APLatestNews.com top Banner
         
ఇద్దరు అమ్మ లు ఎదురు ఎదురు గ ఉంటే ఎంత బాగుంటుందో - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఇంట్లో ఉన్న అమ్మవారిని, దేవుని పాటల ఊరేగింపు తో, ఎప్పటి లాగే గుడిలో ఉన్న రాజేశ్వరీ అమ్మ వారిని చూపించడానికి తీసుకువెళ్ళే భాగ్యం కలిగింది.

ఇద్దరు అమ్మ లు ఎదురు ఎదురు గ ఉంటే ఎంత బాగుంటుందో కదా , మన మాత ఒకవైపు, జగన్మాత ఇంకో వైపు. మన ఇంటి క్షేమం చూసే అమ్మ ఒకవైపు, ప్రపంచ క్షేమం చూసే పెద్దమ్మ ఇంకో వైపు. మన ఇంట్లో ఎన్ని తప్పులు చేసినా క్షమించే అమ్మ ఒకవైపు, అలాగే ప్రపంచ తప్పులు క్షమించే పెద్దమ్మ ఇంకో వైపు. అడగకుండా అన్ని ఇచ్చే అమ్మ ఒక వైపు, పెద్దమ్మ మరో వైపు. మా శివయ్య ను, పక్కన పెట్టారు ఇక్కడ.

ఇక్కడ తమిళ బ్రాహ్మణులు‌, మహా నిష్ట, మన కన్నా. లలితా సహస్రనామం చదువుతుంటే, మనమూ గొంతు కలిపితే తన్మయత్వంతో, శరీరం లో ప్రకంపనలు వస్తాయి అంటారు, అలాంటి అనుభూతి కలుగుతుంది.

భవాని అష్టకం , మహిషాసుర మర్ధని అష్టకం , అన్నపూర్ణ అష్టకం, ఇంకా ఎన్నో. అందరి లక్ష్యం, గొంతు ఒక్కటే, ఆర్తి తో జగన్మాత ను శరణు వేడడం, కమ్మని తీయని ఆధ్యాత్మిక స్తోత్రాలు తో. ప్రపంచంలో ఇక ఎక్కడా, మన అంత ఆధ్యాత్మిక సంపదను చూడం.

మనం కనులు తెరవాలి, మన లక్ష్యం ఏమిటి, విషయవాసనలా లేక ఆధ్యాత్మిక సంపదా. మొదటి ది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎవరికీ తెలీదు. మన ఎదురే కోటీశ్వరులు రోడ్డున పడ్డారు, లేని వారు ధనవంతులు అయ్యారు. రెండవది ఆధ్యాత్మిక, తొందరగా ఎక్కదు అర్ధము కాదు. అర్ధము అయితే మనలను వీడదు, భగవంతుడు లేదా ఆదిశక్తి వైపు నడిపిస్తుంది.

Dt : 30-Jun-2019, Upd Dt : 30-Jun-2019 , Category : Devotional, Views : 112 ( id : 128 )
Tags : maata , jaganmaata , raja rajeswari devi
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content