APLatestNews.com top Banner
         
వీసా బాలాజీ కి 108 ప్రదక్షణాలు, ఓం నమో నారాయణ అనుకుంటూ - భాగం 1 - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఎప్పుడో వీసా బాలాజీ కి 108 ప్రదక్షణాలు బాకీ ఉంది. పెద్దాయన మనలను అడగకున్నా, ఇబ్బంది పెట్టకున్నా కూడా, పూర్తి చెయ్యవలసిన బాధ్యత సంస్కారం ఉన్న ప్రతి వారికీ ఉంటుంది. నమ్మకము లేక పోతే, అసలు ముందే వెళ్ళకూడదు. వెళ్ళాక, పని అయ్యాక, మానకూడదు.

ఎలాగైనా ఇప్పుడు చేద్దామంటూ, దగ్గరలో 4 సెంట్ల లో(4 గదులు అనుకోండి) ఉన్న చిన్న గుడి చుట్టూ, ప్రదక్షణాలు మొదలు పెట్టాను. అదెంత పని లే అని, గబ గబా 15 నిమిషాలలో తిరగ గలను అన్న పిచ్చి నమ్మకం తో. ఆ గుడిలో ప్రదక్షణకు, వెంకన్న, శివయ్య, రామయ్య, క్రిష్ణయ్య, అమ్మ వారూ ఉన్నారు.

50 చుట్లూ తిరిగే సరికి అర్థం అయింది, వయసులో పెద్ద వాళ్ళ ము అయ్యాము, అంత వీజీ కాదు అని. నోటితో ఓం నమో నారాయణ అని లోన అనుకుంటూ, పక్క వారికి ఇబ్బంది లేకుండా, ఎదురు మనసులో దేవుని రూపాన్ని తలచుకుంటూ, ఒక్కడినే ఎవరితో మాట్లాడకుండా, జనం రాని టైం లో , పరగడుపున పొద్దున్నే 9 లోపు తిరిగాను.

అబ్బో, నొప్పులు, కాళ్ళు ఎటు జరుగుతున్న వో తెలీదు, భారం గా అడుగులు పడుతున్నాయి, ఊపు తగ్గింది, అయినా మానకూడదు, విశ్రాంతి లేకుండా తిరగాలి చిన్న గుడే కాబట్టి. నారాయణ నామం పలుకుతూ తిరగడం వలన, నోరు పిడచ కట్టుకొని దాహంతో ఎండుతుంది.

ఖాళీ కడుపు లో ఆకలి, తిరిగినాకే తినాలి అని. సాక్స్ లేకుదా నడవడం వలన, నునుపు బండరాయి పాదానికి రాస్తూ ఉంటే చాలా ఇబ్బంది. అలాగే మొండిగా ఎలాగైనా పూర్తి చేయాలి అని తిరిగితే, గంట 5 నిమిషాలు పట్టింది.

అమ్మ దగ్గరలో కూర్చొని, నామ జపం చేస్తూ, మాలతో లెక్క వేసింది. ఉదయం జోడూనియా అని సాయి ని ఉదయ హారతి తో లేపే సాయి భక్తుడు, నారాయణ భక్తుడు అయ్యాడు అని, అక్కడ ప్రతి వారం చూసే జనం.

అలసటతో వెంకన్న ను చూస్తే, చిరునవ్వుతో, అలా రా నా దారికి, ఊరక వచ్చి, పది నిమిషాలలో పోవడం కాదు, ఇలా తిరిగితే కష్ట నష్టాలు తెలుస్తాయి అన్నట్లు గా ఉంది. ఆయనను చూసిన సంతోషములో, సగం బాధ మరచాము.

వామ్మో, ఈ చిన్న దానికే ఇంత కష్టం , ఇబ్బంది, సమయం పడితే నా లాంటి బండ మనిషికి, ఆ భక్తులు దేవ దేవుని దర్శనానికి, రైళ్ళలో నానా బాధలు పడి, తిరుపతి మెట్లు ఎక్కి , వరుసలో ఎంత సేపు వేచి ఉంటున్నారో కదా. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మనకన్న , వారికే ఎక్కువ కదా? అంతా దైవలీల. ఆ కష్టము తగ్గించడానికి, అన్ని ప్రాంతాలలో చిన్న తిరుపతులు వెలిసాయి, ఉదాహరణకు ద్వారకా తిరుమల, తెనాలి.

గమనిక - చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌(హిమాయత్ నగర్) మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. కోరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు. అక్కడ దాకా మరలా రాలేని వారు, వారి దగ్గరలోని వెంకన్న గుడిలో అదే మొక్కు చెల్లించుకుంటారు.

Dt : 29-Jun-2019, Upd Dt : 29-Jun-2019 , Category : Devotional, Views : 90 ( id : 125 )
Tags : visa balaji , Chilkoor Balaji Temple , Himayat Nagar , Hyderabad
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content