APLatestNews.com top Banner
         
బక్కెట్ స్నానంతో నీళ్ళు ఆదా, వ్యాయామం మరియు నామ స్మరణ కు అనుకూలం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
బక్కెట్ బాత్ ఛాలెంజ్ అనుకొని, షవర్ వాడకుండా , ఒక నెల రోజులు ప్రయత్నం చేద్దామా?

ఈ రోజుల్లో అందరూ, లావు తగ్గటానికి లేదా వ్యాయామం కు, జిం కు వెళుతున్నారు. సన్నగా ఉన్న వారు కూడా, ఆరోగ్యం ఉత్సాహం పెంచుకోవచ్చు కదా. మన స్నాన గదిలో కూడా, చిన్నపాటి పాత పద్దతిలో వ్యాయామం చేయవచ్చు. అలాగే దెవుడిని తలచడానికి కూడా, సమయము లేదు అంటారు చాలామంది, రోజూ పని వత్తిడిలో.

పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా, షవర్ జల్లులతో, నిఠారుగా నిలబడి, స్నానము చేసే పద్దతిని, కొంచెము మార్చిన, అదే మనకు కొంత వ్యాయామము గా ఉపయోగపడుతుంది. ఇది మన పూర్వీకుల వాడిన పద్దతే, ఇంకా పల్లెటూళ్ళలో, బహుశా వాడుతుంటారు.

షవర్ తో సూక్ష్మ క్రిముల ప్రమాదం కూడా ఉంది అంటారు, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోపోతే షవర్ హెడ్ ని. అనారోగ్యం తో ఉన్నవారిని లేదా శారీరక పరిస్తితిని బట్టి, ఇంకా ఇబ్బందులలో పెడుతుంది అంటారు.

షవర్ నుండి నీళ్ళు, బక్కెట్ లోకి పట్టండి. వంగి, నీళ్ళు ప్రతిసారి చెంబు/ జగ్గు/ డబ్బా తో, బక్కెట్ లో ముంచి తీసుకోండి. గమనించండి, ఎన్నిసార్లు అలా వంగి లేస్తున్నారో, పొట్ట మీద ఎంత భారం పడుతుందో, నడుములో ఎంత కదలిక వస్తుందో, గుండే ఎంత వేగము గా కొట్టుకుంటుందో.

ఈ పద్ధతిలో, ఎన్ని నీళ్ళు మీరు ఆదా చేసారో కూడా గమనించగలరు, చాలా తక్కువ నీరు వాడుతారు షవర్ కన్నా. నీళ్ళ గురించి పట్టించుకొనక పోయినా, వ్యాయామం కాదనలేని సత్యం.

కొంతమంది, 2 నిమిషాలలో తొందరగా ముగిస్తారు. అలా కాకుండా కనీసం 5 నుంచి 10 నిముషాలు, శరీరానికి మసాజ్ చేస్తున్నట్లు గా, గట్టిగా రుద్దుతూ స్నానం చేస్తే, అది కూడా వ్యాయామమే. రక్త ప్రసరణ పెరుగుతుంది, ఉత్సాహముగా ఉంటుంది.

డబ్బున్న వారు, పర్యావరణ కోసం ప్లాస్టిక్ వాడకుండా, ఇతర బక్కెనలు వాడొచ్చు. చెన్నై మహానగరం లో, నీటి కట కట వింటున్నారు కదా? హైదరాబాదు, ఒంగోలు, ఇంకా అనేక పట్టణాలు పల్లెటూర్లు నీటి సమస్య తో ఇబ్బంది పడుతున్నాయి.

కొంత మంది స్నానము చేస్తూ, సినిమా పాటలను కూని రాగాలు తీస్తారు, వాటి బదులుగా, దైవ నామ సంకీర్త న, లేదా భక్తి గీతాలు పాడుకోండి. ఆ 10 నిముషాలు, పుణ్యం పురుషార్దం రెండు కలుగుతాయి. ఉదాహరణకు, నారాయణ హరి నారాయణా అని పాడుతూ స్నానము చేస్తే, మీకే తెలియని ఉత్తేజము కలుగుతుంది, దేవుని విగ్రహానికి అభిషేకము చేసినట్లు గా. ఆత్మకు, మన దేహము కూడా దేవాలయము కదా.

అమెరికాలో బక్కెట్, జగ్గు, డాలర్ షాప్ లో దొరుకుతుంది తక్కువలో. పోయేదేముంది, ఒకసారి ప్రయత్నించి చూడండి.

పాత కాలం లో వాడే, కింద కూర్చొనే మరుగుదొడ్లు, ఆరోగ్యకరం. పొట్టమీద వత్తిడి, కలిగించి పని తేలిక చేస్తుంది. కాళ్ళు, మోకాళ్ళు గట్టిపడతాయి. మన తండ్రులు ఎంత బలంగా ఉన్నారు, మనము ఇప్పుడు? మరి ఇప్పుడు, పాశ్చత్య ఎత్తు దొడ్డి, మోకాళ్ళు వంగవు, తొందరగా పని కాదు.

ఆరోగ్యం విషయములో ఎదిగామా, తరిగామా? ఇంట్లో ఉండే ఉచిత వ్యాయామం వదిలి, డబ్బుతో జిం లు, దుమ్ముతో దొంగలు కు దొరకాలి బజారు నడకలు, పెట్రొల్ ఖర్చుతో బండి మీద గ్రౌండ్ కు.

Dt : 04-Jul-2019, Upd Dt : 04-Jul-2019 , Category : Health, Views : 201 ( id : 131 )
Tags : bucket bath , shower bath , save water , Exercise
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content