచ్చిన తర్వాత ఆగవచ్చు. కొత్తగా జపం మొదలు పెట్టేవారి సాధనకు , ఇది అనువుగా ఉంటుంది.

అలా పూసలు జరిపేటప్పుడు, ఇష్ట దైవ నామ స్మరణ(రామ, ఓం నమశ్శివాయ, ఓం నమో నారాయణాయ) చేస్తే, 108 సార్లు జపించిన వారము అవుతాము. ఇలా వేళ్ళు పూసలను జరుపుతూ, నోటితో లేదా మనసులో నామస్మరణ చేసిన, నిద్ర వచ్చే అవకాశము లేదు.

అలా చిన్న గా అలవాటుపడితే, మాలలు తిప్పే సంఖ్య కూడా పెంచవచ్చు. మొదట గా ఒక సారి, తర్వాత 5 సార్లు, అలా మన ఓపికను బట్టి పెంచుకొని, ఎక్కువ సేపు జపము చెయ్యవచ్చు.

దాని వలన, మనసు ప్రశాంతమవుతుంది, అనవసరపు మానసిక ఆందోళనలు తగ్గుతాయి, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. చదువుకునే వారికి కూడా ఇది మంచిదే.

జపము అలవాటు అయితే, చిన్నగా ధ్యానం లోకి మారవచ్చు, ఇష్ట దైవ రూపాన్ని తలచుకుంటూ. అలాగే, మన ఆలోచన లోతుల్లోకి వెళ్ళి, దైవ శక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.

కరమాలతో కూడా తెలికగా లెక్కించవచ్చు, వివిధ రకాలుగా, జపమాల లేకుండా. ఒక చేతి, వేళ్ళ భాగాలు లెక్కిస్తే, 12 వస్తాయి. ప్రతి 12 భాగాల కి, 2వ చేతి లో, ఒక వేలు లెక్కించాలి. అలా 2 వ చేతితో, 9 సార్లు దాక లెక్కించిన, అది 108(12 * 9) అవుతుంది.

దీనితో వేరొక ప్రయోజనము కూడా ఉంది, చేతి వేళ్ళను అలా బొటన వేలితో నొక్కటము వలన, రక్త ప్రసారము బాగా జరుగుతుంది, మనలోని మిగతా శరీర భాగాలు కూడా ఉత్తేజ పడతాయి. ఎందుకంటే మన వేళ్ళ నుండి మిగతా శరీర భాగాలకు నాడులు ఉంటాయి అంటారు కదా.

జపమాల/కరమాల తో జపం - ప్రశాంతత కు, ఏకాగ్రత కు తేలిక మార్గం - Pic 2

Dt : 04-Jul-2019, Upd Dt : 04-Jul-2019 , Category : Health, Views : 114 ( id : 132 )
Tags : japamala , peace , concentration , meditation , karamala
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content