APLatestNews.com top Banner
         
ఫలితాల తర్వాత సిత్రాలు - మర్రిచెట్టు విత్తనాలు వేసి వేపచెట్టు రావాలి అంటే ఎలా - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ప్రజల, అంటే మన, మనసులో ని వికారాలే మన నాయకులు.

10 ఏళ్ళు చంద్రన్న భక్తులు తింటే లేని బాధ , జగనన్న భక్తులు తింటే తప్పు ఏంది అని అనుకున్నారు, అది తప్పెలా అవుతుంది, సమన్యాయం ఉండాలి గదా, అందరికి అవకాశం ఇవ్వాలి గదా.

కొత్త వారు వద్దు, వాళ్ళు ఇద్దరూ తింటే చాలు లే, మన ఇంట్లో పిల్లలూ తిన్నట్లుగా, అని భావించే త్యాగమూర్తులకు వందనాలు.

*

100 మంది జనం లో, అంటే మనం, 20 మంది చంద్రన్న భక్తులు, ఎప్పుడూ జగన్ ది తప్పు అంటారు పాలన చూడకుండా నే, ఆయన నాయనిది తప్పు అంటారు ఏమి చేసినా ఎంత చేసినా .

మరో 20 మంది జగన్ భక్తులు, చంద్రన్న ది తప్పు అంటారు, ఏది చేసినా ఎంత చేసినా.

మరి మిగతా 60 మంది, ఆ 20 మంది పబ్లిక్ గా తప్పు పట్టే నాయకులు తప్ప, మనకు ఇంక దిక్కు లేదు అనుకుంటున్నారు.

ఇందులో ఇంక ఎవరిని తప్పు పట్టాలి, ఎందుకు తప్పు పట్టాలి, అందరం ఆ తానులో ముక్కలమే గదా. మనకు లేని నీతి , మన పక్కింటి వాడికి ఉండాలి అంటే ఎలా?

*

నాయకుల ను తప్పు పట్టేవారు, ముందు తమ తప్పు ను , తమ ఇంట్లో ఉండే నేతి బీరకాయ నీతి ని, ఒప్పుకోవాలి.

యధా ప్రజా , తధా రాజా అని తెలియనిది కాదు గదా. ప్రజలు మర్రిచెట్టు విత్తనాలు వేసి వేపచెట్టు రావాలి అంటే ఎలా, ఎన్నటికీ రాదు కదా అన్నా?

*

ఒక ఊరు ఫలితం, చిత్రం మరీ విచిత్రం.

పైన జగన్ ఉండగా, మనం అనుకునే ఈ మంచి గెలిచి, ఆ మంచి ఓడిపోతే, మన ఈ మంచి కి వచ్చిన లాభం ఏముంది?

ఆ మంచి కి , వచ్చిన నష్టం ఏముంది? అంతా ఆ ఒక ఊరి ప్రజల మంచి మనస్తత్వం.

ఊరు లేదా జిల్లా అధికారం, మన ఈ మంచి మాట వింటారా? లేక అధికార పార్టీ ఆ మంచి మాట వింటారా?

Dt : 24-May-2019, Upd Dt : 24-May-2019 , Category : Politics, Views : 118 ( id : 123 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal , results
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

All best news at one place for NRIs
Multiple source NEWS from 6 yrs
No Ads or Spam, free Content