APLatestNews.com top Banner
         
ట్రెడ్ మిల్ నడక, బయట మైలు నడక, గుడి చుట్టూ ప్రదక్షిణలు - ఏది ఉత్తమం? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఈ రోజుల్లొ ఎక్కువ మంది, లావు తగ్గాలని, బరువు తగ్గాలని, ఆరోగ్యము కోసం నడక మొదలు పెడుతున్నారు, అది గుండె కు కూడా మంచిది రక్త ప్రసరణ బాగుంటుంది. గుడి దగ్గరలో ఉండి, దైవ ప్రదక్షణాలు కుదిరి, ఇష్టమైన వారికి మాత్రమే -

1. రబ్బరు ట్రెడ్ మిల్ మీద, అరగంట, బూటు తో నడక. ఏసీ లో లేదా మూసిన గాలి లేని గది లో నడక వ్యయామం. ప్రాణ వాయువు ఉండదు. భక్తి, పుణ్యం కు సంబంధం లేదు. కొంత మంది పడిన వారూ ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. అందరూ వాడిన పరికరము కాబట్టి, చెమటతో రోగాలు ఏమన్నా వస్తాయేమో శుభ్రముగా తుడవకపోతే. అర్థ రాత్రో , మధ్యాహ్నం మో వీలును బట్టి వాడుకోవచ్చు.

2. బయట మైలు నడక, బూటు తో , సమయం మన వీలును బట్టి. సరదా గా నలుగురితో కబుర్లు(తగువులు) తో లేదా వంటరిగా. దుమ్ము, ధూళి, రోగాలు, ప్రమాదాలు. దొంగ తంతాడో, చంపుతాడో, ఏమి లాక్కుని వెళతాడో, ఎప్పుడు ఏమి జరుగుతుందో అంతా దైవాధీనం. ఇంటిపక్కన గుడి ఉన్నా, పెట్రోల్ ఖర్చు బైక్ తో, దూరంగా ఉన్న గ్రౌండ్ కి వెళతారు.

3. పొద్దున్నే పరగడుపున, స్నానం తో, గుడి చుట్టూ 108 లేదా కనీసం సగం ప్రదక్షిణలు, ఉత్త పాదాలతో. పుణ్యం, పురుషార్ధం, వ్యాయామం, ఆరోగ్యం, భక్తి, దైవ చింతన. నోటితో మంత్రం ఉచ్చరిస్తే పుణ్యం, వాక్కు శుద్ధి అవుతుంది. దేవుని తలుస్తూ తిరిగి తే ఏకాగ్రత మరియు పుణ్యం. పెద్దలకే కాదు, చదువుకునే పిల్లలకు ఎంతో ఉపయోగము, మనసు అదుపు మరియు ఏకాగ్రత.

ప్రాణవాయువు, భద్రత, శుభ్రమైన గుడి ప్రాంతము, మనసు ఆహ్లాదం గా ఉంటుంది. కష్టం విలువ తెలుస్తోంది కూడా. పాదానికి స్పర్శ జ్ఞానం పెరుగుతుంది, ఆక్యుపెంచర్‌ లాంటిది.

కనీసం సెలవ రోజు, శని, ఆది వారం చెయ్యవచ్చు. ప్రదక్షణ తో, ఎన్ని లాభాలు ఉన్నాయో ఆలోచన చెయ్యండి. సవ్య దిశ లో చుట్టూ తిరిగితే మంచిది, నేరుగా ఒక దోవలో నడిచేకన్నా.

ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఈ వ్యాయామాని కైనా ముందు కాళ్ళు, నడుము, కీళ్ళ నొప్పులు వస్తాయి. భయపడకూడదు, ఆగి పోకూడదు. మన పెద్దలు, దైవ ప్రదక్షణాలు చేసి, సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నారు గతం లో.

డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా ఊరు ఆసుపత్రులకు అన్యాయం చేయలేము అంటారా, మీ ఆరోగ్యం మీ ఇష్టము.

మరి, మనమేం చేస్తున్నాము? మన పెద్దలు, ఎంతో ముందుచూపు తెలివితో, ఈ సంప్రదాయాలు పెట్టారు. పాత చింతకాయ పచ్చడి అని మనము, ఏదో చేయబోయి ఏదో చేసి , ఏవేవో కష్టాలు కొని తెచ్చుకోవడం.

Dt : 29-Jun-2019, Upd Dt : 29-Jun-2019 , Category : General, Views : 132 ( id : 126 )
Tags : tredmill walk , outdoor walk , temple walk
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content